అలా అడుక్కుంటున్నారట.. అదిరింది, జబర్దస్‌లపై హైపర్ ఆది సెన్సేషనల్ కామెంట్స్!!
జబర్దస్త్ షోలో హైపర్ ఆది చేసే సందడి వేసే పంచ్‌ల గురించి అందరికీ తెలిసిందే. హైపర్ ఆది స్కిట్ మొదలెట్టాడంటే.. నాన్ స్టాప్ నవ్వులే. ప్రాసల ప్రవాహంలో అలా కొట్టుకుపోవాల్సిందే. బుల్లితెర త్రివిక్రమ్ అంటూ హైపర్ ఆదిని ఆకాశానికెత్తేస్తుంటారు. అలాంటి హైపర్ ఆది తాజాగా అదిరిపోయే సెటైర్లు వేశాడు. ఆ సెటైర్లను గమనిస్తే అందులో ఎంతో సమాచారం దాగి ఉంది. అందులో ఎన్నో నిజాలు దాగి ఉన్నాయి.

కొత్త గెటప్..
వచ్చే వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో హైపర్ ఆది వేసిన సెటైర్లు మరింత చర్చకు వచ్చాయి. ఈసారి హైపర్ ఆది బిచ్చగాళ్ల వేషం వేశాడు. అయితే ఆ గెటప్‌లకు కూడా ఎంట్రీ సాంగ్ వేయించుకున్నాడు. మనలాంటి అడుక్కునే వాళ్లకు కూడా ఎంట్రీసాంగ్ అవసరమా? అని శాంతి స్వరూప్ అంటాడు.

వరుసగా పంచ్‌లు..
అలా శాంతి స్వరూప్ అడగడంతో హైపర్ ఆది పంచ్‌ల ప్రవాహాన్ని వదిలాడు. ఈ ప్రపచంలో అడుక్కోని వారెవ్వరున్నారు. మనల్ని కామెడీ పెంచమని జడ్జ్‌లు అడుక్కుంటారు.. పేమెంట్లు పెంచమని మనం అడుక్కుంటాము.. క్లోజప్‌లు వేయమని అనసూయ అడుక్కుంటుంది.. వేరే షోలకు రమ్మని వాళ్లు అడుక్కుంటారు.. వద్ద ఇక్కడే ఉండమని వీళ్లు అడుక్కుంటారు.. మీరు మీరు కలిసి మమ్మల్ని మింగకండి మనం అడుక్కుంటాము అంటూ వరుసగా డైలాగ్‌లు చెప్పడంతో అందరూ పగల బడి నవ్వేశారు.

అదిరింది, జబర్దస్త్ మధ్య..
హైపర్ ఆది వేసిన ఆ సెటైరల్లో కొన్ని నిజాలే ఉన్నాయి. కామెడీ పెంచమనడం, పేమెంట్లను పెంచమనడం, అనసూయ క్లోజప్‌లు వేయమని అడుక్కోవడం వరకు అంతా కామెడీ కోసమే అయినా కూడా మిగతావి మాత్రం సీరియస్ పంచ్‌లని తెలుస్తోంది. ఎందుకంటే హైపర్ ఆదిని అదిరింది షోలోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
Recommended Video

రూపు రేఖలు మారాయి..
అసలే అదిరింది రూపు రేఖలు ప్రస్తుతం మారాయి. వర్షెన్ 2.ఓ లా అదిరింది కాస్తా బొమ్మ అదిరిందిగా మారింది. యాంకర్ రవి, భాను శ్రీలను పంపించారు. శ్రీముఖిని తెచ్చారు. నవదీప్‌కు గుడ్ బై చెప్పారు.. జానీ మాస్టర్‌కు వెల్కమ్ చెప్పారు. ఈ క్రమంలో హైపర్ ఆదిని కూడా పిలిచినట్టు టాక్. అందుకే ఈ రకమైన సెటైర్లు వేసినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











