యాంకర్ రష్మిపై షాకింగ్ కామెంట్స్.. సుధీర్‌ను ఇన్వాల్వ్ చేసి మరి.. పాప అలా ఉందంటూ!

యాంకర్ రష్మి అంటే తెలియని బుల్లితెర వీక్షకులు ఉండరు. ఎంతోకాలంగా అటు సినిమాల్లో, ఇటు టెలివిజన్ రంగంలో రాణిస్తూ సత్తా చాటుతోంది. ఇక సుడిగాలి సుధీర్-యాంకర్ రష్మి జంటకు ఉన్నంత క్రేజ్ ఏ జోడికి లేదనే చెప్పుకోవచ్చు. వీరిద్దరిపై వచ్చే లవ్ ట్రాక్స్, వీడియోలు బాగా ట్రెండ్ అవుతుంటాయి. అంతేకాకుండా వారికున్న క్రేజ్ పై కమెడియన్లు సైతం పంచ్ లు విసురుతూ మరింత కామెడీ ట్రై చేస్తారు. అయితే తాజాగా యాంకర్ రష్మిపై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

అలా మారడానికి: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరు రష్మీ గౌతమ్. ఎందుకంటే బుల్లితెరపై అంతలా ఈ సుందరాంగి తనదైన శైలి హోస్టింగ్‌తో అలరిస్తూ చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ యాంకర్‌గా ఎదిగిపోయింది. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. యాంకర్‌గా మారడానికి ముందే రష్మీ గౌతమ్ మోడల్‌గా సత్తా చాటింది.

 Anchor Rashmi Gautam

యాంకర్ అవకాశం: మోడలింగ్ రంగంలో రాణిస్తున్న సమయంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చాలా పాత్రలను పోషించింది యాంకర్ రష్మి. తెలుగు చిత్ర పరిశ్రమలో అరకొర అవకాశాలతో సాగిపోతోన్న రష్మీ గౌతమ్ కి బుల్లితెరపై కామెడీ షోగా పేరుపొందిన జబర్ధస్త్ కు యాంకర్‌గా అవకాశం వచ్చింది. అంతే.. అప్పటి నుంచి ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తోంది.

 Anchor Rashmi Gautam

లీడ్ రోల్స్: యాంకర్ గా రాణించడానికంటే ముందే సినిమాల్లో నటించిన రష్మీ గౌతమ్.. కొన్నేళ్ల క్రితమే హీరోయిన్‌గానూ పలు చిత్రాలను చేసింది. అలా ఇప్పటికే ఆమె ఎన్నో సినిమాల్లో లీడ్ రోల్ చేసింది. స్టన్నింగ్ అండ్ బ్యూటిఫుల్ యాంకర్ రష్మీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన 'గుంటూరు టాకీస్' మాత్రమే మంచి విజయాన్ని సాధించింది.

 Anchor Rashmi Gautam

జోడీకి ఫాలోయింగ్: గుంటూర్ టాకీస్ తర్వాత యాంకర్ రష్మీ గౌతమ్ లేడీ ఒరియెంటెడ్ సినిమాలు చేసినా అవన్నీ హిట్ కాలేదు. ఇటీవల వచ్చిన 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా కూడా రష్మికి నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి బుల్లితెరపైనే ఆకట్టుకునేందుకు సిద్ధమైంది ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్. ఇక సుడిగాలి సుధీర్-రష్మి జోడీకి బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. అందుకే ఈ జోడీపై వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తూ కామెడీని పండిస్తారు.

వర్షతోపాటు: తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ సమ్మర్ స్పెషల్ కింద ఓ పోగ్రామ్ చేశారు. ఇందులో పలువురు సీరియల్ నటీనటులు కూడా పాల్గొన్నారు. యాంకర్ రష్మి, వర్షతోపాటు మరో ఇద్దరిని బిందెలపై నిలబడి పాటకు డ్యాన్స్ చేయమన్నారు. పాట ఆగిపోయిన తర్వాత బిందెలపై ఉన్నవాళ్లు ఏ పొజిషన్ లో ఉన్నారో అలాగే ఉండాలి అని హైపర్ ఆది చెప్పాడు.

 Anchor Rashmi Gautam

పెదవి కొరుకుతూ: 'గున్న గున్న మామిడి' పాటను ప్లే చేశారు. ఆ సాంగ్ ఆపిన తర్వాత పెదవి కొరికినట్లుగా ఒక డిఫరెంట్ పోజిషన్ లో రష్మి ఉంది. పెదవి కూడా కదిలించొద్దన్న హైపర్ ఆది.. ఆ బాబు.. పాప మంచి మూడ్ లో ఉంది అనే మీనింగ్ వచ్చేలా అన్నాడు. హైపర్ ఆది అన్న డైలాగ్ కు అందరూ తెగ నవ్వేశారు. అయితే ఇక్కడ బాబు అంటే సుడిగాలి సుధీర్ ను ఇన్వాల్వ్ చేసినట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X