For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విష్ణుప్రియపై ఆది సంచలన వ్యాఖ్యలు: ఆమె లవ్ ట్రాకును లాగుతూ.. అతడి పేరును వాడేశాడుగా!

  |

  తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా సందడి చేస్తూ.. చాలా కాలంగా ప్రేక్షకులకు మజాను పంచుతోంది టాల్ బ్యూటీ విష్ణుప్రియ భీమనేని. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లను అందుకుంటూ వచ్చింది. అయితే, ఈ మధ్య కాలంలో బుల్లితెరపై ఈ బ్యూటీ పెద్దగా కనిపించడం లేదు. అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అమ్మడు జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో లవ్ ట్రాకును లాగుతూ విష్ణుప్రియపై టాప్ కమెడియన్ హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ ఏం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

   టీనేజ్‌లోనే అందాలు ఆరబోసింది

  టీనేజ్‌లోనే అందాలు ఆరబోసింది

  ఇంటర్ చదువుతోన్న సమయంలోనే విష్ణుప్రియ 'చెక్‌మేట్' అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అయితే, అప్పట్లో ఆగిపోయిన ఈ మూవీ.. ఇటీవలే మళ్లీ తెరపైకి వచ్చింది. గత ఏడాది ట్రైలర్ విడుదల చేయడంతో ఇది ట్రెండ్ అయింది. అందులో ఈ అమ్మడు క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లలోనూ రెచ్చిపోయింది. బికినీలోనూ కనిపించి షాకిచ్చింది. దీంతో అంతా షాకయ్యారు.

  అతడిపై రష్మీ గౌతమ్ రొమాంటిక్ కామెంట్స్: హీరో ఫొటో గోడ మీద.. అది మాత్రం బెడ్‌ మీద అంటూ!

  ఒక్క షోతో ఫుల్ ఫేమస్ అయింది

  ఒక్క షోతో ఫుల్ ఫేమస్ అయింది

  మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన విష్ణుప్రియ.. ఆ తర్వాత దగ్గుబాటి రానా 'నెంబర్ వన్ యారీ' షోకు సహాయకురాలిగా చేసింది. అనంతరం యాంకర్‌గా మారి 'పోవే పోరా' అనే షోతో సక్సెస్‌ను అందుకుంది. ఇందులో సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆమె చేసిన రచ్చకు మంచి మార్కులే పడ్డాయి. ఒకరిపై ఒకరు పంచులు వేసుకుంటూ ఎంతో సందడి చేశారు. దీంతో షో సక్సెస్ అయిపోయింది.

   సుధీర్‌తో లవ్ ట్రాక్... ఆమె క్లారిటీ

  సుధీర్‌తో లవ్ ట్రాక్... ఆమె క్లారిటీ

  కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే సుడిగాలి సుధీర్‌తో విష్ణుప్రియ ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో ఎక్కువగా ఫేమస్ అయింది. 'పోవే పోరా' షోలో వీళ్లిద్దరూ చనువుగా ఉండడం వల్లే ఈ పుకార్లు షికార్లు చేశాయి. అప్పట్లో ఇది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే దీనిపై ఆమె పలుమార్లు క్లారిటీ కూడా ఇచ్చింది. కానీ, ఆ వార్తలు మాత్రం ఆగలేదు.

  హాట్ ఫొటోలతో యాంకర్ విష్ణుప్రియ రచ్చ: ఎద అందాలు కనిపించేలా రెచ్చిపోయిన బ్యూటీ

   బుల్లితెరకు దూరమైన విష్ణుప్రియ

  బుల్లితెరకు దూరమైన విష్ణుప్రియ

  అప్పుడెప్పుడో బుల్లితెరపైకి ప్రవేశించినా.. విష్ణుప్రియ స్పెషల్ ఈవెంట్లు మినహా చాలా తక్కువ షోలలోనే కనిపించింది. ఆమె చేసిన షోలు స్టూడెంట్లతో నడిచేవి కావడంతో లాక్‌డౌన్ వల్ల అవి కాస్తా ఆగిపోయాయి. ఫలితంగా గత ఏడాది నుంచి ఈ బ్యూటీ బుల్లితెరపై కనిపించడం లేదు. కానీ, అప్పుడప్పుడూ కొన్ని షోలకు గెస్టుగా వచ్చి ఆ లోటును భర్తీ చేసేలా సందడి చేసేస్తుందామె.

  Recommended Video

  Anchor Suma జీవితం లోని ఆసక్తికర విషయాలు | HBD Anchor Suma
  జబర్ధస్త్‌లో రచ్చ చేసిన విష్ణుప్రియ

  జబర్ధస్త్‌లో రచ్చ చేసిన విష్ణుప్రియ

  చాలా రోజులుగా బుల్లితెరపై షోలు చేయని విష్ణుప్రియ.. ఇప్పుడు జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో చేస్తున్న టాప్ కమెడియన్ హైపర్ ఆది టీమ్ కోసం గెస్టుగా వచ్చిన ఈ బ్యూటీ తెగ అల్లరి చేసింది. అదిరిపోయే డ్యాన్సుతో పాటు రొమాంటిక్ డైలాగులతో రచ్చ చేసింది. మరోవైపు హైపర్ ఆది కూడా ఆమెపై పంచుల వర్షం కురిపించాడు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.

  విష్ణుప్రియపై లవ్ ట్రాకును లాగి

  స్కిట్‌లో భాగంగా విష్ణుప్రియ 'ఆది నువ్వు అంతా చిరాకుగా చేస్తున్నావ్. పెళ్లప్పుడు ఎంత రొమాంటిక్‌గా ఉండేవాడవో' అంటుంది. దీనికి ఆది 'ముద్దు పెట్టుకుందామంటే నీ ముక్కు అడ్డం వస్తుంది. హగ్ చేసుకుందామంటే నా పొట్ట అడ్డొస్తుంది' అని అంటాడు. ఆ తర్వాత 'బయట చల్లగాని.. లోపల పిల్లగాలి' అంటుందామె. దీనికి 'ఈ గాలులన్నీ ఆ గాలోడివే' అని సుధీర్‌ ట్రాకును గుర్తు చేస్తాడు.

  English summary
  Jabardasth Talented Comedian Hyper Aadi Did Shocking Comments on Anchor Vishnupriya Love Track in Jabardasth Skit. That Time He Used Sudigali Sudheer Name.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X