twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ ఓటమిపై హైపర్ ఆది సంచలన కామెంట్స్.. మద్యం, మానవత్వం అంటూ

    |

    Recommended Video

    Hyper Aadi Comments On Pawan Kalyan And Janasena Party Defeat || Filmibeat Telugu

    తెలుగు ప్రజల్లో ఇన్నాళ్లు నెలకొన్న ఉత్కంఠ నిన్నటితో ముగిసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో హోరాహోరీ పోరు ఉండటంతో గెలుపు ఎవరిదనే కోణం పెద్ద ఎత్తున చర్చలు సాగాయి. చివరకు వైసీపీ అధినేత జగన్ విజయ తీరానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్, చంద్రబాబును పక్కన బెట్టి పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంపై విశ్లేషణలో పడ్డారంతా. జనసేన పార్టీతో జనం ముందుకొచ్చిన పవన్ పరిస్థితి ఏంటా? అని జనంలో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది పవన్ కళ్యాణ్ ఓటమిపై కామెంట్స్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇంతకీ ఆయనేమన్నారు.. అసలు సంగతేంటి? వివరాల్లోకి వెళితే..

    భీమవరం, గాజువాక రెండు చోట్లా

    భీమవరం, గాజువాక రెండు చోట్లా

    పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు. భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాల్లోనూ పవన్ ని పక్కకు నెట్టేశారు ఓటరు మహాశయులు. ఈ రెండు నియోజక వర్గాల్లో వైసీపీ అభ్యర్థుల చేతుల్లో చిత్తుగా ఓడి పోయారు పవన్ కళ్యాణ్. అధికార టీడీపీ ఓట్లు చీల్చడం తప్పితే జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో సాధించిదేమీ లేదనే చెప్పుకోవాలి. దీంతో జనసేన వర్గాలు, పవన్ అభిమానులు కంగుతిన్నారు.

    రెండింటిలో వైసీపీ అభ్యర్థులే..

    రెండింటిలో వైసీపీ అభ్యర్థులే..

    జనసేన పార్టీ తరఫున పవన్ పోటీ చేసిన రెండు నియోజక వర్గాల్లో ఆయనపై వైసీపీ అభ్యర్థులే విజయం సాధించడం గమనార్హం. గాజువాకలో పవన్‌పై వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి గెలుపొందగా.. భీమవరంలో పవన్‌పై వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో చేసేది లేక పవన్ అభిమానులు గమ్మున ఉండిపోయారు.

    2019 ఎన్నికల్లో సినీ స్టార్లు... ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?2019 ఎన్నికల్లో సినీ స్టార్లు... ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?

     హైపర్ ఆది సెన్సేషనల్ కామెంట్స్

    హైపర్ ఆది సెన్సేషనల్ కామెంట్స్

    జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదికి పవన్ కళ్యాణ్ అన్నా, అలాగే మెగా ఫ్యామిలీ అన్నా చాలా అభిమానం. తాను పవన్ అభిమానినంటూ సగర్వంగా ప్రకటించుకున్న హైపర్ ఆది.. తన స్కిట్ల ద్వారా కూడా మెగా ఫ్యామిలీపై అభిమానం కురిపిస్తుంటారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఓటమిపై ఆయన స్పందించిన తీరు, చేసిన కామెంట్స్ సెన్సేషన్ అవుతున్నాయి.

    మద్యం, మానవత్వం అంటూ వరుస ట్వీట్స్

    మద్యం, మానవత్వం అంటూ వరుస ట్వీట్స్

    జనసేన ఓటమిని, పవన్ కళ్యాణ్ వెనుకంజను జీర్ణించుకోలేక పోయిన హైపర్ ఆది ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్స్ తో ఆశ్చర్యపరిచారు. జనసైనికులకు సారీ.. మనం రెండు చోట్లా ఓడిపోయాం అని మొదటి ట్వీట్ చేసిన ఆది ఆ వెంటనే.. ఈరోజు ఓడిపోయింది పవన్ కల్యాణ్ కాదు, తెలుగు ప్రజలు అని ఓ ట్వీట్, ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇది బ్లాక్ డే అని మరో ట్వీట్ పెట్టారు. ఇక చివరగా 2024 లో మనదే అధికారం అని ఆయన జెండా సింబల్ పెట్టడం విశేషం.

    English summary
    In 2019 Ap Elections Janasena Party loosed to catch the votes. Ysr cp got presigious win. In this topic Hyper Aadi commented sensetionally.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X