నాగబాబుపై హైపర్ ఆది సెటైర్స్.. అయ్యో పాపం! నాగబాబు పరిస్థితి ఇంత దారుణమా?

గత కొన్నిరోజులుగా జబర్డస్త్ కామెడీ షోకి సంబంధించిన అంశాలు వైరల్ అవుతున్నాయి. ఎప్పుడైతే నాగబాబు ఈ షో నుంచి తప్పుకున్నారో అప్పటి నుంచి జబర్డస్త్ తాలూకు అంశాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. అసలు నాగబాబు ఈ షో నుంచి ఎందుకు తప్పుకున్నారు? అనే ప్రశ్నతో మొదలుకొని ఆయనపై సెటైర్స్ వేసే స్థాయికి వెళ్లిపోయింది పరిస్థితి. అప్పుడు భజన చేసినోళ్లే ఇప్పుడు నాగబాబును ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది? వివరాల్లోకి పోతే..

 ఏడేళ్ల జబర్దస్త్ జర్నీ.. నాగబాబు అవుట్

ఏడేళ్ల జబర్దస్త్ జర్నీ.. నాగబాబు అవుట్

జబర్దస్త్ నుంచి తప్పుకున్న మెగా బ్రదర్ నాగబాబు మరో టీవీ ఛానెల్‌లో ప్రత్యక్షమయ్యాడు. అయితే జబర్దస్త్ నుంచి ఆయన తప్పుకోవడానికి ప్రత్యేకంగా రెమ్మ్యూనరేషన్ ఇష్యూనే కారణమని టాక్ నడించింది. కేవలం రెమ్మ్యూనరేషన్ కారణంగానే ఏడేళ్ల జబర్దస్త్ జర్నీ నుంచి నాగబాబు వైదొలిగాడని చెప్పుకున్నారు జనం.

జబర్దస్త్ మార్పులు.. నాగబాబుపై సెటైర్స్

జబర్దస్త్ మార్పులు.. నాగబాబుపై సెటైర్స్

దీంతో జబర్దస్త్ షోలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్ లో నాగబాబు లేకున్నా ఆయనపై పంచులేయడం హాట్ టాపిక్ అయింది. గతంలో జడ్జ్ స్థానంలో నాగబాబు కూర్చున్నప్పుడు ఆయను పొగుడుతూనే అప్పుడప్పుడూ పంచులు కూడా వేసేవారు కంటిస్టెంట్స్. అదే పరిస్థితిని రిపీట్ చేస్తూ నాగబాబుపై మళ్ళీ సెటైర్స్ వేయడం ఆసక్తి కలిగిస్తోంది.

నాగబాబుపై హైపర్ ఆది సెటైర్

నాగబాబుపై హైపర్ ఆది సెటైర్

ఓ స్కిట్‌లో భాగంగా మాజీ జడ్జి నాగబాబుపై అదిరిపోయే పంచ్ వేశాడు జబర్దస్త్ కంటిస్టెంట్ హైపర్ ఆది. తన స్కిట్‌లో భాగంగా తోటి కంటెస్టెంట్స్‌లతో డైలాగ్స్ చెప్పించి మరి నాగబాబుపై సెటైర్స్ వేయడం ఆసక్తి రేపింది. ''అరేయ్ మనం ఎప్పుడు ఇలాగే కలసి ఉండాలిరా అంటే.. వెంటనే హైపర్ ఆది ఏడేళ్లుగా కలసిన వారు విడిపోతున్నారు మూడేళ్లది.. బొక్క మన రిలేషన్ ఎంత'' అంటూ అదిరిపోయే పంచ్ వేశాడు హైపర్ ఆది.

భోజన వసతులు బాగోలేవని వెళ్ళిపోయాడు

భోజన వసతులు బాగోలేవని వెళ్ళిపోయాడు

ఇక ఇదిలా ఉంటే మరో జబర్దస్త్ కమెడియన్ చలాకి చంటి కూడా నాగబాబుపై అదిరిపోయే సెటైర్ వేశాడు. 'ఇక్కడ వేరే రాజు ఉండాలి కదా' అంటూ ఒక కంటెస్టెంట్ అడిగితే ఆయనకు 'ఇక్కడ భోజన వసతులు బాగోలేవని వేరే రాజ్యానికి వెళ్ళిపోయాడు.. వెళుతూ వెళుతూ మాకు ఈ రాజ్యాన్ని ఇచ్చి వెళ్ళాడు' అంటూ సెటైర్ వేశారు.

Recommended Video

CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
 నాగబాబుపై సెటైర్స్.. హాట్ ఇష్యూ

నాగబాబుపై సెటైర్స్.. హాట్ ఇష్యూ


అంటే.. జబర్దస్త్‌లో ఆయన ఉన్నప్పుడు భజన చేసిన జబర్దస్త్కమెడియన్స్ ఆయన వెళ్లిన తర్వాత కూడా నాగబాబు పైనే పంచులు వేస్తూ బుల్లితెర ప్రేక్షకులను నవ్విస్తున్నారన్నమాట. మొత్తానికైతే నాగబాబు వెళ్ళిన తర్వాత కూడా జబర్దస్త్ కామెడీ షో రేటింగ్ అనేది అలాగే మెయింటైన్ అవుతుండటం, నాగబాబుపై సెటైర్స్ పడుతుండటం హాట్ ఇష్యూగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X