twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శేఖర్ మాస్టర్ పరువు తీసిన హైపర్ అది.. ఒకేసారి ముగ్గురు హీరోయిన్లకు అంటూ షాకింగ్ కామెంట్స్!

    |

    హీరోలతో విభిన్నమైన స్టెప్పులు వేయించి ప్రేక్షకులను దగ్గర చేర్చే వారిలో కొరియోగ్రాఫర్స్ ఒకరు. ప్రస్తుతం స్టార్ కొరియోగ్రాఫర్ గా వెలుగొందుతున్నాడు శేఖర్ మాస్టర్. ఒకప్పుడు డాన్స్ మాస్టర్స్ అంటే కేవలం తెరవెనుక మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం టెలివిజన్ తోపాటు సోషల్ మీడియా కారణంగా చాలామంది టాలెంటెడ్ డాన్స్ మాస్టర్స్ ప్రేక్షకులకు దర్శనమిస్తున్నారు.

    ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ లో ఒకరైన శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు ఢీ షోలో డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన ప్రస్తుతం స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. తాజాగా ఆయనపై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్ చేశాడు.

    Pic Credits: ETV Dhee YouTube

    టాప్ కమెడియన్ గా..

    టాప్ కమెడియన్ గా..

    బుల్లితెర కమెడియన్ గా సినీ కెరీర్ ను ఆరభించి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు హైపర్ ఆది. ప్రతి ఫెస్టివల్ కి కానీ, సినీ సెలబ్రేషన్స్ కి కానీ స్పెషల్ ఈవెంట్ లు, ప్రోగ్రామ్స్ లో తనదైన కామెడీ పంచులతో అట్రాక్ట్ చేస్తాడు హైపర్ అది. సుధీర్ఘకాలంగా హైపర్ ఆది తెలుగు బుల్లితెరపై హవాను చాటుతూ టాప్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. పంచులు, ప్రాసల స్పెషలిస్టుగా పేరొందిన ఈ కమెడియన్ అనేక షోలలో సందడి చేస్తూ ప్రేక్షకులను ఎంతో నవ్విస్తూ దూసుకుపోతున్నాడు.

    అతి తక్కువ సమయంలో..

    అతి తక్కువ సమయంలో..

    సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా జీవితాన్ని ప్రారంభించిన హైపర్ ఆది.. బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ లోకి రైటర్ గా ఎంటర్టైన్ మెంట్ రంగంలోకి ప్రవేశించాడు. అనేక సినిమా స్పూఫ్ స్కిట్లతో పేరు సంపాదించుకున్న ఆది.. ఆ తర్వాత ఆర్టిస్టుగా అంటే కమెడియన్ గా మారి అదరగొట్టాడు. తను కనిపించిన ప్రతి స్కిట్లలో తన మార్క్ చాటాడు. దీంతో హైపర్ ఆదిగా అతి తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ మాత్రమే కాకుండా పలు షోలలో స్కిట్లతో ఎంటర్టైన్ చేస్తున్నాడు.

    ధమాకా సినిమాకు రైటర్ గా..

    ధమాకా సినిమాకు రైటర్ గా..

    బుల్లితెరపైనే కాకుండా సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది అందులోనూ తన మార్క్ చూపించాడు. తనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకున్న హైపర్ ఆది ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు. ఈ క్రమంలోనే కమెడియన్, నటుడు అల్లరి నరేష్ నటించిన 'మేడ మీద అబ్బాయి' మూవీతో సినిమాల్లోనూ డైలాగ్ రైటర్‌గానూ మారాడు. మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ధమాకాకు కూడా కొన్ని కామెడీ సీన్స్ రాశాడు హైపర్ ఆది.

    న్యాయ నిర్ణేతలుగా..

    న్యాయ నిర్ణేతలుగా..

    జబర్దస్త్ మాత్రమే కాకుండా 'ఢీ14', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలలో కూడా సందడి చేస్తూ ముందుకెళ్తున్నాడు హైపర్ ఆది. తద్వారా తన ఫ్యాన్స్‌ను అలరిస్తూ మరింత హైలైట్ అవుతున్నాడు. సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది 'ఢీ 15: ఛాంపియన్ షిప్ బ్యాటిల్'. ఈ డ్యాన్స్ షోకి యాంకర్ గా ప్రదీప్ వ్యవహరించగా.. ఒక టీమ్ కు మెంటార్ గా హైపర్ ఆది ఉన్నాడు. ఈ డ్యాన్స్ షోకి జడ్జస్ గా శేఖర్ మాస్టర్, గ్లామరస్ బ్యూటి శ్రద్ధా దాస్ కొనసాగుతున్నారు.

    శేఖర్ మాస్టర్ కామెంట్స్..

    శేఖర్ మాస్టర్ కామెంట్స్..

    ఇక తాజాగా ఢీ 15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్స్ తర్వాతి ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో డ్యాన్స్ లు, కామెడీతో వినోదం పంచడమే కాకుండా శేఖర్ మాస్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు హైపర్ ఆది. ప్రోమోలో బిగ్ బాస్ ఫేమ్ జెస్సీ ఒక కామెడీ స్కిట్ చేస్తుంటాడు. అయితే అది అతనికే బెడిసి కొడుతుంది. ఈ క్రమంలో చెప్పలేడు అంటూ అతనిపై శేఖర్ మాస్టర్ కామెంట్స్ చేస్తాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా నవ్వేస్తారు.

    మీరు ఏం చేశారో కాదు..

    మీరు ఏం చేశారో కాదు..

    జెస్సీ స్కిట్ తర్వాత మీ క్రష్ ఎవరు సార్ అని శేఖర్ మాస్టర్ ని యాంకర్ ప్రదీప్ అడుగుతాడు. భూమిక గారు అంటే ఇష్టం అని శేఖర్ మాస్టర్ చెబితే.. వర్క్ చేసిన వాళ్లలో అని మళ్లీ ప్రదీప్ అడుగుతాడు. దీనికి వర్క్ చేసినవాళ్లలోనా అనుకుంటూ అలా కొద్దిసేపు ఆలోచనలో పడిపోతాడు శేఖర్ మాస్టార్. అది చూసి.. మీరు ఏం చేశారో ఊహించుకోమనలేదు.. వర్క్ చేశారా అంటూ నవ్వుతూ సెటైర్ వేశాడు హైపర్ ఆది. దీంతో అందరూ తెగ నవ్వేశారు.

    ముగ్గురిపై టార్గెట్..

    ముగ్గురిపై టార్గెట్..

    తర్వాత భూమిక, ఐశ్వర్య రాయ్ ఇద్దరు ఇష్టం అని చెప్పిన శేఖర్ మాస్టర్.. కానీ నవ్వితే.. శ్రద్ధా దాస్ లాగా బుగ్గలపై డింపుల్స్ పడతాయి కదా అది క్యూట్ గా ఉంటుంది అని అన్నాడు. దీనికి ఏవండి.. ఒకేసారి ముగ్గురికి టార్గెట్ పెట్టడం మీతోనే సాధ్యం అయింది అని చేతులెత్తి మొక్కుతూ హైపర్ ఆది అన్నాడు. దీంతో శేఖర్ మాస్టర్ పరువు పోయినంతా పని అయింది. కానీ అదంతా కామెడీలో భాగంగా తీసుకుని శేఖర్ మాస్టర్ కూడా తెగ నవ్వేశాడు.

    English summary
    Jabardasth Hyper Aadi Satires On Sekhar Master In Dhee 15 Championship Battle February 8th Episode Promo About Bhumika Aishwarya Rai Shraddha Das.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X