దుర్గారావ్ పరువు తీసేశాడు.. డ్యాన్స్ చూస్తే అంతేనట.. హైపర్ ఆది కామెంట్స్ వైరల్
టిక్‌టాక్ అనేది ఎంతో మందిని ప్రపంచానికి పరిచయం చేసింది. మారుమూల ప్రాంతంలో ఉన్న వారికి కూడా స్టార్ స్టేటస్‌ను తెచ్చిపెట్టింది. అందులో ఈ మధ్య మరీ బాగా పాపులర్ అయింది దుర్గా రావ్. ప్రతీ పాటకు తమదైన స్టెప్పులతో, గెటప్పులతో నవ్వులు పూయిస్తుంటారు. టిక్ టాక్‌లో వీడియోలు చేసి పాపులర్ అయినా సరే గానీ అది బ్యాన్ అయ్యాకే మరింతగా పాపులర్ అయ్యారు. గత నెల నుంచి వీరు మీడియా, బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్‌లో దుర్గారావ్ సందడి చేస్తున్నాడు.

ఆ పాటకు స్టెప్పులు..
పలాస సినిమాలోని నాది నక్కిలీసు గొలుసు అనే ఫోక్ సాంగ్‌కు వెరైటీ స్టెప్పులు వేసి అందర్నీ నవ్వించాడు. అయితే ఈ పాటను, ఆ స్టెప్పులను, గెటప్పును ఢీ షోలో పండు అనే వ్యక్తి పర్ఫామ్ చేయడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయ్యాడు. ఆ ఒక్క పర్ఫామెన్స్‌తో ముగ్గురికి విపరీతమైన ఆదరణను తెచ్చిపెట్టాయి.

ముగ్గురు ఫేమస్..
నక్కిలీసు గొలుసు పాటకు దుర్గారావ్ వేసిన స్టెప్పులతో పండు పర్ఫామ్ చేయడంతో కంపోజర్ రఘు కుంచెకు బాగా పేరు వచ్చింది. ఆ పాట యూట్యూబ్‌లో ఫుల్ స్పీడ్‌లో దూసుకుపోయింది. మరో వైపు దుర్గారావ్ సిగ్నేచర్ స్టెప్పులు, పండు కూడా ఫుల్ ఫేమస్ అయ్యారు. ఇలా ఒక్క దెబ్బకు ముగ్గురి ఫేట్ మారిపోయింది.

బుల్లితెరపై సందడి..
ఇక అప్పటి నుంచి మీడియా చానెల్స్, యూట్యూబ్‌లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ సందడి చేశాడు. అంతేకాకుండా జబర్దస్త్ వేదికపై, ఢీషోలోనూ హంగామా చేశాడు. ఇలా దుర్గారావ్ ఓవర్ నైట్‌లో అమాంతం పాపులర్ అయ్యాడు. టిక్ టాక్ బ్యాన్ అయినా సరే గానీ దుర్గా రావ్ క్రేజ్ మాత్రం పెరుగుతూనే వస్తోంది.
Recommended Video

దుర్గారావ్ డ్యాన్సులపై హైపర్ ఆది..
తాజాగా రిలీజ్ చేసిన జబర్దస్త్ షో ప్రోమోలో హైపర్ ఆది పంచ్‌ల వర్షం కురిపించాడు. స్కిట్‌లో భాగంగా పరదేశీ డ్యాన్సులు చేసుకుంటూ ఎంట్రీ ఇవ్వడంతో పంచ్ వేశాడు. మామూలుగా దుర్గా రావ్ డ్యాన్స్ చూస్తే అందరూ కళ్లు తిరిగి పడతారు.. నీ డ్యాన్స్ చూస్తే ఆ దుర్గా రావ్ కూడా కళ్లు తిరిగి పడిపోతాడు అంటూ కౌంటర్ వేశాడు. ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











