రోజా చేసే పనులు అలాంటివి.. అదే నిజం.. ఒప్పుకోక తప్పదు: జబర్దస్త్ జడ్జ్‌పై హైపర్ ఆది కామెంట్స్

జబర్దస్త్ షోతో భారీ పాపులారిటీ సంపాదించాడు కమెడియన్ హైపర్ ఆది. జడ్జ్ రోజాపై, యాంకర్ అనసూయపై ఎలాంటి పంచులైనా వేయాలంటే అది హైపర్ ఆదికే సాధ్యం అన్నట్లుగా ఉంటుంది ఆయన తీరు. కాగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హైపర్ ఆది.. రోజా చేసే పనుల గురించి ప్రస్తావిస్తూ కొన్ని కామెంట్స్ చేశాడు. ఆ వివరాలేంటో చూద్దామా..

జబర్దస్త్ జడ్జ్‌ రోజా.. పక్కన ఆయన లేకున్నా!

జబర్దస్త్ జడ్జ్‌ రోజా.. పక్కన ఆయన లేకున్నా!

జబర్దస్త్ జడ్జ్‌ అనగానే ఠకీమని గుర్తుకొచ్చే పేర్లు రోజా, నాగబాబు. ఆ వేదికపై కమెడియన్స్ చేసే హంగామా కంటే.. జడ్జ్ సీట్లో కూర్చొని అంతకంటే ఎక్కువ హంగామా చేసేవారు ఈ ఇద్దరు స్టార్స్. అలాంటిది ఊహించని విధంగా ఆ ఇద్దరూ విడిపోయారు. అయినా కూడా రోజా ఒక్కరే జబర్దస్తీ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది.

రోజాపై హైపర్ ఆది కామెంట్స్.. వైరల్ వీడియో

రోజాపై హైపర్ ఆది కామెంట్స్.. వైరల్ వీడియో

ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో రోజా గురించిన ప్రశ్నపై ఆసక్తికర సమాధానమిచ్చాడు హైపర్ ఆది. రోజా సంగతులన్నీ రెండు మూడు ముక్కల్లో చెప్పేసి.. అదే అందరూ ఒప్పుకోవాల్సిన నిజం అని అన్నాడు. దీంతో హైపర్ ఆది చేసిన ఈ కామెంట్స్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రోజా చేసే పనులు అలాంటివి.. గ్రేట్

రోజా చేసే పనులు అలాంటివి.. గ్రేట్

ఒకపక్క పాలిటిక్స్ మరోపక్క టీవీ షోస్, ఇంకోపక్క గృహిణిగా బాధ్యతలు ఇవ్వన్నీ ఏకకాలంలో చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా వెళ్తోందంటే నిజంగా ఆమె గ్రేట్ అని చెప్పుకోవాలని హైపర్ ఆది అన్నాడు. పార్టీ ఫీలింగ్ లేకుండా సీరియస్‌గా అందరూ ఒప్పుకోవాల్సిన నిజం ఇది అని ఆయన పేర్కొన్నాడు. ఆవిడ చేసే పనులను ఎవరైనా అప్రిసియేట్ చేయాల్సిందే అని హైపర్ ఆది చెప్పాడు.

అనుష్క అంటే క్రష్..

అనుష్క అంటే క్రష్..

ఇకపోతే మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? అని యాంకర్ అడిగిన ప్రశ్నను దాటేయబోయాడు హైపర్ ఆది. చివరకు తప్పని పరిస్థితుల్లో ఆ విషయం చెప్పేశాడు. తనకు అనుష్క అంటే చాలా ఇష్టమని, క్రష్ కూడా ఆమెపైనే తప్ప ఇంకెవరిపైనా లేదని చెప్పాడు.

Recommended Video

Jabardast Comedy Show Judges,Team Leaders Remuneration Details || Filmibeat Telugu
నాగబాబు మెసేజ్‌లు చేస్తుంటారు..

నాగబాబు మెసేజ్‌లు చేస్తుంటారు..

నాగబాబు గురించి కూడా మాట్లాడిన హైపర్ ఆది.. మా అందరికీ బాగా కావలసిన వ్యక్తి నాగబాబు అన్నాడు. ఆయన ఎక్కడున్నా కూడా మేమందరం బాగుండాలనే కోరుకుంటూ ఉంటారని, మెసేజ్‌లు కూడా చేస్తుంటారని చెప్పాడు. నాగబాబుగారికి నేను ఎప్పటికీ దూరం కాదని ఆయన స్పష్టం చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X