Don't Miss!
- News
ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్.. హరీష్‌రావు ఆరోగ్యశాఖ ప్రగతి నివేదికపై వైఎస్ షర్మిల సెటైర్లు!!
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Finance
Gold price today: పసిడి ప్రియులకు అలెర్ట్.. తాజాగా బంగారం రేట్లు ఇలా.. కొనాలనుకుంటున్నారా?
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ఓ వైపు రోజా.. మరో వైపు అనసూయ.. మధ్యలో హైపర్ ఆది రచ్చ
సంక్రాంతి కోడి పందెలు ఫేమస్.. వెండితెరపై బాక్సాఫీస్ పోరు ఫేమస్. అయితే గత కొంత కాలం నుంచి బుల్లితెరపైనా ఓ పోరు నడుస్తోంది. స్పెషల్ ఈవెంట్లతో చానెల్స్ అన్నీ పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు వంటి చానెళ్లలో పోటీ ఓ రేంజ్‌లో ఉంటుంది. తమ తమ చానెళ్లలో నటించే సీరియల్ నటీమణులు లేదా స్పెషల్ షోలో చేసే ఆర్టిస్ట్‌లను ఒకే చోటకు తీసుకొచ్చి ఈవెంట్లను ప్లాన్ చేస్తుంటారు. ఇలా ఈ సంక్రాంతికి ముఖ్యంగా మూడు ఈవెంట్లు రెడీ అయ్యాయి.

పోటాపోటీ..
బుల్లితెరపై బరిలోకి దిగేందుకు చానెళ్లు తమ ఈవెంట్లను రెడీ చేశాయి. ఇందులో భాగంగా ఈటీవీ వారు అత్తో అత్తమ్మ కూతురో, స్టార్ మా వాళ్లు ఇట్సే ఫ్యామిలీ పార్టీ, జీ తెలుగు వాళ్లు సంక్రాంతి సంబరాలు అంటూ ఈవెంట్లు ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్లకు సంబంధించిన ప్రోమోలు కూడా ఇప్పటికి వైరల్ అయ్యాయి.

అత్తో అత్తమ్మ కూతురో..
ఈటీవీలో అత్తో అత్తమ్మ కూతురో అంటూ రోజాను అత్తగా పెట్టేసి, ఆది ఇమాన్యుయేల్ ఆటో రాంప్రసాద్‌లను అల్లుళ్లుగా పెట్టేశారు. వారికి జోడిగా అనసూయ వర్ష రోహిణలకు పాత్రలను ఇచ్చారు. ఇలా ఓ కాన్సెప్ట్‌తో ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. అయితే సంక్రాంతిని తలపించేలా ముగ్గులు, ఊరి వాతావరణం ట్రాక్టర్లు ఇలా అన్ని పట్టుకొచ్చేశారు.

ట్రాక్టర్లతో పోటీ..
మూడు జంటలకు ట్రాక్టర్ డ్రైవింగ్ పోటీలు పెట్టారు. ఇందులో వర్ష ఇమాన్యుయేల్, ఆది అనసూయ, రోహిణి రాం ప్రసాద్‌ల జంటలు మూడు ట్రాక్టర్‌లపైకి ఎక్కారు. ప్రదీప్ కూడా వారితో పాటు పోటీల్లో పాల్గొన్నాడు. అనసూయకు ట్రాక్టర్ డ్రైవింగ్ రాదు.. కనీసం యాక్సలేటర్, బ్రేక్ ఎక్కడుందో కూడా తెలియడం లేదు.. ఏదోలా మెల్లిగా స్టార్డ్ చేసింది.. అలా జెర్క్‌లు ఇస్తుండటంతో అది వణికి పోయాడు. నీకు కూడా డ్రైవింగ్ రాదా? అంటూ భయపడ్డాడు. కాపాడండిరో అంటూ ఆది కేకలు వేసేశాడు.

తాజాగా అలా..
అయితే
తాజాగా
రిలీజ్
చేసిన
ప్రోమోలో
మాత్రం
సంక్రాంతి
ముగ్గులు
వేశారు.
ఇక
వీటిలో
పోటీలుకూడా
పెట్టినట్టున్నారు.
రష్మీ
అనసూయ
బాగానే
ఆడుకున్నారు.
ఇందులోకూడా
ఇమాన్యుయేల్‌ను
బక్రా
చేస్తూ
రోజా
సెటైర్లు
వేసింది.

డ్యాన్స్‌తో రచ్చ..
ఈవెంట్ పేరుకు తగ్గట్టు అత్తో అత్తమ్మ కూతురో అనే పాటకు ఆది రోజా అనసూయ కలిసి డ్యాన్స్ చేశారు. మధ్యలో ఆది ఉండగా.. ఓ వైరో రోజా మరో వైపు అనసూయ ఉన్నారు. ఇక ఈ డ్యాన్స్ పర్ఫామెన్స్ చూసిన వారు తరించాల్సిందేనంటూ నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఈవెంట్ మొత్తానికి ఆ పర్ఫామెన్స్ అతి భయనాకంగా ఉండేట్టు కనిపిస్తోందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.