హైపర్ ఆది ఇంతటి టాప్ స్టూడెంటా? 10th, ఇంటర్‌‌లో మార్కులు చూశారా?

తన పంచ్‌లు, ప్రాసలతో బుల్లితెర ప్రేక్షకులను నవ్విస్తున్నారు హైపర్ ఆది. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చి తన ప్రతిభతో సెలబ్రిటీగా మారిపోయారు ఆది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఆయన తెలియని వాడంటూ లేరంటే అతిశయోక్తి కాదు. మాటకు మాట పంచ్ వేయడం, కరెంట్ ఇష్యూలపై సెటైర్లతో ఫన్ క్రియేట్ చేయడం ఆది శైలి. బుల్లితెరలో మాటల మాంత్రికుడిగా గత కొన్నేళ్లుగా కడుపుబ్బా నవ్విస్తున్నారు ఆది. టీవీ షోలు, ఇతర కార్యక్రమాలతో పాటు సినిమాల్లోనూ బిజీ అయ్యారు ఆది. కెరీర్‌లో సక్సెస్ కొట్టిన ఆది.. చదువుల్లోనూ టాప్ స్టూడెంటే. ఈ వివరాల్లోకి వెళితే..

ప్రకాశం జిల్లా చీమకుర్తి ప్రాంతానికి చెందిన హైపర్ ఆది చదువు పూర్తి చేసిన అనంతరం హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేశాడు. అయితే సినిమాలు, నటనపై ఆసక్తితో ఫ్రెండ్స్‌తో కలిసి చిన్న చిన్న కామెడీ వీడియోలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసేవాడు. అలా ఓ రోజున ఆది చేసిన ఓ ఫన్నీ వీడియో.. జబర్దస్త్‌లో టీమ్ లీడర్‌గా ఉన్న అదిరే అభి దృష్టికి వచ్చింది. వెంటనే ఆదికి కబురు పంపిన అభి.. తన టీమ్‌లో అవకాశం కల్పించారు.

Hyper Aadi Education Qualification Jabardasth Star mark sheet memos surprises you

హైపర్ ఆదికి మాటలు, సీన్ రాసే క్వాలిటీయే ఆయనకు పెద్ద ప్లస్‌గా మారింది. తొలుత అదిరే అభి టీమ్‌లో స్క్రిప్ట్ వర్క్స్ చూస్తూ వచ్చిన ఆయనకు స్టేజ్ మీద పర్ఫార్మ్ చేసే అవకాశం కల్పించాడు అభి. ఆ స్కిట్‌కు మంచి పేరు రావడంతో అప్పటి నుంచి ఆది వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ఇక టీమ్ లీడర్‌గా జబర్దస్త్‌లో ప్రభంజనం సృష్టించాడు. తన పంచ్‌లు, సెటైర్లతో కడుపుబ్బా నవ్వించి.. జబర్దస్త్‌కు సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారాడు. కేవలం ఆది స్కిట్ కోసమే జబర్దస్త్ చూసేవాళ్ల సంఖ్య పెరిగింది. తనలాగే నటనపై ఆసక్తి ఉన్నవారికి తన టీమ్‌లో అవకాశాలు కల్పిస్తూ వచ్చాడు.

జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షో తదితర కార్యక్రమాలలో అలరించాడు. ఇక సినిమాలలోనూ ఆదికి అవకాశాలు క్యూకట్టాయి. స్క్రిప్ట్‌తో పాటు నటుడిగానూ తన సత్తా చాటాడు ఆది. చిన్నప్పటి నుంచి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని కావడంతో తన అభిమాన నటుడు స్థాపించిన జనసేన పార్టీలో చేరి ఎన్నికల్లో పవన్ తరపున ప్రచారం చేశాడు. అయితే తెరపైనే కాదు.. చదువులోనూ ఆది టాపరే. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీలో హైపర్ ఆది మార్క్స్ లిస్ట్‌లను బయటపెట్టింది యాంకర్ రష్మి.

టెన్త్ మార్క్స్ లిస్ట్‌లో ఆది ఫోటో చూడగానే ఇంద్రజ షాక్ అయ్యింది. 10వ తరగతిలో టోటల్ 534 అని ఆది చెప్పాడంతో అందరూ అవాక్కయ్యారు. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగులో 85, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్‌లో 87, మ్యాథ్స్‌లో 96, సైన్స్‌లో 94, సోషల్‌లో 92, హిందీలో 80 మార్కులు వచ్చినట్లు రష్మి చదివి వినిపించింది. పల్లామళ్లి అనే ఒక విలేజ్ ఉంటుంది. అక్కడికి వెళ్లి సెవెన్త్ క్లాస్‌లో స్కూల్ టాపర్ ఎవరని అడగండి హైపర్ ఆది అని చెబుతారు. ఇప్పుడు హైపర్ ఆది.. అప్పుడు నా పేరు కోట ఆదయ్య. ఇప్పటికీ బోర్డ్ మీద నా పేరు ఉంటుంది. టెన్త్‌లో ఒక అమ్మాయికి నాకంటే 7 మార్కులు ఎక్కువ వచ్చాయి. హిందీలో మీరు నాతో రెండు నిమిషాలు మాట్లాడతారా అని రష్మి అడగ్గా.. అక్కడ మార్కులు వచ్చాయని మాట్లాడినట్లు కాదు, అక్కడున్నది మేం చదివేవాళ్లం, అది రాసేవాళ్లం మెమొరీ పవర్ అంతే అని ఆది చెప్పాడు.

టెన్త్ అయినా, ఇంటర్ అయినా, బీటెక్ అయినా నాకు కొంచెం మార్కులు తగ్గింది ఇంగ్లీష్‌లోనే. ఇంటర్‌‌లో నాకు 1000కి 945 మార్క్స్ వచ్చాయి.. అక్కడ కూడా నాకు ఇంగ్లీషే తగ్గిందని చెప్పాడు ఆది. అది చూసిన ఇంద్రజ చప్పట్లు కొట్టాలని చెప్పింది. ఆ వెంటనే టెన్త్ క్లాస్ మార్క్స్ షీటులో హైపర్ ఆదికి ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో చదివి వినిపించడంతో పాటు వాటిని చెక్ చేసింది కూడా. ప్రస్తుతం ఆ పాత వీడియో వైరల్ అవుతుండగా.. ఆది టాలెంట్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Read more about: hyper aadi jabardasth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X