ఆ రోజు లేడీస్ హాస్టల్‌లో తలదాచుకున్నా.. హైపర్ ఆది కష్టాలు అన్నీఇన్నీ కావుగా!

Hyper Aadi: తెలుగు బుల్లితెరపై తనదైన పంచ్‌లు, ప్రాసలతో కోట్లాది మంది ప్రేక్షకులను సంపాదించుకున్న స్టార్ కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi). జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఆయన, కమెడియన్‌గా, రైటర్‌గా, టీమ్ లీడర్‌గా తన ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలు, ఈవెంట్లతో బిజీగా ఉన్న ఆది విజయాల వెనుక ఎన్నో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు దాగి ఉన్నాయి. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఈ స్థాయికి చేరుకున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇటీవల ఓ ఈవెంట్ లో పాల్గొన్న హైపర్ ఆది తన జీవిత ప్రయాణాన్ని, కెరీర్ తొలినాళ్లలలో పడ్డ కష్టాలను వివరించారు. తాను బిలో మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చానని చెప్పారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని, చిన్న అవసరానికి కూడా ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయని తెలిపారు. కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండగా, చదువులు పూర్తయ్యాక కూడా ఉద్యోగాలు లేకపోవడంతో కుటుంబ బాధ్యతలన్నీ ఒక్కసారిగా తన భుజాలపై పడ్డాయని చెప్పారు.

Hyper Aadi Emotional success Story From Debt Struggles and Hostel Life to Stardom Success

హైపర్ ఆది మాట్లాడుతూ.. "మా నాన్న మా చదువుల కోసం ఎన్నో అప్పులు చేశారు. ఆ అప్పులు ఎలా తీర్చాలో కూడా అర్థం కాకుండా ఉండేది. ఆ సమయంలో నాకు సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ నెలకు వచ్చే జీతం కేవలం రూ.20 వేలే. ఆ డబ్బు మొత్తం వడ్డీలు కట్టడానికే సరిపోయేది. కుటుంబ అవసరాలు, అప్పుల భారం మధ్య నేను తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాను" అని ఆది వెల్లడించారు.

అయితే నటనపై ఉన్న ఆసక్తి కారణంగా ఉద్యోగాన్ని కొనసాగించలేకపోయానని చెప్పారు. ఉద్యోగం వదిలేయడం కుటుంబానికి మరింత భారంగా మారిందని, హైదరాబాద్‌లో కనీసం హాస్టల్ ఫీజు చెల్లించే పరిస్థితి కూడా లేదని గుర్తు చేసుకున్నారు. అలాంటి సమయంలో ఓ బంధువు తన పరిస్థితిని అర్థం చేసుకుని ఆశ్రయం కల్పించాడని తెలిపారు. "మా బంధువుల్లో ఒకరు హైదరాబాద్‌లో హాస్టల్ నిర్వహించేవారు. నా పరిస్థితి చూసి ఫ్రీగా అక్కడ ఉండమన్నారు. అయితే అది లేడీస్ హాస్టల్. అక్కడ ఒక చిన్న గదిలో తలదాచుకుని రోజులు గడిపాను. జీవితంలో ఆ రోజులు ఎప్పటికీ మర్చిపోలేను" అంటూ ఆది ఎమోషనల్ అయ్యారు.

ఆ సమయంలోనే తన జీవితాన్ని మార్చేసిన అవకాశం వచ్చిందని చెప్పారు. స్నేహితులతో కలిసి సోషల్ మీడియాలో చిన్న చిన్న వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండగా ఒక షార్ట్ ఫిల్మ్‌కు మంచి ఆదరణ లభించిందన్నారు. అదే వీడియోను చూసిన ప్రముఖ కమెడియన్ అదిరే అభి తనకు ఫోన్ చేసి అభినందించారని వెల్లడించారు."ఒకరోజు అదిరే అభి అన్న నుంచి కాల్ వచ్చింది. 'బ్రదర్.. నువ్వు చేసిన షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది. ఒకసారి వచ్చి కలువు'అన్నారు.

టీవీలో చూసే వ్యక్తి స్వయంగా ఫోన్ చేయడం నాకు పెద్ద షాక్. వెంటనే వెళ్లి కలిశాను. నేను రాసిన స్కిట్లు, నా ప్రెజెంటేషన్ చూసి ఆయన ఇంప్రెస్ అయ్యారు. అలా జబర్దస్త్‌లో నాకు మొదటి అవకాశం వచ్చింది" అని ఆది చెప్పారు. మొదట చిన్న చిన్న పాత్రలతో ప్రారంభమైన తన ప్రయాణం, తర్వాత రచయితగా, కమెడియన్‌గా, చివరకు టీమ్ లీడర్‌గా ఎదిగిందని తెలిపారు. జబర్దస్త్ ద్వారా వచ్చిన గుర్తింపు తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని అన్నారు. ఆ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో పాటు సినీ అవకాశాలు కూడా వరుసగా వచ్చాయని చెప్పారు.

తన కుటుంబం కోసం పడిన కష్టాలు చివరకు ఫలించాయని చెబుతూ ఆది మరోసారి ఎమోషనల్ అయ్యారు. "ఒకప్పుడు అప్పులు తీర్చడానికి మా కుటుంబం పొలం అమ్ముకోవాల్సి వచ్చింది. జబర్దస్త్ వల్ల వచ్చిన సంపాదనతో అదే పొలాన్ని మళ్లీ కొనుగోలు చేశాను. అంతేకాదు, అదనంగా మరో 20 ఎకరాల భూమి కూడా కొన్నాను. ఇప్పుడు మా కుటుంబం సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రులను బాగా చూసుకునే స్థితికి వచ్చాను" అని ఆనందం వ్యక్తం చేశారు.అంతేకాకుండా భవిష్యత్తులో తన కుటుంబానికే కాకుండా తన సొంత ఊరికి కూడా ఉపయోగపడేలా ఎదగాలని కోరుకుంటున్నానని చెప్పారు. "ఒకప్పుడు నా కుటుంబం కోసం కష్టపడ్డాను. ఇప్పుడు మా ఊరి కోసం ఏదైనా చేయగల స్థాయికి చేరుకోవాలని నా కోరిక" అంటూ హైపర్ ఆది భావోద్వేగంతో ముగించారు.

Read more about: jabardasth hyper aadi abhi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X