యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది.. సక్సెస్‌ఫుల్ షోలో బాలయ్య డైలాగ్‌తో బెంబేలెత్తించేశాడు.!
హైపర్ ఆది.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరిది. ఓ ఛానెల్‌లో ప్రసారమయ్యే కామెడీ షో 'జబర్ధస్త్' ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు ఈ యంగ్ కమెడియన్ కమ్ రైటర్. అతి తక్కువ కాలంలోనే ఓ టీమ్‌ను లీడ్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అప్పటి నుంచి ఈయన వెనుదిరిగి చూసుకోలేదు. పది నిమిషాల స్కిట్‌లో గుక్క తిప్పుకోకుండా పంచులు వేస్తూ సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే అత్యంత పాపులారిటీని దక్కించుకున్నాడు. అందుకే ఆది స్కిట్ వస్తుందంటే చాలు.. చాలా మంది టీవీల ముందుకు వచ్చేస్తుంటారు. అంతేకాదు, యూట్యూబ్‌లో సైతం ఆయన స్కిట్లకు భారీ స్థాయిలో వ్యూస్ వస్తుంటాయి. ఇప్పటి వరకు కమెడియన్‌గానే కనిపించిన ఆది.. తాజాగా యాంకర్ అవతారం ఎత్తాడు. ఇంతకీ ఏ షోకు అతడు యాంకర్ అయ్యాడు.?

ఆది ఎదుగుదలకు కారణం ఇదే
హైపర్ ఆది.. అదిరే అభి టీమ్‌లో సభ్యుడిగా బుల్లితెరకు పరిచయం అయ్యాడు. ఆ టీమ్‌కు రైటర్‌గా పని చేస్తున్న సమయంలో ఓ స్పెషల్ ఎపిసోడ్‌కు స్క్రిప్టు రాసే అవకాశం దక్కించుకున్నాడు. ఇది సూపర్ సక్సెస్ అవడంతో అతడిని ఓ టీమ్‌కు లీడర్‌ను చేసేశారు జబర్ధస్త్ నిర్వహకులు. ఇక, ఆది అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతున్నాడు.

యంగ్ హీరో సినిమాకు డైలాగులు
బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తిపును తెచ్చుకున్న హైపర్ ఆది.. వెండితెరపైనా ఎంట్రీ ఇచ్చాడు. వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ', ‘ఆటగదరా శివ', ‘మేడ మీద అబ్బాయి', ‘చిత్రలహరి' సహా పలు సినిమాల్లో నటించాడు. ఇందులో అల్లరి నరేష్ నటించిన ‘మేడ మీద అబ్బాయి'కి సంభాషణలు కూడా అందించాడు ఈ యంగ్ రైటర్. అయితే, ఈ సినిమా అనుకున్నంతగా ఆడలేదు.

‘ఢీ' షో సక్సెస్ వెనుక ఆది
దక్షిణ భారతదేశంలోనే భారీ డ్యాన్స్ రియాలిటీ షోగా పేరొందింది ‘ఢీ'. ఈ షో ఇప్పటికే పదకొండు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు పన్నేండో సీజన్‌ను కొనసాగిస్తోంది. ఈ షో ఎంత విజయవంతం అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఈ షో సక్సెస్ వెనుక ఆది ఉన్నాడని మాత్రం చెప్పాల్సిందే. దీనికి కారణం అతడు రాస్తున్న స్క్రిప్టులే అన్నది అంతా తెలుసుకోవాలి.
యాంకర్‌గా మారిన ఆది
ఇప్పటి వరకు కమెడియన్‌గానే కనిపించిన ఆది.. తాజాగా యాంకర్ అవతారం ఎత్తాడు. అది కూడా సక్సెస్‌ఫుల్ షో ‘ఢీ'లో. అవును.. ఆది ఈ షోలో యాంకర్ కమ్ మెంటర్‌గా కనిపించబోతున్నాడు. మరో యాంకర్ వర్షిణితో కలిసి అతడు పని చేయనున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో అతడి ఎంట్రీని ప్రత్యేకంగా చూపించారు.
Recommended Video

బాలయ్య డైలాగుతో బెంబేలెత్తించాడు
ఈ ప్రోమోలో హైపర్ ఆది ఎంట్రీని మాత్రమే చూపించలేదు. అతడి నోటి నుంచి వచ్చిన కొన్ని పంచులను, పవర్‌ఫుల్ డైలాగులు కూడా చూపించారు. ‘రవి, లాస్య, శ్రీముఖి.. ఇలా వచ్చిన వాళ్లు వచ్చినట్లే పోతుంటే.. ఈ సారి వచ్చే వాడు పోయే వాడు కాదు.. పోయించే వాడు కావాలి అని నన్ను పంపారు' అని ఆది చెప్పిన డైలాగు ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











