For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హైపర్ ఆది పెళ్లిపై నోరు జారిన తండ్రి: అమ్మాయిని చూసేశాం కానీ.. విష్ణుప్రియను లాగుతూ సంచలన వ్యాఖ్యలు

  |

  బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే ఎవరూ ఊహించనంత ఎత్తుకు ఎదిగిపోయాడు ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది. ఓ చానెల్‌లో ప్రసారం అవుతోన్న 'జబర్ధస్త్' అనే కామెడీ షో ద్వారా పరిచయం అయిన అతడు.. అసాధారణమైన టాలెంట్‌తో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. గుక్క తిప్పుకోకుండా పంచ్‌లు వేయగల అతడి నైపుణ్యానికి చాలా మందే అభిమానులు ఉన్నారు.

  ఇప్పుడిప్పుడే అంచలంచెలుగా ఎదుగుతున్న హైపర్ ఆది పెళ్లి గురించి ఊహించని న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా ప్రసారం అయిన ఈవెంట్‌కు అతడి తండ్రి వచ్చారు. ఈ క్రమంలోనే ఆది పెళ్లి గురించి ఆయన ఊహించని వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏం జరిగింది.? ఆ వివరాలు మీకోసం!

   జబర్థస్త్‌లో హైపర్ ఆది చాలా స్పెషల్

  జబర్థస్త్‌లో హైపర్ ఆది చాలా స్పెషల్

  ఎనిమిదేళ్లుగా ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ షోలో ఎంతో మంది టీమ్ లీడర్లుగా పని చేశారు. అయితే, ఈ కామెడీ షో చరిత్రలోనే హైపర్ ఆదిలా ఒంటి చేత్తో స్కిట్లను నడిపించిన వారు చాలా తక్కువ. అంతేకాదు, తక్కువ సమయంలోనే ఎక్కువ ఎపిసోడ్స్ గెలుపొందిన టీమ్ లీడర్‌‌గా అతడికి అద్భుతమైన రికార్డు కూడా ఉంది. అంతేకాదు, షోలోనే అతడు స్పెషల్‌గా నిలిచాడు.

  Shriya Saran: స్విమ్మింగ్ పూల్‌లో భర్తతో శ్రీయ రొమాన్స్.. నైట్ టైమ్‌లో రెచ్చిపోయి మరీ దారుణంగా!

  ఆది ప్రత్యేకత అదే.. భారీ ఫాలోయింగ్

  ఆది ప్రత్యేకత అదే.. భారీ ఫాలోయింగ్

  హైపర్ ఆది స్కిట్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూట్యూబ్‌లో అతడికి వచ్చే వ్యూస్‌ను బట్టే దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, అతడి స్కిట్ల కోసం టీవీల ముందు కూర్చునే వాళ్లూ ఉన్నారు. పది నిమిషాల పాటు ఉండే అతడి స్కిట్లో లెక్కపెట్టలేనన్ని పంచులు ఉండడం వల్లే అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో పెరుగుతోంది.

  అందులోనూ సత్తా.. వరుస అవకాశాలు

  అందులోనూ సత్తా.. వరుస అవకాశాలు

  సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై తిరుగులేని కమెడియన్‌గా వెలుగొందుతోన్న హైపర్ ఆది.. సినిమాల్లోకి కూడా ఎంటర్ అయ్యాడు. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో హీరో ఫ్రెండ్ పాత్రలు కూడా చేశాడు. అలాగే, 'ఆటగదరా శివ' అనే మూవీలో లీడ్ రోల్ చేశాడు. ఇక, అల్లరి నరేష్ 'మేడ మీద అబ్బాయి' అనే సినిమాకు సంభాషణలు అందించి డైలాగ్ రైటర్‌గానూ పరిచయమయ్యాడు.

  అరాచకమైన ఫొటోలను వదిలిన యాంకర్ వర్షిణి: తొలిసారి ఇంత హాట్‌గా.. వామ్మో చూస్తే తట్టుకోలేరు

  హైపర్ ఆది పెళ్లిపై ఎన్నో ప్రచారాలు

  హైపర్ ఆది పెళ్లిపై ఎన్నో ప్రచారాలు

  చేతి నిండా షోలు, సినిమాలతో బిజీ బిజీగా సాగుతున్న హైపర్ ఆది ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే మరిన్ని ఆఫర్లు అందుకుంటున్నాడు. దీంతో అతడు ఇంకా బాగా ఎదుగుతాడని చాలా మంది ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హైపర్ ఆది పెళ్లికి సిద్ధమయ్యాడని చాలా రోజులుగా ఎన్నో రకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి.

  ఆది పెళ్లిపై పెదవి విప్పేసిన తండ్రి

  ఆది పెళ్లిపై పెదవి విప్పేసిన తండ్రి

  నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని 'పెళ్లాం వద్దు పార్టీ ముద్దు' అనే ఈవెంట్ జరిగింది. దీనికి జబర్ధస్త్ కమెడియన్లతో పాటు చాలా మంది ప్రముఖులు వచ్చారు. ఈ ఈవెంట్‌కు రాంగోపాల్ వర్మ స్పెషల్ గెస్టుగా రాగా, ఇంద్రజ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఇందులోకి హైపర్ ఆది తండ్రి, సోదరులు వచ్చారు. ఈ సందర్భంగా అతడి పెళ్లిపై తండ్రి నోరు విప్పారు.

  Deepthi Shanmukh Breakup: దీప్తి సునైనా సంచలన ప్రకటన.. న్యూ ఇయర్‌ రోజు షణ్ముఖ్‌కు షాక్.. అందుకేనట!

  అమ్మాయిని చూసేశాం కానీ అంటూ

  అమ్మాయిని చూసేశాం కానీ అంటూ

  ఈ ఈవెంట్‌లో భాగంగా హైపర్ ఆది ముందుగా తన తండ్రి, సోదరుల గురించి చెప్పాడు. ఆ తర్వాత వాళ్లు కూడా అతడి గొప్పదనం గురించి వివరించారు. ఈ క్రమంలోనే ఇంద్రజ.. ఆది పెళ్లి గురించి చెప్పమని అతడి తండ్రిని కోరింది. దీనికి ఆయన 'ఒంగోలులో ఒక అమ్మాయిని చూశాం. రెండేళ్ల తర్వాత చేసుకుంటా అన్నాడు. అంటే వాడికి ఇష్టం లేదనే కదా' అని చెప్పారు.

  యాంకర్ పరువు తీసిన ఆది తండ్రి

  యాంకర్ పరువు తీసిన ఆది తండ్రి

  హైపర్ ఆది తండ్రి మాట్లాడిన తర్వాత ఆటో రాంప్రసాద్.. 'మీకు ఎలాంటి కోడలు కావాలి' అని అడిగాడు. ఆ తర్వాత విష్ణుప్రియ పేరును తీశాడు. దీంతో ఆది తండ్రి 'మాకు మా పరువు నిలబెట్టే అమ్మాయి కావాలి. ఏది పడితే అది చేసే అమ్మాయి కాదు' అంటూ ఆమె పరువు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

  English summary
  Jabardasth Talented Comedian Hyper Aadi Participated in Thaggedele Diwali Special Event. He Fighting with Roja In This Event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X