For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ సీరియల్ నటితో ప్రేమలో పడ్డ హైపర్ ఆది: ఆ షోలో బయటపెట్టిన కమెడియన్

  |

  జబర్ధస్త్ షో ద్వారా తెలుగు బుల్లితెరపైకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది కమెడియన్లుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే అనతి కాలంలోనే ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగిపోయారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు హైపర్ ఆదిదే. అసాధారణమైన టాలెంట్‌, అదిరిపోయే పంచ్‌లతో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న అతడు.. అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై తెగ సందడి చేస్తోన్నాడు. దీంతో క్రమంగా ఫాలోయింగ్‌ను పెంచుకుంటూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ షోలో హైపర్ ఆది.. ఓ సీరియల్ నటితో ప్రేమలో పడినట్లు చెప్పాడు. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  జబర్థస్త్‌లో హైపర్ ఆది స్పెషల్

  జబర్థస్త్‌లో హైపర్ ఆది స్పెషల్

  సుదీర్ఘ కాలంగా ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ షోలో ఎంతో మంది టీమ్ లీడర్లుగా పని చేశారు. అయితే, ఈ కామెడీ షో చరిత్రలోనే హైపర్ ఆదిలా ఒంటి చేత్తో స్కిట్లను నడిపించిన వారు చాలా తక్కువ. అంతేకాదు, తక్కువ సమయంలోనే ఎక్కువ ఎపిసోడ్స్ గెలుపొందిన టీమ్ లీడర్‌‌గా అతడికి అద్భుతమైన రికార్డు కూడా ఉంది. అంతేకాదు, షోలోనే ఆది స్పెషల్‌ అనిపించుకున్నాడు.

  శృతి మించిన సీరియల్ నటి హాట్ షో: ఇలాంటి ఫొటోలు ఎప్పుడూ చూసుండరు!

  యమా టాలెంట్... ఫాలోయింగ్

  యమా టాలెంట్... ఫాలోయింగ్

  బుల్లితెరపై హైపర్ ఆది స్కిట్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందన్న విషయం తెలిసిందే. అలాగే, యూట్యూబ్‌లో అతడికి వచ్చే వ్యూస్‌ను బట్టే దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, అతడి స్కిట్ల కోసం టీవీల ముందు కూర్చునే వాళ్లూ ఉన్నారు. పది నిమిషాల పాటు ఉండే అతడి స్కిట్లో లెక్కపెట్టలేనన్ని పంచులు ఉండడం వల్లే అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఏర్పడింది.

  సినిమాల్లోనూ సత్తా చాటుతూనే

  సినిమాల్లోనూ సత్తా చాటుతూనే

  బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా తిరుగులేని కమెడియన్‌గా వెలుగొందుతోన్న హైపర్ ఆది.. సినిమాల్లోకి కూడా ఎంటర్ అయ్యాడు. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో హీరో ఫ్రెండ్ పాత్రలు కూడా చేశాడు. అలాగే, 'ఆటగదరా శివ' అనే మూవీలో లీడ్ రోల్ చేశాడు. ఇక, అల్లరి నరేష్ 'మేడ మీద అబ్బాయి' అనే సినిమాకు సంభాషణలు అందించి డైలాగ్ రైటర్‌గానూ వర్క్ చేసి మెప్పించాడు.

  అషు రెడ్డి అందాల ప్రదర్శన: ఏకంగా షర్ట్ విప్పేసి మరీ చూపిస్తూ!

  జబర్దస్త్‌కు గ్యాప్.. ఆ షోలలోనే

  జబర్దస్త్‌కు గ్యాప్.. ఆ షోలలోనే

  హైపర్ ఆది బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా హవాను చూపిస్తున్నాడు. ఇందులో భాగంగానే జబర్దస్త్ సహా ఎన్నో షోలలో భాగం అవుతున్నాడు. అయితే, ఇప్పుడు మాత్రం అతడు బిజీ షెడ్యూల్ కారణంగా షోలకు గ్యాప్ తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే జబర్ధస్త్‌కు అతడు గుడ్‌బై చెప్పేశాడు. కానీ, 'ఢీ14', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఈ రెండు షోలలోనే పని చేస్తున్నాడు.

  స్పెషల్ ఈవెంట్‌లో ఆది రచ్చ

  స్పెషల్ ఈవెంట్‌లో ఆది రచ్చ

  ప్రముఖ ఛానెల్ ఈటీవీ 27 సంవత్సరాలను పూర్తి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో అందులో పని చేసిన చేస్తున్న ఆర్టిస్టులతో స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. దీనికి 'భలే మంచి రోజు' అనే పేరు పెట్టారు. ఇక, ఈ ఈవెంట్ ఇప్పటికే ఒక భాగం పూర్తైంది. రెండో చాప్టర్ సెప్టెంబర్ 4వ తేదీన ప్రసారం కాబోతుంది. తాజాగా ఈ ప్రోమో వదిలారు. ఇందులో హైపర్ ఆది రచ్చ చేసేశాడు.

  Sara Ali Khan: స్టార్ క్రికెటర్‌తో హీరోయిన్ డేటింగ్.. నైట్ ఇద్దరూ కలిసి అలా కనిపించడంతో!

  హైపర్ ఆది లవ్ ట్రాకు హైలైట్

  వరుసగా షోలు, సినిమాలతో బిజీ బిజీగా సాగుతున్న హైపర్ ఆది ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో అతడు రెట్టించిన ఉత్సాహంతో షోలలో పాల్గొంటోన్నాడు. ఇందులో భాగంగానే 'భలే మంచి రోజు' ఈవెంట్‌లో హైపర్ ఆది.. 'శతమానం భవతి' సీరియల్ నటితో ప్రేమలో పడినట్లు నటించాడు. దీంతో వీళ్లిద్దికి లవ్ సింబల్స్ వేసి మరీ తెగ హైలైట్ చేశారు.

  ఆ అమ్మాయిని తప్ప అంటూ

  ఆ అమ్మాయిని తప్ప అంటూ


  'భలే మంచి రోజు' ఈవెంట్‌కు 'శతమానం భవతి' సీరియల్ టీమ్ వచ్చింది. అప్పుడు ఆది వాళ్లపై పంచులు వేస్తూ.. ఒక నటి దగ్గరకు వచ్చి ప్రేమలో పడినట్లు చెప్పాడు. దీంతో ఆమె కూడా అతడికి సహకరిస్తూ డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత అతడి కాలిపై కూర్చుంది. ఇక, అప్పటి నుంచి ఆది ఆ నటి తన మనిషి అన్నట్లుగా కామెంట్ చేశాడు. దీంతో ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.

  English summary
  Jabardasth Talented Comedian Hyper Aadi Participated in Bhale Manchi Roju Event. He Fell in Love With Shatamanam Bhavati Serial Actress in This Event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X