అనసూయ జబర్దస్త్ మానేయడానికి కారణం నేను కాదు.. అప్పుడు జరిగింది ఇది
బుల్లితెర ప్రేక్షకుల్లో హైపర్ ఆది ఎంతటి క్రేజ్ దక్కించుకున్నారో తెలిసిందే. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ షోను వీడిన సంగతి తెలిసిందే. ఇక మిగితా టీవీ ప్రొగ్రామ్స్ లో సందడి చేస్తూ ఉన్నారు. అయితే జబర్దస్త్ కామెడీ షోతో సెన్సేషన్ క్రియేట్ చేసిన మాజీ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఆ షో నుంచి బయటికి వచ్చేశారు. అయితే ఆ మధ్య అందరూ వెళ్లిపోయినప్పటికీ అనసూయ భరద్వాజ్ మాత్రం కొద్ది కాలం కొనసాగారు. అదే సమయంలో హైపర్ ఆది కూడా ఉన్నారు. ఆ కొద్ది రోజులకు అనసూయ కూడా జబర్దస్త్ ను వీడారు. అయితే అనసూయ వెళ్లిపోవడానికి హైపర్ ఆదినే కారణం అంటూ కొందరు ప్రచారం చేశారు. దీనిపై హైపర్ ఆది తాజా స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే..
టెలివిజన్ రంగంలోనే సెన్సేషన్ గా..
జబర్దస్త్ కామెడీ షో ద్వారా హైపర్ ఆది, అనసూయ భరద్వాజ్ తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఇక తమ తమ టాలెంట్స్ తో తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ దక్కించుకున్నారు. హైపర్ తన పంచులతో ట్రెండ్ క్రియేట్ చేశారు. జబర్దస్త్ కామెడీ షోలో అందరికీ కాంపిటేషన్ అయ్యారు. ప్రస్తుతం టెలివిజన్ స్టార్ గా ఎదిగారు. ఇక అనసూయ భరద్వాజ్ కూడా బుల్లితెర స్టార్ యాంకర్ గా క్రేజ్ దక్కించుకుంది. ఇలా తమదైన ముద్రను వేశారు.

హైపర్ ఆది కామెంట్స్ వల్లనే?
అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ కామెడీ షోకు యాంకర్ గా వ్యవహరించిన సమయంలో షోకు మంచి రేటింగ్, వ్యూయర్ షిప్ కూడా లభించింది. మరోవైపు హైపర్ ఆది స్కిట్లకు కూడా హై డిమాండ్ ఉండింది. ఇక హైపర్ ఆది స్కిట్లలోనూ అనసూయ భరద్వాజ్ మెరుస్తూ ఉండేవారు. హైపర్ ఆది కూడా అనసూయ బ్యూటీపై, మరిన్ని సరదా పంచులు పేల్చుతూ ఉండేవారు. అలా వీరి కాంబినేషన్ లో వచ్చే పంచులు, స్కిట్లకు మరింత క్రేజ్ ఉండేది. అయితే అనసూయపై హైపర్ ఆది చేసిన కామెంట్లతోనే అనసూయ వెళ్లిపోయిందనే ప్రచారం ఆయన వరకు చేరింది.
క్లారిటీ ఇచ్చిన ఆది..
అనసూయ తన వల్లనే జబర్దస్త్ ను వీడిందనే పుకార్లకు హైపర్ ఆది తాజాగా అడ్డుకట్ట వేశారు. రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. అసలు అనసూయ గారితో తనకు ఎలాంటి గొడవలు లేవని తెలిపారు. ఇక ఆమె అందరి స్కిట్లలో కంటే తన స్కిట్ లోనే నటించేందుకు, కనిపించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించే వారని అన్నారు. ఆమె జవర్దస్త్ వీడిపోవడానికి అసలు కథ వేరే ఉందన్నారు.
అప్పటికే అనసూయ భరద్వాజ్ కు సినిమాల్లో ఆఫర్లు దండిగా వచ్చాయని, పుష్ప చిత్రంలో అవకాశం వచ్చిందని తెలిపారు. జబర్దస్త్ ను వీడక ముందే రాజాకార్, రంగమార్తాండ వంటి సినిమాల నుంచి అవకాశాలు అందుకుంది. అలా సినిమాల మీద ఉన్న ఆసక్తి, కెరీర్ ఫ్యూచర్ ను ఆలోచించి అనసూయ తీసుకున్న నిర్ణయం అది అని చెప్పుకొచ్చారు. హైపర్ ఆది స్పందించడంతో ఈ రూమర్లకు అడ్డుకట్ట పడింది.


Click it and Unblock the Notifications











