హైపర్ ఆదిని నిండా ముంచేశారట.. అలా అమాయకుడిలా చిక్కి మొత్తం పోగొట్టుకున్నాడు!

హైపర్ ఆది ఈ పేరు ఒక్కటి చాలు. ఇక వేరే పరిచయం అక్కర్లేదు. ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై తన పంచ్‌లతో పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాడు. మళ్లీ మళ్లీ వినాలనిపించే పంచ్‌లు వేయడంతో యూట్యూబ్ సెన్సేషన్‌గా మారిపోయాడు. బుల్లితెరపై హైపర్ ఆది ఎంతగా ఫేమస్ అయ్యాడో సోషల్ మీడియాలోనూ అంతే ఫేమస్. మరీ ముఖ్యంగా యూట్యూబ్‌లో హైపర్ ఆది స్కిట్స్ మిలియన్ల కొద్ది వ్యూస్‌ను కొల్లగొడుతుంటాయి. అయితే అలాంటి ఆది మొదట్లో కొందరి చేతిలో దారుణంగా మోసపోయాడట.

 కెరీర్‌ ప్రారంభంలో అలా..

కెరీర్‌ ప్రారంభంలో అలా..

మామూలుగా హైపర్ ఆది వృత్తిరిత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్. వీకెండ్స్‌లో మాత్రం అలా సినిమా ఛాన్స్‌ల కోసం తిరిగేవాడట. అలా తిరుగుతూ తిరుగుతూ చివరకు జబర్దస్త్ సెట్‌లోకి వచ్చి పడ్డాడట. అంతకు ముందే రైటర్‌గానూ పని చేశాడట. ఇవేవీ జరగక ముందుమాత్రం కొందరి చేతిలో మోసపోయానని ఆది చెప్పుకొచ్చాడు.

సెలెబ్రిటీలతో ఫోటోలు..

సెలెబ్రిటీలతో ఫోటోలు..

సెలెబ్రిటీలతో ఫోటోలు దిగి తాము కూడా సెలెబ్రిటీలమన్నంతా బిల్డప్ ఇస్తుంటారు. ఆ ఫోటోలను అడ్డం పెట్టుకుని కొందరికి వల వేస్తారు. ఇండస్ట్రీలో పరిచయాలున్నాయి.. ఆఫర్లు ఇప్పిస్తామని ఆశ చూపిస్తారు. చివరకు నిండా ముంచుతారు. అలాంటి వారికే హైపర్ ఆది చిక్కాడట. ఈ సంగతులన్నీ తాజాగా అలీతో సరదాగా షోలో చెప్పేశాడు.

సిగరెట్లు, రీచార్జ్..

సిగరెట్లు, రీచార్జ్..

సెలెబ్రిటీలతో ఫోటోలు దిగి పెట్టిన ఓ వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడట. ఇండస్ట్రీలో అవకాశం ఇప్పిస్తానని చెబుతూ డబ్బులు అడిగేవాడట. వంద రూపాయలు రీచార్జ్ చేయమనే వాడట అలా చేసే వాడినికూడా అని ఆది చెప్పుకొచ్చాడు. ఓ సారి బయట కలుద్దామని అన్నాడు. ఫోన్‌లో రెండు కోట్ల ప్రాజెక్ట్ గురించి మాట్లాడతాడు.. నన్ను రెండు రూపాయల సిగరెట్ తెమ్మని అంటాడు అంటూ హైర్ ఆది నాటి సంగతులను చెప్పుకొచ్చాడు.

పది వేలు ఇచ్చాను..

పది వేలు ఇచ్చాను..

అలా ఒకసారి ఐదు వేలు అడిగితే కూడా ఇచ్చానని చెప్పాడు. ఆ తరువాత మరోసారి ఏదో ఒక ఆఫీస్‌కు కూడా వెళ్లాను.. పక్కన అమ్మాయి ఉంటుంది.. ఆమె నీ లవర్‌గా నటిస్తుందని, మంచి రోల్ రేపటి నుంచి షూటింగ్.. ఇక్కడి నుంచే పికప్ చేసుకుంటామని చెప్పారట. కాకపోతే పది వేలు కట్టాల్సి ఉంటుందని అన్నారట. అయినా సరే అని పది వేలు కట్టాడట. కానీ తెల్లారి వెళ్లి చూస్తే అక్కడ ఆఫీస్‌కు తాళం కప్ప వేసి ఉంది, నాక్కూడా కప్ప వేశారని అర్థమైందంటూ మోసపోయిన ఘటనల గురించి హైపర్ ఆది పూస గుచ్చినట్టు వివరించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X