జబర్దస్త్‌లోకి హైపర్ ఆది రీ ఎంట్రీ? పంచ్‌ల వర్షం ఎప్పటి నుంచి అంటే?

హైపర్ ఆది.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తన పంచ్‌లు, ప్రాసలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ తెలుగునాట మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు ఆది. ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఆది.. తన ప్రతిభతో సెలబ్రిటీగా మారారు. కొన్నేళ్లపాటు జబర్దస్త్‌ను తన స్కిట్స్‌తో రూల్ చేసిన ఆది ఆ తర్వాత సినిమాలు, ఇతర ఛానెల్స్‌లో అవకాశాలు, ఇతర కారణాలతో జబర్దస్త్‌ను వదిలేశాడు. దాంతో అతని అభిమానులు మరోసారి హైపర్ ఆది.. జబర్దస్త్‌లోకి రావాలని కోరుకుంటున్నారు. తాజాగా దీనికి క్లారిటీ ఇచ్చారు ఆది. ఈ వివరాల్లోకి వెళితే..

ఎప్పటిలాగే జబర్దస్త్ షో ఈ వారం కూడా ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. తొలుత ధనాధన్ ధనరాజ్ ఒక యాపిల్ తీసుకొచ్చి రష్మిని రుద్దుతూ.. ఈ పిల్ల కత్తిలా ఉంటుందని అన్నారు యాపిల్ కూడా కట్ అవ్వడం లేదని అనడంతో అంతా నవ్వేస్తారు. తర్వాత ఫ్రెండ్‌షిప్ పేరుతో మందు ఆర్డర్ చేసి ధనరాజ్ చేసిన కామెడీ బాగుంది. అనంతరం ఫైమా, పొట్టినరేష్‌లు ఎంట్రీ ఇస్తారు.

Hyper Aadi Gives Big Hint About Jabardasth Re-Entry Fans Excited

వూళ్లో ఇన్ని వైన్ షాపులు ఉన్నాయి కానీ.. ఒక్క ఆసుపత్రి కూడా ఎందుకు లేదని భార్య అడుగుతుంది. ఆసుపత్రిలో మందులు రోజు రోజుకు విషంగా మారుతుంది.. అదే వైన్‌షాపులో మందులు రోజు గడుస్తున్న కొద్దీ అమృతంలా మారుతుంది ఏమంటారు నాగబాబు గారు అని నరేష్ అడుగుతాడు. నాకు నీలాగా అలవాటు లేదు వెధవ అని తిడతాడు నాగబాబు. ఆ వెంటనే ఫైమా తన కాళ్లలో ముళ్లు గుచ్చుకుందని ఏడుస్తుండగా పొట్టి నరేషన్ తన నోటితో తీస్తాడు. ఈ తతంగం మొత్తం ఫోన్‌లో రికార్డ్ చేసి మీ భార్యకు పంపుతానని ఫైమా బ్లాక్‌మెయిల్ చేస్తుంది.

ఇక చాలా రోజుల తర్వాత రైజింగ్ స్టార్ ఎంట్రీ ఇవ్వడంతో అంతా నవ్వేశారు. నేను రిజిస్ట్రార్ ఆఫీసర్‌ని తల్లిదండ్రుల్ని కాదని లేచిపోవడాలు ఎన్నో జరుగుతున్నాయి. వాళ్లు వీళ్లని చంపుకుంటున్నారు.. వీళ్లు వాళ్లని చంపుకుంటున్నారు. అందుకే నా సర్వీస్‌లో ఒక్క లవ్ మ్యారేజ్‌కి కూడా అంగీకరించలేదని అంటాడు రాజ్. ఆ వెంటనే మైక్ అందుకున్న ఆది.. నా స్కిట్‌లో ఇప్పటి వరకు ఇంతపెద్ద డైలాగ్ ఆయనతో చెప్పించలేదని అంటాడు. తర్వాత ఒక ప్రేమ జంట పెళ్లి చేయమని రాజు దగ్గరికి రావడంతో వాళ్లని తిట్టి కొట్టేస్తాడు.

మరో స్కిట్‌లో రాకెట్ రాఘవ డాక్టర్‌గా వచ్చి ట్రీట్‌మెంట్ కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి ఆపరేషన్ చేసేస్తాడు. ఇంతలో అప్పారావు రావడంతో అతనికి కూడా ఆపరేషన్ చేస్తానని చెప్పడంతో టెస్టులు చేయవా? అని అడుగుతాడు అప్పారావు. నేను టెస్టులు చేయించడానికి 30 వేలు అవుతుంది.. ఆ తర్వాత కూడా నేను ఆపరేషన్ చేయాలని చెబుతాను అప్పుడేం చేస్తావని రాఘవ అడగ్గా ఆపరేషన్ చేయమని అంటాడు. అనంతరం రోహిణి, తాగుబోతు రమేశ్, రామకృష్ణలు ట్రయాంగిల్ లవ్ స్టోరీతో చేసిన స్కిట్ నవ్వించింది. గతం మరిచిపోయిన రోహిణి.. తన లవర్‌ని అన్నయ్య అని పిలవడంతో అంతా నవ్వుకున్నారు.

చివరిలో హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చి.. నాగబాబును చూడగానే జబర్దస్త్‌కి కొత్త కళ వచ్చిందబ్బా అనుకునేలోపే రష్మీని చూడగానే జబర్దస్త్ ఓల్డ్ అయిపోయిందబ్బా అనిపిస్తోందని అంటాడు. మీ జీవితం అనేది వాళ్ల కామెంట్స్ మీద ఆధారపడి ఉంది. స్కిట్ బాగుందంటే రూమ్‌కి పిలిచి పొంగలి పెడతాడు.. బాలేదో అని కొత్తవాళ్లకి వార్నింగ్ ఇస్తాడు ఆది. జబర్దస్త్‌లో ఎవరెన్ని స్కిట్లు చేసినా నా స్కిట్‌లో జరిగిన మేజిక్ ఏంటంటే.. మీరు కొంచెం గ్యాప్ ఇవ్వమని అడగటం.. ఆది నరుకుతున్నాడు అనే మాట అనడం ఈ పదాలు నాకు బూస్ట్ ఇచ్చాయని నాగబాబు గురించి ఆది చెప్పాడు. జబర్దస్త్‌కు మళ్లీ ఎప్పుడొస్తావు అని నాగబాబు అడగ్గా.. ఎవరైతే మిస్ అయ్యారో వీళ్లతో కాంబినేషన్ సెట్ చేసుకుని జూన్‌లో రీ ఎంట్రీ ఉంటుందని ఆది హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా హైపర్ ఆది రీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Read more about: hyper aadi jabardasth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X