ఆ అమ్మాయితో ఫస్ట్ ఛాన్స్ నాకే.. కమెడియన్‌తో హైపర్ ఆది స్కెచ్
Photo Courtesy: EtvTeluguIndia
తన పంచ్‌లు, ప్రాసలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవిస్తూ ఉంటాడు హైపర్ ఆది. బజర్దస్త్‌తో కార్యక్రమంతో బాగా పాపులరైన ఆది.. ప్రస్తుతం సినిమాలు, టీవీ ఈవెంట్స్‌తో, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నాడు. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసినా ఈటీవీతో, మల్లెమాల సంస్థతో అలాగే రిలేషన్ కంటిన్యూ చేస్తున్నారు ఆది. శ్రీదేవి డ్రామా కంపెనీ, క్యాష్ తదితర ఈవెంట్స్‌లో పాల్గొంటూ కడుపుబ్బా నవ్విస్తున్నాడు. తాజాగా కొద్దిరోజుల క్రితం శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆది చేసిన స్కిట్ వైరల్ అయ్యింది. ఈ వివరాల్లోకి వెళితే.
ఆ లిస్ట్‌లో వాళ్లే కావాలి
హైపర్ ఆది పెళ్లాం లేచిపోయిందనే కాన్సెప్ట్‌తో ఈ స్కిట్ మొదలవుతుంది. మరి ఆదిని అత్తలు ఓదారుస్తారా? లేక కోడళ్లు ఓదారుస్తారా?అని రష్మి ఇంట్రో చెప్పగా.. ఆ వెంటనే ఆది, ఇమ్మాన్యుయేల్, పొట్టి నరేష్‌లు వస్తారు. మీ పెళ్లాం లేచిపోతే వీళ్లు ముగ్గురు ఎందుకు ఏడుస్తున్నారని అడుగుతుంది రష్మిక. వీళ్లు నా పెళ్లాం పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు అని చెబుతాడు ఆది. పెళ్లాం లేచిపోయింది కదా ఇప్పుడేం చేయాలని ఇమ్మాన్యుయేల్ అడగ్గా.. ఏముంది ముందు బాధపడతాం, ఓదార్చేవాళ్లు వచ్చాక మీద పడటమే అంటాడు ఆది. ఒకవేళ మిమ్మల్ని బాగా ఓదారిస్తే సెట్ అయిపోతారా? అని రష్మి అడుగుతుంది. అందరూ కూడా వద్దు.. కొంతమంది పేర్లు చెబుతాడు, వాళ్లొచ్చి ఓదారిస్తే చాలు మాకు అని ఇమ్మాన్యుయేల్ చెప్పడంతో అంతా నవ్వేస్తారు.

Photo Courtesy: EtvTeluguIndia
ఆ కెమెరామెన్ వల్లే
కోడలి సైడ్ నుంచి పవిత్రను ఫస్ట్ పిలవగా.. ఆ ఓదార్పు మాకొద్దు, అది ఓదార్పు యాత్ర అవుతుందని అంటాడు ఆది. అయితే ఫస్ట్ వీడిని ఓదార్చమంటూ నరేష్‌ను ముందుకు తోస్తాడు ఇమ్ము. సరేగానీ ముందు మీ పెళ్లాం ఎలా లేచిపోయిందని పవిత్ర అడగ్గా.. ఇక్కడ ట్రాలీ ఏస్తుంటాడు కొండన్న అని ఆయనతో లేచిపోయిందని కెమెరామెన్ వైపు చూపిస్తాడు ఆది. ఒక ఎపిసోడ్‌కు మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ తీసుకున్నాడు ఎందుకో అనుకున్నా.. ఆ మై డాక్టర్ పెయిన్ ఎసరు మా ఆవిడకే పెట్టాడు అంటాడు ఆది. ఇంతకీ ఎక్కడికి లేచిపోయిందని పవిత్ర అడగ్గా.. ఆయన కెమెరా వెనుకే అటు ఇటు తిప్పుతున్నాడని చెబుతుంది. పవిత్ర ఓదార్చాలని కూర్చోగా.. నువ్వెళ్లి భానుని పంపించు అని చెబుతాడు నరేష్. ఒకవేళ భాను అందుబాటులో లేకపోతే ఆ అనూష రెడ్డి అయినా ఓకే అంటాడు ఇమ్మాన్యుయేల్.
ఆమె కోసం కొట్టుకున్న ఆది, నరేష్
అన్షు రెడ్డి వస్తుండగా ఫస్ట్ నేను, ఫస్ట్ నేను .. నన్ను ఓదార్చు అంటూ నరేష్, ఇమ్మాన్యుయేల్‌లు ఆమె వెంట పడతారు. దాంతో ఆది కల్పించుకుని.. మిమ్మల్ని పిలిచిందెవరు? ఫస్ట్ నన్ను ఓదార్చాలి కదా అని అంటాడు. దాంతో ఇమ్మూ, నరేష్‌లు తలబాదుకుంటారు. ముందు నువ్వు ఏదో ఒకటి చేయి తర్వాత చూద్దామని అన్షుతో చెబుతాడు ఆది. ఆవిడ తల నిమురుతుండగా.. నాకు శ్వాస ఆడటం లేదంటూ పొట్టి నరేష్ పడిపోతాడు. నీకు సీపీఆర్ చేయడానికి ఒక అమ్మాయి ఉందని ఓ లేడీ గెటప్ వేసే అబ్బాయిని పిలుస్తుంది రష్మి. ఆవిడ వస్తుండగా శ్వాస ఆడుతోందని చెబుతాడు నారేష్. ఆ వెంటనే నోటిలో నోరు పెట్టి నరేష్‌కు శ్వాస ఇస్తుంది ఆ అమ్మాయి.
ఆదిని చితకబాదేశారుగా
మీకు కోడలు ఓదార్పు సరిపోవడం లేదు.. అత్తలు రెడీయా అని ఉమాని పిలుస్తుంది రష్మి. ఆమెను చూడగానే ఆది, ఇమ్మాన్యుయేల్, నరేష్‌లు తలో దిక్కుకు పరుగులు తీస్తారు. ఎలాగో ఆదిని పట్టుకున్న ఉమా, నట కుమారిలు అసలు విషయం ఏంటీ? అని అడుగుతారు. మా ఆవిడకి నేను సరిగా ఫుడ్ పెట్టలేదని లేచిపోయిందని చెబుతాడు. నిజంగా ఫుడ్ పెట్టడం లేదనే లేచిపోయిందా? అని ఉమా అడుగుతుంది. దాంతో ఆదిని ఓదారుస్తుంది ఉమా. ఆ దెబ్బలకు భయపడ్డ ఆది.. అసలు నాకు పెళ్లామే లేదు, అది లేచిపోలేదని చెబుతాడు. మరి ఇదంతా ఎందుకు చేశావని నటకుమారి అడగ్గా.. వూరకే సరదాకి అని అంటాడు ఆది. ఆడది అంటే నీకు సరదాగా కనిపిస్తోందా అని ఆదిని ఇద్దరూ కలిసి చితకబాదడంతో అంతా నవ్వేస్తారు.


Click it and Unblock the Notifications











