Anasuya Bharadwaj తో అది కావాలన్న హైపర్ ఆది: పుష్ప నటుడితో బేరాలు.. వైరల్‌గా వీడియో!

తెలుగు బుల్లితెరపై ఎంత కాలంగా ప్రసారం అవుతూ.. అప్పటికీ ఇప్పటికీ తిరుగులేని కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. దాదాపు ఎనిమిదేళ్లుగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న దీనివల్ల ఇండస్ట్రీకి ఎంతో మంది కమెడియన్లు పరిచయం అయ్యారు. అందులోనూ కొందరు మాత్రం విశేషమైన గుర్తింపును అందుకున్నారు. వారిలో పంచ్‌ల స్పెషలిస్ట్ హైపర్ ఆది ఒకడు. అసాధారణమైన టాలెంట్‌తో అదరగొడుతూ.. అంచలంచెలుగా ఎదుగుతోన్నాడు.

ఈ క్రమంలోనే ప్రతివారం తనదైన శైలిలో స్క్రిప్టులు రాసుకుంటూ స్కిట్లు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు హైపర్ ఆది.. యాంకర్ అనసూయ భరద్వాజ్‌పై హాట్ కామెంట్స్ చేశాడు. అసలేం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

చాలా మందే ఉన్నా ఆది స్పెషల్

చాలా మందే ఉన్నా ఆది స్పెషల్

సుదీర్ఘ కాలంగా ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ షోలో ఎంతో మంది టీమ్ లీడర్లుగా పని చేశారు. అయితే, ఈ కామెడీ షో చరిత్రలోనే హైపర్ ఆదిలా పంచులతో వన్ మ్యాన్ షోలు చేసే వాళ్లు మాత్రం లేరనే చెప్పాలి. అంతేకాదు, తక్కువ సమయంలోనే ఎక్కువ ఎపిసోడ్స్ గెలుపొందిన టీమ్ లీడర్‌‌గా అతడికి అద్భుతమైన రికార్డు కూడా ఉంది. అందుకే ఈ షోలో అతడు స్పెషల్‌గా నిలిచాడు.

ఆదికి ఫాలోయింగ్... కారణం ఇదే

ఆదికి ఫాలోయింగ్... కారణం ఇదే

టీవీలోనే కాదు.. యూట్యూబ్‌లోనూ హైపర్ ఆది స్కిట్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందన్న విషయం తెలిసిందే. పది నిమిషాల పాటు ఉండే అతడి స్కిట్లో లెక్కపెట్టలేనన్ని పంచులు ఉండడం వల్లే అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో పెరుగుతోంది. అతడి స్కిట్ల కోసమే జబర్ధస్త్‌ను చూసే వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. అందుకే ఆది హవాను చూపిస్తున్నాడు.

సినిమాల్లోనూ సత్తా... అలా చేస్తూ

సినిమాల్లోనూ సత్తా... అలా చేస్తూ

బుల్లితెరపై తిరుగులేని కమెడియన్‌గా వెలుగొందుతోన్న హైపర్ ఆది.. సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో హీరో ఫ్రెండ్ పాత్రలు కూడా చేశాడు. అలాగే, 'ఆటగదరా శివ' అనే మూవీలో లీడ్ రోల్ చేశాడు. ఇక, అల్లరి నరేష్ 'మేడ మీద అబ్బాయి' అనే సినిమాకు డైలాగ్ రైటర్‌గానూ పని చేశాడు. ఇలా అన్నింట్లోనూ ఉంటూ మరింత పాపులర్ అవుతున్నాడు.

 అందరిపై పంచులు వేస్తూ రచ్చ

అందరిపై పంచులు వేస్తూ రచ్చ

హైపర్ ఆది తన స్కిట్లలో ఎక్కువ శాతం సమాజంలో జరిగే ట్రెండింగ్ అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాడు. అలాగే, అద్భుతమైన టైమింగ్‌తో తన టీమ్ మెంబర్లపై పంచుల వర్షం కురిపిస్తుంటాడు. ఈ క్రమంలోనే జడ్జ్‌లు, యాంకర్లను కూడా వదలిపెట్టడు. ఇలా ఒకటే స్కిట్లో ఎంతో మందిని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తుంటాడు. అందుకే అతడు బాగా సక్సెస్ అయ్యాడు.

పుష్పరాజ్‌గా మారిపోయిన ఆది

పుష్పరాజ్‌గా మారిపోయిన ఆది

జబర్ధస్త్‌లో హైపర్ ఆది ప్రయాణం మొదలై చాలా కాలమే అవుతోన్నా.. అతడు నిన్నో మొన్నో వచ్చినట్లు అనిపిస్తుంటుంది. దీనికి కారణం ఈ యంగ్ కమెడియన్ స్కిట్లు అన్నీ సరికొత్తగా ఉంటుండడమే. ఇక, వచ్చే గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో హైపర్ ఆది 'పుష్ప' మూవీ స్ఫూప్‌తో వచ్చాడు. ఇందులో అల్లు అర్జున్‌లా గెటప్ వేసుకుని తెగ సందడి చేసేశాడు.

అనసూయతో అది కావాలన్న ఆది

'పుష్ప' స్పెషల్ స్కిట్‌లో భాగంగా హైపర్ ఆది.. తన టీమ్‌లోని సభ్యులతో పలు గెటప్‌లను వేయించాడు. కానీ, బన్నీ పక్కనే ఉండే కేశవను మాత్రం నిజంగానే తీసుకొచ్చాడు. ఇక, సినిమాలో హీరో ఫ్రెండ్ డబ్బులిచ్చి.. హీరోయిన్‌తో మీటింగ్ పెట్టించిన సీన్‌ను తాజాగా విడుదలైన ప్రోమోలో చూపించారు. అందులో హీరో అడిగినట్లు ఇందులో ఆది.. అనసూయతో పూజ కావాలన్నాడు.

వైరల్ అవుతోన్న ఆది వీడియో

వైరల్ అవుతోన్న ఆది వీడియో

ఈ స్కిట్‌లో భాగంగా పుష్ప గెటప్‌లో ఉన్న ఆది 'నాకు తెలుసురా ఆ అమ్మి నన్ను లవ్ చేస్తందని. వేయి రూపాయల పూజ కాదు కానీ.. ఒక పది వేలు పోతే పోయినయ్ పెద్ద పూజ ఏదైనా ఉంటే ప్లాన్ చేయరా' అంటూ హాట్ కామెంట్స్ చేశాడు. దీంతో అనసూయ అతడిని సరదాగా కొట్టేందుకు దూసుకొచ్చింది. ఇక, ఈ వీడియో తక్కువ టైంలోనే విపరీతంగా వైరల్ అయిపోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X