హీరోయిన్‌తో హైపర్ ఆది ఊహించని ప్రవర్తన: అందరి ముందే అక్కడ చెయ్యేసి మరీ!

గతంతో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, అందులో కూడా చాలా తక్కువ మంది మాత్రమే భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ కమెడియన్ కమ్ రైటర్ హైపర్ ఆది ఒకడు. జబర్ధస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన అతడు.. అనతి కాలంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. ఫలితంగా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ షోలో హైపర్ ఆది.. ప్రముఖ హీరోయిన్‌తో ప్రవర్తించిన తీరు అందరికీ షాకిస్తోంది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

ఆది కెరీర్‌ను మార్చేసిన జబర్ధస్త్

ఆది కెరీర్‌ను మార్చేసిన జబర్ధస్త్

కామెడీ వీడియోలతో యూట్యూబ్‌లో గుర్తింపు సంపాదించిన సమయంలోనే ఆది జబర్ధస్త్‌ షోలోకి రైటర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆర్టిస్టుగా మారి ఎన్నో స్కిట్లలో చేశాడు. ఇలా తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. దీంతో అతడు టీమ్ లీడర్‌గా ప్రమోషన్ పొందాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్లాడు. ఇలా అతడి కెరీర్ పూర్తిగా మారింది.

మూవీల్లోనూ హైపర్ ఆది మార్కు

మూవీల్లోనూ హైపర్ ఆది మార్కు

జబర్ధస్త్ షో వల్ల ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న హైపర్ ఆది.. బుల్లితెరపై తనదైన మార్కును చూపించాడు. అలాగే, సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అందులోనూ తన శైలిని చూపించాడు. ఇలా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు. అలాగే, ‘ఆటగదరా శివ' అనే మూవీలో లీడ్ రోల్‌ చేశాడు. అల్లరి నరేష్ ‘మేడ మీద అబ్బాయి' మూవీకి డైలాగ్స్ ఇచ్చాడు.

జబర్ధస్త్‌కు దూరం.. ఆ షోలలోనే

జబర్ధస్త్‌కు దూరం.. ఆ షోలలోనే

జబర్ధస్త్‌లో సుదీర్ఘ కాలం పాటు టాప్ టీమ్‌ లీడర్‌గా హవాను చూపించిన హైపర్ ఆది.. కొంత కాలంగా ఆ షోలో కనిపించడం లేదు. దీంతో అతడి గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అయితే, అయితే, ‘ఢీ14', ‘శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలలో మాత్రమే సందడి చేస్తూ ముందుకెళ్తున్నాడు. తద్వారా తన ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉన్నాడు. అలాగే, మరింత హైలైట్ అవుతున్నాడు.

ఢీ షోను లేపుతున్న హైపర్ ఆది

ఢీ షోను లేపుతున్న హైపర్ ఆది

దక్షిణ భారతదేశంలోనే బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా వెలుగొందుతోన్న ‘ఢీ' ప్రస్తుతం 14వ సీజన్‌ను జరుపుకుంటోంది. ఇందులో నాలుగు టీమ్‌లు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అందులో ఒక టీమ్‌కు హైపర్ ఆది మెంటర్‌గా చేస్తున్నాడు. సుడిగాలి సుధీర్, రష్మీ వెళ్లిపోయిన తర్వాత పడిపోయిన ఈ షోను.. ఆది తన కామెడీతో పైకి లేపే ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఢీ షోలోకి హీరో, హీరోయిన్ రాక

ఢీ షోలోకి హీరో, హీరోయిన్ రాక


వచ్చే వారం ప్రసారం కాబోతున్న ‘ఢీ' 14వ సీజన్ ఎపిసోడ్‌ మరింత ఫన్నీగా జరగబోతున్నట్లు తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా తెలిసింది. ఈ ఎపిసోడ్ 1980 స్పెషల్‌గా సాగబోతుంది. ఇందులోకి ‘మా నీళ్ల ట్యాంక్' సినిమా ప్రమోషన్ కోసం హీరో సుశాంత్, హీరోయిన్ ప్రియా ఆనంద్ గెస్టులుగా వచ్చారు. వీళ్లు కంటెస్టెంట్లు, టీమ్ లీడర్లతో కలిసి తెగ సందడి చేసేశారు.

Recommended Video

పక్కా కమర్షియల్ పక్కా genuine రివ్యూ *Entertainment | Telugu OneIndia
ఆమెతో ఆది ఊహించని పని

ఆమెతో ఆది ఊహించని పని

‘ఢీ' షోలో భాగంగా ఎంట్రీ ఇచ్చిన ప్రియా ఆనంద్‌తో హైపర్ ఆది ఊహించని పని చేశాడు. అతడు డైరెక్టర్‌గా, ఆమె హీరోయిన్‌గా ఓ ఫన్నీ టాస్క్ చేశారు. అప్పుడు ఆది ‘హీరోయిన్ ఇలా రా అమ్మ. డైరెక్టర్‌తో ఫ్రీగా ఉండరా' అంటూ ప్రియా ఆనంద్ భుజంపై చేతులు వేశాడు. ఆ తర్వాత కొన్ని డైలాగ్‌లు చెప్పి నవ్వించారు. అనంతరం ప్రియా.. ఆదికి హగ్ ఇచ్చి షాకిచ్చేసింది.

భార్య, పిల్లలు అంటూ వాళ్లతో

ఇక, ఈ సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న తేజస్వినిని తన భార్య అని పరిచయం చేసిన హైపర్ ఆది.. చైల్డ్ కంటెస్టెంట్లను తన పిల్లలని చెప్పాడు. ఆ సమయంలో తేజస్వినికి, ఆదికి మధ్య ఫన్నీగా సంభాషణ జరిగింది. ఇక, చివర్లో ఆమె డ్యాన్స్ చేసిన తర్వాత ‘నలుగురు పిల్లల తల్లి. ఆ బట్టలేంటి? ఆ డ్యాన్స్ ఏంటి' అంటూ చిన్న క్లాత్ తీసుకెళ్లాడు. ఇదంతా తెగ నవ్వులు తెప్పించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X