రాకేష్ మాస్టర్‌ను ఇమిటేట్ చేసిన హైపర్ ఆది.. పగలబడి నవ్విన శేఖర్ మాస్టర్!!
రాకేష్ మస్టర్ ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలుస్తూ హల్చల్ చేస్తున్నాడు. యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. శ్రీరెడ్డి, నందమూరి ఫ్యామిలీ, మోహన్ బాబు ఫ్యామిలీ ఇలా ఇండస్ట్రీలోని పెద్దలందరిపైనా సంచలన కామెంట్స్ చేశాడు. అంతేకాకుండా శేఖర్ మాస్టర్, ఢీ షోపైనా విరుచుకుపడ్డాడు.

తెర వెనుక ఢీ షో..
ఢీ షోలో జరిగే వ్యవహారాల గురించి రాకేష్ మాస్టర్ సంచలన నిజాలు బయట పెట్టాడు. కంటెస్టెంట్లందరూ అక్కడు ఉండే తుప్పల్లోనే ఉంటారని, ఎంత పిలిచినా రారని చెప్పుకొచ్చాడు. ఓ సారి తాను గెస్ట్‌గా వెళ్లానని, అయితే అక్కడ అందరూ బయపడుతూ ఉన్నారని తెలిపాడు.

ఢీ షోలో డ్యాన్సుల గురించి..
ఢీ షోలో చేసే డ్యాన్సుల గురించి మాట్లాడుతూ.. అసలు వాటిని డ్యాన్సులని అంటారా? అంటూ విరుచుకుపడ్డారు. ఒక్కరికీ ఎక్స్‌ప్రెషన్స్ రావనీ, పాటకు తగ్గట్టు ఎలా చేయాలో కూడా తెలియదని విమర్శించాడు. జిమ్నాస్టిక్స్ చేస్తూ డ్యాన్సులు అంటారని అన్నాడు. డ్యాన్స్‌లు తక్కువ ఎగరడం,దూకడం ఎక్కువయ్యాయని తెలిపాడు.

మూమెంట్స్‌ను చూపిస్తూ..
డ్యాన్స్ అంటే ఏంటో తెలుసా? ఎన్ని రకాల హావభావాలుంటాయో తెలుసా? అంటూ కొన్ని డ్యాన్స్ మూమెంట్స్ వేసి చూపిస్తాడు. చెల్లెమ్మకు పెళ్లంటా.. అన్నయ్యకు సంబరమంటా అంటూ రెండు భిన్న రకాల స్టెప్పులు వేసి చూపించాడు.
Recommended Video

ఇమిటేట్ చేసిన హైపర్ ఆది..
ప్రతీ పండగకి ఓ ప్రత్యేక షో చేసే మల్లెమాల.. ఈ ఉగాదికి పండగ సార్ పండగ అంతే అనే ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సుధీర్ డ్యాన్సులు, హైపర్ ఆది పంచ్‌లు హైలెట్ కానున్నట్లు కనిపిస్తోంది. స్కిట్‌లో భాగంగా రాకేష్ మాస్టర్‌లా చెల్లమ్మకి పెళ్లంటా అన్నయ్యకు సంబరమంటా అంటూ స్టెప్పులేశాడు. దీంతో శేఖర్ మాస్టర్ సహా అక్కడి వారంతా పగలబడి నవ్వారు.


Click it and Unblock the Notifications











