యూట్యూబ్ పిల్లతో పీకల్లోతు ప్రేమలో Hyper Aadi.. ఇక గ్రాండ్‌గా పెళ్లే!
కామెడీ కింగ్ హైపర్ ఆది.. ఈ మధ్య ఫుల్ జోష్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు బుల్లితెరపై, మరోవైపు వెండితెరపై తన అల్టిమేట్ కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం హైపర్ ఆది గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన ఒక యూట్యూబర్ యాంకర్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో వీరి వివాహం జరగనుందని ప్రచారం జరుగుతుంది. ఆ వివరాల్లోకి వెళితే...
సూపర్ క్రేజ్...: హైపర్ ఆది... జబర్దస్త్ ప్రోగ్రామ్ తో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. మొదట్లో అదిరే అభి టీంలో ఉండే ఆది.. ఆ తర్వాత రైజింగ్ రాజు టీమ్ లో ఒక మెంబర్ గా ఎంట్రీ ఇచ్చి... తనదైన పంచులతో ప్రేక్షకులను అలరిస్తూ... టీమ్ లీడర్ గా ఎదిగాడు. ఇక ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీమ్, జబర్దస్త్ లో హైపర్ ఆది టీమ్ ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాయి. అలా బుల్లితెరపై అలరిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

సిల్వర్ స్క్రీన్ పై బిజి బిజి...: ఇక జబర్దస్త్, ఢీ ప్రోగ్రామ్స్ చేస్తూ.. మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వచ్చాడు. అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో హైపర్ ఆది కామెడీ.. ఇప్పటికీ ఆకట్టుకుంటుంది. కానీ జబర్దస్త్ కు మాత్రం గుడ్ బై చెప్పేశాడు. ప్రస్తుతం హైపర్ ఆది... సిల్వర్ స్క్రీన్ పైన బిజీబిజీగా గడుపుతున్నాడు. కమెడియన్ గా పలు చిత్రాల్లో నటిస్తున్నాడు.

న్యూస్ వైరల్...: అలాగే రచయితగా కూడా రాణిస్తున్నాడని తెలుస్తోంది. ఇటీవల ధనుష్ నటించిన సార్ చిత్రానికి హైపర్ ఆది మాటలు రాశారని సమాచారం. ఇక కెరీర్ ఫుల్ సింగ్ లో ఉండగానే పెళ్లి పీటలు ఎక్కువబోతున్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది. చాలా కాలంగా పరిచయం ఉన్న యూట్యూబ్ యాంకర్ తో హైపర్ ఆది ప్రేమలో ఉన్నట్లు సమాచారం. త్వరలో వీళ్ళిద్దరూ వివాహం కూడా చేసుకోబోతున్నారంట. ఈ మేరకు టాలీవుడ్ లో న్యూస్ వైరల్ గా మారింది.

ఆ పిల్లతో పెళ్లి ఫిక్స్..: అయితే హైపర్ ఆది... కెరియర్ బిగినింగ్ నుంచి ఈ యాంకర్ తోడుగా ఉందని సమాచారం. కష్ట సమయాల్లో కూడా అండగా నిలిచిందని అంటున్నారు. వీరి ప్రేమను ఇంట్లో వాళ్లకు చెప్పడంతో.. వాళ్లు కూడా ఒప్పకున్నారని తెలుస్తోంది. ఇక ఆమెతో వివాహం త్వరలో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. త్వరలో నిశ్చితార్థం కూడా జరగనుందని తెలుస్తోంది. ఇక అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయం గురించి హైపర్ ఆది స్పందించే వరకు వేచి చూడాల్సిందే.

రాజకీయాల్లోనూ..: హైపర్ ఆది పెళ్లి వార్తలు అయితే సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఇక మరోవైపు హైపర్ ఆది రాజకీయాల్లో కూడా బిజీగా గడుపుతున్నారు. జనసేన పార్టీ సభల్లో, కార్యక్రమాల్లో పవన్ తో కలిసి హైపర్ ఆది పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రకాశం జిల్లాకి చెందిన హైపర్ ఆది.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని ప్రచారం అయితే జరుగుతుంది.


Click it and Unblock the Notifications











