ఎట్టకేలకు ఫిక్సైన హైపర్ ఆది పెళ్లి.. అమ్మాయి ఎంత బాగుందో చూశారా?
గతంలో కంటే ఇప్పుడు బుల్లితెరపైకి టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు చాలా ఈజీగా ఎంట్రీ ఇస్తున్నారు. కానీ, కొంత కాలం క్రితం మాత్రం ఎన్నో కష్టాలను అనుభవించిన తర్వాతనే కొందరు ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. అందులో టాలెంటెడ్ గాయ్ హైపర్ ఆది ఒకడు. అద్భుతమైన టాలెంట్ ఉన్న అతడు.. చాలా తక్కువ సమయంలోనే ఫుల్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా హైపర్ ఆది తన గర్ల్‌ఫ్రెండ్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ పూర్తి వివరాలను మీరే చూడండి!
జబర్థస్త్‌తో సెన్సేషన్‌గా ఆది:ఎన్నో ఏళ్లుగా ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ షోలో ఎంతో మంది టీమ్ లీడర్లుగా పని చేశారు. అయితే, ఈ కామెడీ షో చరిత్రలోనే హైపర్ ఆదిలా ఒంటి చేత్తో స్కిట్లను నడిపించిన వారు చాలా తక్కువ. అంతేకాదు, తక్కువ సమయంలోనే ఎక్కువ ఎపిసోడ్స్ గెలుపొందిన టీమ్ లీడర్‌గా అతడికి అద్భుతమైన రికార్డు కూడా ఉంది. మొత్తంగా ఈ షోతో ఆది సెన్సేషన్‌గా మారిపోయాడు.

మూవీల్లోనూ సత్తా చాటుతూ:బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా తిరుగులేని కమెడియన్‌గా వెలుగొందుతోన్న హైపర్ ఆది.. సినిమాల్లోకి కూడా ఎంటర్ అయ్యాడు. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో హీరో ఫ్రెండ్ పాత్రలు కూడా చేశాడు. అలాగే, 'ఆటగదరా శివ' అనే మూవీలో లీడ్ రోల్ చేశాడు. ఇక, అల్లరి నరేష్ 'మేడ మీద అబ్బాయి' అనే సినిమాకు డైలాగ్స్ ఇచ్చాడు. ఇటీవలే 'భోళా శంకర్'లో సత్తా చాటుకున్నాడు.
జబర్దస్త్‌కు గ్యాప్... ఆ షోలు:బుల్లితెరపై హైపర్ ఆది ఎన్నో ఏళ్లుగా హవాను చూపిస్తున్నాడు. ఇందులో భాగంగానే జబర్దస్త్ సహా ఎన్నో షోలలో భాగం అవుతున్నాడు. అయితే, ఇప్పుడు మాత్రం అతడు బిజీ షెడ్యూల్ కారణంగా షోలకు గ్యాప్ తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే జబర్ధస్త్‌కు అతడు గ్యాప్ తీసుకున్నాడు. కానీ, 'ఢీ', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఈ రెండు షోలలోనే భాగం అవుతున్నాడు.

హైపర్ ఆది పెళ్లిపై న్యూస్:తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతూ.. ఇప్పుడు సినీ రంగంలో కూడా తనదైన మార్కును చూపిస్తోన్నాడు హైపర్ ఆది. ఇక, ఇతగాడి పెళ్లి గురించి చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అతడు ఫలానా అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ, దీనిపై హైపర్ ఆది ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వని విషయం తెలిసిందే.

గర్ల్‌ఫ్రెండ్‌ను చూపించాడు:తీరిక లేని షెడ్యూళ్లతో ఫుల్ బిజీగా గడుపుతోన్న హైపర్ ఆది తాజాగా 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో పాల్గొన్నాడు. ఇందులో అతడు తన పెళ్లిపై వస్తున్న పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగానే తాను నిజంగా ప్రేమిస్తున్న ఒక అమ్మాయిని ప్రపంచానికి పరిచయం చేశాడు. దీంతో ఇప్పుడీ న్యూస్ బుల్లితెర, వెండితెర వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

బేబి స్టేజ్ మీదకు రావమ్మా:వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షో ప్రోమోలో హైపర్ ఆది మాట్లాడుతూ.. 'ఇప్పటి వరకూ కంటెంట్ కోసం లైన్ వేయడం లాంటివి చేశాను. నిజంగా నేను లవ్ చేసిన అమ్మాయి ఒకరు ఉన్నారు' అని చెప్పాడు. దీంతో యాంకర్ రష్మీ 'తను ఇప్పుడు ఇక్కడే ఉందా' అని ప్రశ్నించింది. దీంతో ఆది 'బేబీ ఒకసారి స్టేజ్ మీదకు రావమ్మా' అన్నాడు.
ఐలవ్యూ నిహారిక అంటూ:ఆ అమ్మాయి స్టేజ్ పైకి రాగానే హైపర్ ఆది ఆమెకు అందరి ముందే 'ఐలవ్యూ నిహారిక' అంటూ ప్రపోజ్ చేశాడు. తర్వాత ఆమె కూడా 'లవ్యూ టూ' అనేసింది. అనంతరం ఇద్దరూ బుగ్గలు గిల్లుకుంటూ ముద్దులు పెట్టుకున్నారు. మొత్తానికి ఇది చూసిన వాళ్లంతా హైపర్ ఆది పెళ్లి ఫిక్స్ అయిపోయింది అనుకుంటున్నారు. దీంతో ఈ ప్రోమో విపరీతంగా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











