twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్దంతిని పుట్టినరోజు చేసిన ఆది.. పంచ్‌లు వేసినంత ఈజీ కాదంటూ ఏకిపారేస్తున్న నెటిజన్లు

    |

    వర్దంతిని, జయంతిగా మార్చడం.. జయంతిని వర్దంతిగా మార్చడం.. ఈ రెంటికీ తేడా తెలియన కొందరు సెలెబ్రిటీలున్నారంటే నమ్మశక్యం కాదు. ఆ మధ్య నారా లోకేష్‌ను ఈ విషయంలో సోషల్ మీడియా ఏకిపారేసింది. జయంతికి, వర్దంతికి తేడా తెలియదని అందరూ ఆయన్ను టార్గెట్ చేశారు. ఆయన ఒక్కరే కాదు ఇలా చాలా మందికి వాటి మధ్య తేడా తెలియదని, తెలిసినా ఒక్కోసారి కన్‌ఫ్యూజ్ అవుతారని తాజాగా మరోసారి ఫ్రూవ్ చేశాడు మరో సెలెబ్రిటీ.

    పంచ్‌లతో అదరగొట్టే ఆది..

    పంచ్‌లతో అదరగొట్టే ఆది..

    జబర్దస్త్ షో ఎంత ఫేమస్సో.. అందులోని ఆర్టిస్ట్ హైపర్ ఆది అంతే ఫేమస్.. మరీ ప్రత్యేకంగా ఆయన వేసే పంచ్‌లకు ఎవ్వరైనా పడి పడి నవ్వాల్సిందే. ఆయన తన ప్రాసలతో చిన్న పిల్లలనుంచి పండు ముసలోళ్ల వరకు అందర్నీ నవ్విస్తుంటాడు. అలాంటి ఆది వెండితెరపైనా మెరుస్తూ బిజీగా గడిపేస్తున్నాడు.

    ఎమ్ ఎస్ నారాయణ వర్దంతి..

    ఎమ్ ఎస్ నారాయణ వర్దంతి..

    2015 జనవరి 23న అనారోగ్యంతో కన్నుమూసాడు ఎమ్మెస్. ఈయన చనిపోయి అప్పుడే ఐదేళ్లు పూర్తైపోయిందా? అని ఆయన అభిమానులు గుర్తు చేసుకున్నారు. ఆయన భౌతికంగా లేకపోయినా కూడా ఇప్పటికీ ఆయన కామెడీ సీన్స్ మాత్రం నవ్విస్తూనే ఉంటాయి. ఇక ఈయన వర్ధంతి సందర్భంగా చాలా మంది ఆయన్ని తలుచుకున్నారు.

    బర్త్ డే అంటూ పోస్ట్..

    బర్త్ డే అంటూ పోస్ట్..

    అయితే ఎమ్ఎస్ నారాయణ వర్దంతిని కాస్త పుట్టినరోజును చేసేశాడు హైపర్ ఆది. ఎమ్మెస్ నారాయణ వర్ధంతి రోజుని జయంతి అనుకున్నాడు హైపర్ ఆది. వెంటనే హ్యాపీ బర్త్ డే సర్ అంటూ రాసుకొచ్చాడు. అయితే అది తప్పని గమనించిన ఆది వెంటనే సర్దుకున్నాడు. ఆ పోస్ట్‌ను తొలగించేశాడు.

    Recommended Video

    Nagababu Re-Entry Rumors Into Jabardasth || Filmibeat Telugu
    ఏకిపారేసిన నెటిజన్లు..

    ఏకిపారేసిన నెటిజన్లు..

    తెలుగులో స్కిట్స్ చేస్తుంటావు.. జయంతికి, వర్ధంతికి తేడా తెలియదా అంటూ కామెంట్స్ చేసారు. పోస్ట్ పెట్టిన రెండు గంటల తర్వాత కానీ తన తప్పు తెలుసుకోలేకపోయాడు హైపర్ ఆది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాదాపు 600 లకు పైగా లైక్స్.. కామెంట్స్ వచ్చాయి. కొందరు స్క్రీన్ షాట్స్ కూడా తీసుకుని సోషల్ మీడియాలో వైరల్ చేసారు.

    English summary
    Hyper Aadi Is Trolling By Netizens In Ms Narayana Death Anniversary Issue. He Mistakenly Post That Happy Birthday Instead Of Death AnniverAfter Two Hours He Deleted That Post.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X