హాట్ టాపిక్‌గా Hyper Aadi కిడ్నాప్ ఘటన!.. అలా చేస్తేనే వదిలిపెడతామంటూ కిడ్నాపర్ల డిమాండ్!!

కామెడీ కింగ్ హైపర్ ఆది గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 'జబర్ధస్త్' ప్రోగ్రామ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. ఇక ఆ తర్వాత పలు షోస్ లో తనదైన స్టైల్ లో పంచ్ లు వేస్తూ.. పిచ్చెక్కించే ఆది.. ఈ మధ్య సినిమాల్లో ఎక్కువ బిజీ అయిపోయాడు. అయితే మంచి ఫామ్ లో ఉన్న అతడు కిడ్నాప్ కు గురయ్యాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగిందంటే..

రైటర్ టు టీమ్ లీడర్: బుల్లితెర పాపులర్ కామెడీ షో 'జబర్దస్త్' లో రైటర్ గా ఎంట్రీ ఇచ్చి.. అనేక సినిమా స్పూఫ్ స్కిట్లతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత స్కిట్లలో కమెడియన్ గా మారి తన మార్క్ కామెడీ పంచ్ లతో అదరగొట్టేశాడు. అలా అతి తక్కువ సమయంలోనే తెలుగు రాష్ట్రాల్లో కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. టీమ్ లీడర్‌గానూ సత్తాచాడు. అలానే 'శ్రీదేవి డ్రామా కంపెనీ', 'ఢీ' లాంటి షోస్‌లో తన మార్క్ పంచ్‌లతో ఆకట్టుకున్నాడు.

Hyper Aadi Kidnap in Sridevi Drama Company Latest Promo Goes Viral

సినిమాల్లోనూ: స్మాల్ స్క్రీన్ పైనే కాకుండా సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చి.. తన మార్క్ చూపించాడు హైపర్ ఆది. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆడియెన్స్ చేత నవ్వులు పూయించాడు. పలు సినిమాలకు డైలాగ్ రైటర్‌గానూ పనిచేశాడు. మొత్తంగా తన మార్క్ కామెడీతో సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో, తన కామెడీ స్కిట్స్ తో ప్రోమోల రూపంలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాడు.

Hyper Aadi Kidnap in Sridevi Drama Company Latest Promo Goes Viral

షోలో నవ్వులు: తాజాగా యాంకర్ రష్మీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకు మరోసారి హాజరై తెగ నవ్వులు పూయించాడు. ఆదివారం (జులై 30)న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. అయితే తాజాగా కాబోయే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ఇక ఇందులో ఆది ఎప్పటిలానే తన స్టైల్ కామెడీతో రచ్చ రచ్చ చేశాడు. ఈ ప్రోగ్రామ్ లో జయవాణి, శిల్పా చక్రవర్తి, ప్రీతి నిగమ్, భావన వంటి పలువురు సీనియర్ యాంకర్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ పాటు ప్రస్తుత యాంకర్లు, యాక్టర్లు కూడా సందడి చేశారు.

Hyper Aadi Kidnap in Sridevi Drama Company Latest Promo Goes Viral

ఆది కిడ్నాప్: అయితే ఈ యాంకర్లు, నటులందరూ కలిసి 'ఆది కిడ్నాప్' అనే ఓ స్కిట్ చేశారు. 'కిడ్నాప్ చేసి పది గంటలు నిద్ర లేదు తట్టుకుంటా.. తిండి లేదు తట్టుకుంటా.. కానీ పెళ్లి కాని కుర్రాడినిరా.. నన్ను కట్టిపడేసే అంత మగాడు ఎవడురా'.. అంటూ ఆది చెప్పడం తెగ నవ్వులు పూయించింది. అనంతరం మహిళల మీద ఆది పంచ్ లు ఎక్కువగా వేస్తున్నాడని, మహిళలకు అస్సలు గౌరవం ఇవ్వడం లేదంటూ.. ఆడవారంతా కలిసి ఆదిని కిడ్నాప్ చేసినట్లు చూపించారు.

సారీ చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. దీంతో ఆది వెంటనే వారి డిమాండ్ ను స్పందిస్తూ.. 'మీరంతా నిజంగా ఎంటర్‌టైన్ చెయ్యండి.. సారీ ఏంటి?.. పొర్లుదండాలు కూడా పెడతా' అంటూ ఛాలెంజ్ చేశాడు. ఆ తర్వాత శిల్పా చక్రవర్తి, భావన తమ డ్యాన్స్‌లతో అదరగొట్టేశారు. ఆది కూడా అదిరిపోయేలా చిందులేస్తూ ఎంటర్ టైన్ చేశాడు.

ఆది పెళ్లి ఎప్పుడూ: ఫైనల్ గా డిఫరెంట్ టాస్కులు, పర్ఫార్మెన్స్‌లతో ఈ ఎపిసోడ్ ఫుల్ ఎంటర్ టైన్ గా సాగినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఇంకా ఈ ప్రోమోలో 'ఆది నీ పెళ్లి ఎప్పుడూ' అంటూ రచ్చ రచ్చ చేశారు పలువురు మహిళలు. మొత్తంగా ఒకేసారి ఇంత మంది ఫీమేల్ ఆర్టిస్టులు ఒకే చోట చేరి కనిపించడంతో ప్రోమో హైలైట్ గా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X