జబర్ధస్త్‌కు హైపర్ ఆది దూరం.. అక్కడ కనిపించి ఇక్కడ లేకపోవడంపై అనుమానాలు.!

By Manoj Kumar P

జబర్ధస్త్... బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రజాధరణ పొందిన షోలలో ఒకటి. ఓ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ఈ షో దాదాపు ఏడేళ్లుగా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అదే సమయంలో ఈ షో వల్ల పదుల సంఖ్యలో ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అలా వెలుగులోకి వచ్చి టాప్ సెలెబ్రిటీగా ఎదిగిన వారిలో కమెడియన్ హైపర్ ఆది ఒకడు. జబర్ధస్త్ వల్ల ఎంతో పాపులర్ అయిన అతడు.. తాజాగా ఆ షోకు దూరమయ్యాడు. అయితే, మరో షోలో కనిపించి షాకిచ్చాడు. దీంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకీ ఏం జరిగింది.? వివరాల్లోకి వెళితే...

హైపర్ ఆది టాలెంట్‌ను గుర్తించింది అతడే

హైపర్ ఆది టాలెంట్‌ను గుర్తించింది అతడే

చాలా రోజులుగా జబర్ధస్త్‌లో తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు యంగ్ సెస్సేషన్ హైపర్ ఆది. టీమ్ లీడర్‌గా, స్క్రిప్ట్ రైటర్‌గా అదరగొడుతున్నాడు. ఇదిలాఉండగా.. హైపర్ ఆది ఈ రేంజ్‌లో సక్సెస్ అవడానికి అదిరే అభినే కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడి టీమ్‌ సభ్యుడిగానే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ విషయాన్ని ఆది కూడా వెల్లడించాడు.

 అందరిలో అతడే ప్రత్యేకం.. కారణం ఇదే

అందరిలో అతడే ప్రత్యేకం.. కారణం ఇదే

ప్రస్తుతం జబర్ధస్త్‌లో ఉన్న కమెడియన్లు అందరిలో హైపర్ ఆది ప్రత్యేకమన్న విషయం తెలిసిందే. దీనికి కారణం అతడి నాన్ స్టాప్ పంచులే. దాదాపు పది నిమిషాలు పాటు ఉండే స్కిట్‌లో గుక్క తిప్పుకోకుండా వేసే పంచుల వల్ల అతడికి మంచి పేరు వచ్చింది. అంతేకాదు, స్పెషల్ ఈవెంట్లకు కూడా స్క్రిప్టులు రాస్తూ సత్తా చాటుతున్నాడీ యంగ్ కమెడియన్.

ఎన్నో ఎన్నెన్నో రికార్డులు ఆది సొంతం

ఎన్నో ఎన్నెన్నో రికార్డులు ఆది సొంతం

టీమ్ లీడర్ అయిన తర్వాత హైపర్ ఆది తక్కువ కాలంలోనే ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. అద్భుతమైన టైమింగ్‌తో అతడు వేసే పంచులకు భారీ స్పందన వస్తోంది. ఈ కారణంగా యూట్యూబ్‌లో ఈ జబర్ధస్త్ కమెడియన్‌ స్కిట్లకు మిలియన్‌కు పైగా వ్యూస్ వస్తున్నాయి. ఇలా ఆది స్కిట్లు ఎన్నో ఎన్నెన్నో రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి.

 బుల్లితెరపైనే కాదు.. వెండితెరపైనా సత్తా

బుల్లితెరపైనే కాదు.. వెండితెరపైనా సత్తా

బుల్లితెరపై తనదైన శైలి చూపించి ఫేమస్ అయిపోయిన హైపర్ ఆది.. సినిమాల్లోనూ సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే అతడు ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించాడు. కామెడీ పాత్రలే కాకుండా కొన్ని చిత్రాల్లో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేశాడు. దీంతో మరిన్ని అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ఇక, ‘మేడ మీద అబ్బాయి' అనే సినిమాతో డైలాగ్ రైటర్‌గానూ మారాడు.

జబర్ధస్త్‌ షోకు హైపర్ ఆది టీమ్ దూరం

జబర్ధస్త్‌ షోకు హైపర్ ఆది టీమ్ దూరం

జబర్ధస్త్ సక్సెస్‌ అవడానికి కారణమైన వారిలో ఒకడైన హైపర్ ఆది.. ఆ షోకు దూరమయ్యాడు. తాజాగా విడుదలైన వచ్చే వారం ఎపిసోడ్‌ ప్రోమోలో అతడి స్కిట్‌ను చూపించకపోవడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఆది టీమ్‌ను మినహాయించి మిగిలిన ఐదు టీమ్‌లు మాత్రమే ప్రదర్శన చేశాయి. దీంతో అతడి టీమ్ ఎందుకు కనిపించలేదన్న డౌట్ అందరిలో వ్యక్తమవుతోంది.

Recommended Video

Jabardasth Comedian నా పెళ్లి జరగకపోతే అందుకు కారణం Sreemukhi, Jhansi నే
అక్కడ కనిపించి ఇక్కడ లేకపోవడంపై..

అక్కడ కనిపించి ఇక్కడ లేకపోవడంపై..

హైదర్ ఆది టీమ్ జబర్ధస్త్ ప్రోమోలో కనిపించకపోవడంతో ఎన్నో అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనా రాకుండా జాగ్రత్త పడేందుకే అతడు షూటింగ్‌కు దూరమయ్యాడన్న టాక్ వినిపిస్తోంది. అయితే, డ్యాన్స్ షో ‘ఢీ'లో అతడు కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక షోలో కనిపించి మరో దానిలో లేకపోవడం వెనుక రీజన్ ఏంటనేది తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X