For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లాక్ కావాలన్న అనసూయకు హైపర్ ఆది లిప్ లాక్...షాకింగ్ కామెంట్స్ చేసిన రోజా!

  |

  జబర్దస్త్ హైపర్ ఆది కి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ఎంటరైన కొద్ది రోజులకి ఏకంగా టీం లీడర్ స్థాయికి చేరుకున్న హైపర్ ఆది పంచులకు చాలా ఫేమస్. ఎప్పటికప్పుడు తన దైన శైలిలో అందరినీ నవ్విస్తూ ఉండే ఆది-అనసూయ విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు నోరుజారి డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తూ ఉంటాడు. అయితే తాజాగా హైపర్ ఆది-అనసూయ మధ్య ఏదో ఉంది అన్నట్లుగా జబర్దస్త్ జడ్జి రోజా కామెంట్ చేయడం సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

  సినిమాల మీద ఆసక్తితో

  సినిమాల మీద ఆసక్తితో

  ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన కోట ఆదయ్య బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్ ఉద్యోగ వేట కోసం వచ్చాడు. ఉద్యోగం సంపాదించిన ఆది, సినిమాల మీద ఆసక్తితో షార్ట్ ఫిలిమ్స్ లాంటివి చేసి ఫేస్బుక్ వేదికగా విడుదల చేస్తూ ఉండేవాడు. అలా ఆయన చేసిన ఒక షార్ట్ ఫిలిం అప్పటి జబర్దస్త్ టీం లీడర్ గా ఉన్న అభి కలవాల్సిందిగా కోరాడు.

  ట్రేండింగ్ లో

  ట్రేండింగ్ లో

  అలా కలవడంతో తన టీంలో రైటర్గా అవకాశం ఇచ్చారు. నెమ్మదిగా టీం రైటర్ గా మొదలైన హైపర్ ఆది టీం లో ఒకడిగా ఆ తర్వాత సొంతంగా టీం క్రియేట్ చేసి అంతగా ఎదిగిపోయాడు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రేండింగ్ లో ఉండే వాటిని వెతుక్కుంటూ వాటిమీద స్కిట్లు రాసుకునే అది డబుల్ మీనింగ్ పంచులకు కూడా బాగా ఫేమస్.

  నిర్వాహకులు మాత్రం

  నిర్వాహకులు మాత్రం

  ఒక రకంగా జబర్దస్త్ బూతు అని పేరు వచ్చింది హైపర్ ఆది ఎంట్రీ తరువాతే అని చెప్పాలి. ఎంత బూతు కంటెంట్ ఇస్తున్నా సరే అవి అన్ని బాగా పేలడంతో జబర్దస్త్ నిర్వాహకులు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఎవరెలా పోతే మాకేంటి టిఆర్పిలు వస్తున్నాయి కదా అన్న చందాన జబర్దస్త్ నిర్వాహకులు మాత్రం పట్టించుకోవడం లేదు.

  డబల్ మీనింగ్ డైలాగ్స్

  డబల్ మీనింగ్ డైలాగ్స్


  జబర్దస్త్ యాంకర్ అనసూయతో హైపర్ ఆది అందరి ముందే మాట్లాడే డబల్ మీనింగ్ డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్యకాలంలో కొన్ని రోజులు అనసూయ జోలికి వెళ్లడం మానేశాడు. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో ఆమె మీద మళ్ళీ పంచులు వేస్తూ రెచ్చిపోయాడు. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో అనసూయ మీద ఆది వేసిన పంచులు దానికి రోజా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

  వెల్డింగ్ చేసే వాడిలా

  వెల్డింగ్ చేసే వాడిలా

  తాజా ఎపిసోడ్ లో మాటే బంగారమాయెనా? శ్రీవల్లి అంటూ పుష్ప రాజ్ స్టైల్ లో వేదికపైకి వచ్చాడు ఆది. రావడం రావడం అనసూయ పక్కన నిలబడి తనపై తానే పంచ్ వేసుకుంటూ ఓపెన్ అయ్యాడు. 'ఆయన చేస్తే వెల్డన్ అనేలా ఉంది.. నేను చేస్తే వెల్డింగ్ చేసే వాడిలా ఉంది' అంటూ ఆది చెప్పడంతో అందరూ పడి పడి నవ్వారు.

  Recommended Video

  Auto Ramprasad's Peep Show First Look | Poster Launch Press Meet
   లిప్ లాక్ కూడా ఇచ్చేస్తాడు

  లిప్ లాక్ కూడా ఇచ్చేస్తాడు

  అనసూయ, మా ఇంటి లాక్ పోయింది.. ఒక లాక్ ఇవ్వరా అని ఆదిని అడగడంతో నువ్ అడగాలి గాని.. అంటుండగానే రోజా అందుకొని షాకింగ్ కామెంట్స్ చేసింది. 'నువ్ అడగాలి గానీ లిప్ లాక్ కూడా ఇచ్చేస్తాడు' అని కౌంటర్ వేస్తుంది. ఆ తర్వాత అనసూయ నా చెల్లెళ్లను టచ్ చేయాలంటే ముందు నన్ను చేయాలి అంటూ ఛాలెంజ్ చేస్తే ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నా అంటూ మళ్ళీ డబుల్ మీనింగ్ తో రెచ్చిపోయాడు. మొత్తం మీద ఈ ఎపిసోడ్ ప్రోమో ఆసక్తికరంగా మారింది.

  English summary
  hyper aadi liplock with anasuya roja comments gone viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X