హైపర్ ఆది లవ్ ప్రపోజల్.. ఆ అమ్మాయి ఏం చేసిందంటే!
తెలుగు బుల్లితెరపై ఎంతో మంది కుర్రాళ్లు తమదైన రీతిలో ప్రభావాన్ని చూపిస్తున్నారు. అందులో కొందరు మాత్రమే ప్రత్యేకంగా నిలుస్తూ సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో టాప్ కమెడియన్ హైపర్ ఆది ఒకడు. చాలా కాలంగా కమెడియన్‌గా దూసుకుపోతోన్న అతడు.. వరుసగా ఆఫర్లను అందుకుంటూ సాగుతున్నాడు. ఇలా ఇప్పుడు చేతి నిండా షోలు, సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా హైపర్ ఆది ఓ షోలో అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!
జబర్ధస్త్‌తో స్టార్‌డమ్
హైపర్ ఆది మొదట్లో సినిమా స్ఫూఫ్ వీడియోలు చేసుకునే వాడు. అవి చూసిన కొందరు అతడిని జబర్ధస్త్ షోలోకి తీసుకు వెళ్లారు. అందులో తనదైన రీతిలో మెప్పించిన అతడు.. తక్కువ సమయంలోనే టీమ్ లీడర్‌గా మారాడు. అప్పటి నుంచి చాలా కాలం పాటు హవాను చూపించి స్టార్‌గా మారాడు. దీంతో హైపర్ ఆదికి ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్ భారీగా పెరిగింది.

వరుసగా సినిమాలు
జబర్ధస్త్ షో వల్ల సంచలనం అయిపోయిన హైపర్ ఆది.. ఈ క్రేజ్ వల్ల ఎన్నో చిత్రాల్లో సైతం అవకాశాలను అందుకున్నాడు. ఇలా ఇప్పటికే ఈ టాలెంటెడ్ గాయ్ ఎన్నో సినిమాల్లో సైతం అదిరిపోయే పాత్రలను చేసి అలరించాడు. దీంతో ఇప్పుడు షోలను తగ్గించి సినిమాల సంఖ్యను పెంచుకున్నాడు. ఫలితంగా అతడి అభిమానులకు హైపర్ ఆది మజాను పంచుతున్నాడు.
ఢీ షోలో కామెడీతో
చాలా కాలం జబర్ధస్త్ షోలో సందడి చేసిన హైపర్ ఆది.. కొన్నేళ్ల నుంచి అందులో వర్క్ చేయడం లేదు. కానీ, ఇప్పుడు 'ఢీ', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలలో మాత్రం యమ సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అలాగే, ఈటీవీలోనే ప్రసారం అవుతోన్న ఢీ 18వ సీజన్ 'ఢీ సెలెబ్రిటీ స్పెషల్' షోలోనూ తనదైన మార్కును చూపిస్తూ కామెడీని పంచుతున్నాడు.

హన్సికతో నాటీగా
'ఢీ' 18వ సీజన్ సెలెబ్రిటీ స్పెషల్ 2లో స్టార్ హీరోయిన్ హన్సిక జడ్జ్‌గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఆమెపై హైపర్ ఆది స్పెషల్ ఫోకస్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఆమెతో నాటీగా మాట్లాడుతూ ఫన్ క్రియేట్ చేస్తున్నాడు. అదే సమయంలో తరచూ ఆమెకు ప్రపోజ్ చేయడం, పెళ్లి గురించి మాట్లాడడం వంటివి చేస్తూ హైపర్ ఆది ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
ఆమెకు ప్రపోజ్ అని
గతంలో కంటే ఎంతో ఆసక్తికరంగా సాగుతోన్న 'ఢీ సెలెబ్రిటీ స్పెషల్ 2' షోలో భాగంగా ఈ వారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో హైపర్ ఆది మరింత ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా హన్సికకు పలు భాషల్లో లవ్ ప్రపోజ్ చేస్తానని చెప్పాడు. అందుకు తగ్గట్లుగానే ముందుగా తెలుగులో 'నేను నిన్న ప్రేమిస్తున్నాను' అని చెప్పాడు. దీంతో హన్సిక అవాక్కైపోయింది.

ఆమెకు ప్రపోజల్
హన్సికకు హైపర్ ఆది లవ్ ప్రపోజ్ చేస్తానని ముందుగా తెలుగులో చెప్పాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న కన్నడ నటిని తన భాషలో చెప్పమని అడిగాడు. దీంతో ఆమె కన్నడంలో ప్రపోజ్ ఎలా చేయాలో చెప్పింది. దీంతో ఆమెకే హైపర్ ఆది ప్లాప్ ప్రకారం 'ఐలవ్యూ టూ' అని చెప్పేశాడు. అతడు చేసిన ఈ పనికి సదరు నటి షాకై నోరెళ్లబెట్టింది. తర్వాత సైలెంట్‌గా ఉండిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











