హైపర్ ఆదితో లవ్ ట్రాక్.. క్లారిటీ ఇచ్చిన జబర్తస్ బ్యూటీ..
తెలుగు బుల్లితెరపై కామెడీ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేర్లలో హైపర్ ఆది (Hyper Aadi) ఒకరు. పదునైన పంచులు, టైమింగ్‌తో కూడిన సెటైర్లు, ప్రాసలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఆయన జబర్దస్త్ వేదికపై తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. బుల్లితెర నుంచే కాదు, వెండితెరపైనా తనదైన గుర్తింపును సంపాదించుకున్న ఆది, ప్రస్తుతం వరుస టీవీ షోలు, సినిమాలతో బిజీగా కొనసాగుతున్నారు. అయితే ఇలాంటి స్టార్ కామెడియన్ పేరు ఇటీవల ఓ లవ్ ట్రాక్ చర్చలోకి రావడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ యాంకరమ్మ ఎవరు? ఇంతకీ ఆమె ఎన్నారంటే?
ఆ యాంకర్ ఎవరో కాదు.. ఒకప్పుడు మాజీ జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు (Anchor Soumya Rao). అనసూయ భరద్వాజ్ స్థానంలో కొద్దికాలం జబర్దస్త్ యాంకర్‌గా వ్యవహరించిన సౌమ్య రావు, అప్పట్లో భాషా సమస్యలు, ట్రోలింగ్ కారణంగా షో నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమె పూర్తిగా కనుమరుగుకాలేదు... ఇతర టీవీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సౌమ్య రావు, తన జబర్దస్త్ అనుభవాలు, షోలో ఎదురైన పరిస్థితులు, సహ ఆర్టిస్టులతో ఉన్న పరిచయాలపై ఓపెన్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా హైపర్ ఆదితో తనపై వచ్చిన లవ్ ట్రాక్ రూమర్స్ గురించి కూడా స్పందించారు. ఆ వ్యాఖ్యలతోనే సౌమ్య మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు.

ముందుగా రష్మీ గౌతమ్ - సుడిగాలి సుధీర్ జోడీ గురించి అడిగిన ప్రశ్నకు సౌమ్య స్పష్టమైన సమాధానం ఇచ్చారు. 'నిజానికి నాకు వాళ్లిద్దరి గురించి అంతగా తెలియదు. నేను ఎప్పుడూ వాళ్లను జోడీగా చూసినట్టూ, అలా భావించినట్టూ లేదు'అంటూ ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రష్మీతో తనకు పెద్దగా పరిచయం లేదని సౌమ్య స్పష్టం చేశారు. 'సుధీర్ మాత్రం అప్పుడప్పుడు కలిసే వాడు. కానీ రష్మీతో అంతగా మాట్లాడిన సందర్భాలు లేవు' అని తెలిపారు. రష్మీతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది అని అడిగితే, 'షోలోగా ఉన్నప్పుడు హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ చెప్పడం తప్ప ఇంకేమీ లేదు. వాళ్ల షో వేరు, నా షో వేరు. కలిసే అవకాశం కూడా చాలా తక్కువ. కొన్ని స్పెషల్ ఈవెంట్స్‌లో మాత్రమే రష్మీ గారిని కలిశాను. వారితో నాకు పెద్దగా కనెక్టివిటీ లేదు' అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఇక జబర్దస్త్ షో నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా ఉండమని అడిగారా? లేదా మీరు ఏమైనా రిక్వెస్ట్ చేశారా? అనే ప్రశ్నకు సౌమ్య మరింత స్పష్టంగా స్పందించారు. 'లేదు... అలాంటిదేమీ జరగలేదు. అలా అడిగి తీసుకోవడం నాకు కరెక్ట్ అనిపించదు. నాకు న్యాయంగా వస్తేనే నేను ఏ అవకాశాన్నైనా తీసుకుంటాను. నాకు ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసే టాలెంట్ ఉందని ఎవరైనా గుర్తించి, ఈ అమ్మాయికి ఈ అవకాశం ఇవ్వాలి అనుకుంటే అప్పుడు మాత్రమే నేను ఒప్పుకుంటాను' అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇంటర్వ్యూలో హైలైట్‌గా నిలిచాయి.
తెలుగులో మీకు ఎవరితో ఎక్కువ కనెక్టివిటీ ఉంది? అని అడిగిన ప్రశ్నకు సౌమ్య ఆసక్తికర సమాధానం ఇచ్చారు.'నాకు తెలుగులో చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. షూటింగ్ ఉంటే వస్తాను, షూటింగ్ అయిపోయిన గంటలో ఫ్లైట్ ఎక్కుతాను, లేదంటే మరుసటి రోజే వెళ్లిపోతాను. ఇక్కడ నాకు ప్రియాంక సింగ్, సత్య శ్రీ ఇద్దరే చాలా క్లోజ్. వాళ్లు ఇద్దరూ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. అలాగే జబర్దస్త్ టీమ్ లీడర్స్ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు'అని చెప్పారు.
ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర ప్రశ్నగా హైపర్ ఆది - సౌమ్య లవ్ ట్రాక్ ఎందుకు సక్సెస్ కాలేదు? అని అడగగా, దానికి కూడా సౌమ్య ఓపెన్‌గా సమాధానం ఇచ్చారు. 'మేము కూడా లవ్ ట్రాక్ ట్రై చేశాం. అది హిట్ అయింది. దాదాపు నాలుగు ఎపిసోడ్లు చేశాం. వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. కానీ ఆ తర్వాత హైపర్ ఆదికి వరుసగా సినిమా షూటింగ్స్ రావడంతో ఆ ట్రాక్‌ను కంటిన్యూ చేయలేకపోయాం' అని వివరించారు.
అయితే ఆ ట్రాక్‌పై ఇప్పటికీ మంచి ఫీడ్‌బ్యాక్ వస్తోందని సౌమ్య చెప్పారు. 'ఇప్పటికీ బయట ఎవరైనా కలిసినప్పుడు, మీ ఇద్దరి ట్రాక్ చాలా బాగా వర్క్ అవుట్ అయింది, మీరు మమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేశారు అని చెబుతుంటారు. అది నాకు ఇప్పటికీ హ్యాపీనే'అంటూ ఆనందం వ్యక్తం చేశారు. మీ ట్రాక్ స్టార్ట్ చేయడానికి ముందు రష్మీ-సుధీర్ ట్రాక్‌ను ఏమైనా ఫాలో అయ్యారా? అనే ప్రశ్నకు సౌమ్య స్పష్టంగా 'లేదు' అన్నారు. 'నిజానికి జబర్దస్త్‌లోకి వచ్చే వరకు ఆ షో గురించి కూడా నాకు అంతగా ఐడియా లేదు. షోలోకి వచ్చిన తర్వాతే దాని గురించి తెలుసుకున్నాను. అప్పటినుంచి ఇంట్రెస్ట్ పెరిగింది' అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











