'మొద్దుల చాటున సుధీర్, రష్మి ముద్దులు'
Sudheer- Rashmi: బుల్లితెర ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో ఏండ్లుగా వీరిద్దరి ప్రేమించుకుంటున్నారనీ, మరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే.. కేవలం టీవీ షో ల రేటింగ్ కోసం వీరు అలా నటిస్తున్నారా? అనే అనుమానం కూడా ఉంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల్లో కూడా వీరిద్దరూ కలిసి నటించారు. స్మాల్ స్కీన్ పై సుధీర్- రష్మి జంటకు స్టార్ హీరో హీరోయిన్స్ లా ఇమేజ్ సొంతం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి షో చేస్తే.. భారీగా రెస్పాన్స్ పక్కా. అయితే.. ఈ జంటపై బుల్లితెర నవ్వుల రారాజు హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?
హైపర్ ఆది.. ఈ పేరు తెలియని, అతని పంచుల తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆది తన డబుల్ మీనింగ్ పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. దీంతో ఆది ఓ సెపరేట్ ఫ్యాన్స్ బేస్ సొంతం చేసుకున్నారు. గత పదేళ్లుగా జబర్దస్త్ షోలో కమెడియన్ గా చేస్తూ అందరినీ నవ్విస్తున్న ఈయన కెరియర్ పరంగా దూసుకు వెళ్తున్నారు. ఈ షో తో ద్వారా ఫుల్ క్రేజ్ దక్కించుకున్న ఆది పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు దక్కించుకుంటున్నాడు.

ఇలా చిన్న కామెడియన్ స్థాయి నుంచి టీం లీడర్, యాంకర్ గా కూడా మారి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఊహించని స్థాయిలో క్రేజ్ దక్కించుకున్న ఈయన ఒక్క జబర్దస్త్ లోనే కాకుండా అనేక రకాల షోలలో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. ముఖ్యంగా శ్రీదేవి డ్రామా కంపెనీ, మరోవైపు జబర్దస్త్, ఢీ జోడీ షోలో కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నాడు. తాజాగా హైపర్ ఆది 'సంక్రాంతి' సందర్భంగా ఈటీవీ లో ఏర్పాటు చేసిన స్పెషల్ ఎంటర్టైన్మెంట్ షోలో 'పుష్ప 2' స్పూఫ్ స్కిట్ చేశారు. ఈ స్కిట్ లో అల్లు అర్జున్ 'పుష్పరాజ్' పాత్రను హైపర్ ఆది ఇమిటేట్ చేశారు. శ్రీవల్లిగా ఫైమా కనిపించింది.
ఈ స్కిట్ లో భాగంగా.. ఈ సంక్రాంతికి ఎవడైనా గాని ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో తగ్గేదేలే అంటూ మాస్ డైలాగ్ తో ఎంట్రీ ఇస్తాడు హైపర్ ఆది. ఈవెంట్ కు స్పెషల్ గెస్టులుగా వచ్చిన వారిని టార్గెట్ చేస్తూ పంచులు వేస్తాడు హైపర్ ఆది. ముందు శేఖర్ మాస్టర్, పూర్ణ తను చూసి.. అరేయ్ ఇదేమైనా 'ఢీ జోడి ప్రొగ్రామ్ రా.. వాళ్లు వాళ్లు వచ్చారు? అని పక్కనున్న కమిడియన్ నరేష్ ను అడుగుతాడు. 'కాదన్నా ఇది సంక్రాంతి ఈవెంట్' అంటూ బదులిస్తారు. సరే లే అంటూ.. సుధీర్, రష్మిలను టార్గెట్ చేస్తూ..'సుదీర్ గాడి పక్కన ఉన్న పిల్ల ఎవర్రా' అని తెలియనట్లు అడుగుతాడు. దీంతో రష్మి కుళ్ళుకుంటుంది. ఆమె ఎవరో కాదన్నా.. మన యాంకర్ రష్మీ.. అంటూ తన గ్యాంగ్ మెంబర్స్ అంటారు.
'అన్న నీకు ముందే .. రష్మి, సుధీర్ లు తెలుసా అని కామెడియన్ నరేష్ అడగగా.. వాళ్ళిద్దరు తెలియపోవడం ఏంట్రా.. డబుల్ మినింగ్ పంచ్ వేస్తాడు ఆది. అయితే.. మరి వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారా అన్న అని నరేష్ అడుగుతారు. 'యుగాంతమైన అవుతుంది గాని.. వాళ్ళిద్దరి పెళ్లి మాత్రం కాదురా.. అని హైపర్ ఆది అంటాడు. కనీసం 50 ఏళ్ల తర్వాత అయినా పెళ్లి చేసుకుంటారా? అని నరేష్ మళ్లీ అడుగుతాడు. దీంతో ఐపర్ ఆది రియాక్ట్ అవుతూ.. '50 ఏళ్ల తర్వాత పోతారు కదా.. ఇంకేం పెళ్లి చేసుకుంటారు' అంటూ బదిలిస్తాడు. అ తరువాత ' అవున్రా ఈ షోలో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అందరూ జంటలు జంటలుగా వచ్చారు.. ఈ షో డైరెక్టర్ కు కంటెంట్ మీద కన్న.. వాళ్ళని వీళ్ళని కలపడంపై ఇంట్రెస్ట్ బాగుందిరా ' అంటూ అదిరిపోయే పంచ్ వేస్తాడు. దీంతో షో మొత్తం కడుపుబ్బా నవ్వుకుంటుంది.


Click it and Unblock the Notifications











