అలాంటి పరిస్ధితి వస్తుందంటే జీవితంలో పెళ్లి చేసుకోను... హైపర్ ఆది ఎమోషనల్

తన పంచ్‌లు, ప్రాసలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు హైపర్ ఆది. జబర్దస్త్ ద్వారా పరిచయమైన ఆది ఇప్పుడు సినీరంగంలోనూ సత్తా చాటుతున్నాడు. ఒకప్పుడు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో సతమతమైన ఆది.. తన కష్టంతో కుటుంబ సమస్యలు పరిష్కరించి పెద్ద దిక్కులా మారాడు. సినిమాలతో బిజీ అయినా బుల్లితెరను వదిలేయలేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తెలుగు బుల్లితెరపై సుధీర్ తర్వాత మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరిగా ఉన్నాడు ఆది. పెళ్లి గురించి అడిగినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటూనే ఉన్నాడు. తాజాగా తన పెళ్లిపై ఆది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతివారం సరికొత్త థీమ్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. బుల్లితెర సెలబ్రిటీలు తమ అల్లరితో వినోదాన్ని పంచుతున్నారు. ఎప్పటిలాగే ఈ వారం కూడా బ్రదర్స్ డే సందర్భంగా సరికొత్తగా రెడీ అయ్యింది శ్రీదేవి డ్రామా కంపెనీ. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. తొలుత కృష్ణ భగవాన్, హైపర్ ఆది, పొట్టి నరేష్‌లు ఎంట్రీ ఇస్తారు. ఎప్పుడు చూసినా అదోలా ఉంటారని ఆది అడగ్గా.. చనిపోయిన నా భార్య గుర్తొచ్చిందని చెబుతాడు కృష్ణ భగవాన్. రెండో పెళ్లి చేసుకోవచ్చు కదా అని ఆది అనగా.. రెండో పెళ్లి చేసుకోవచ్చు కదా అంటాడు భగవాన్. మరి రెండో ఆవిడ ఎందుకు పోయిందని ఆది అడగ్గా.. దానిని రెండో పెళ్లి చేసుకున్నానని దానికి తెలియదు, అందుకే పోయిందని పంచ్ పేలుస్తాడు కృష్ణ భగవాన్.

Hyper Aadi Makes Interesting Comments About Marriage in Sridevi Drama Company

ఆ వెంటనే సెలబ్రిటీలంతా రావడంతో షాకైన ఆది.. నాకు తెలిసి మీరు ఉద్యోగం చేయలేదు, ఇదే ఉద్యోగంలా చేశారని పంచ్ పేలుస్తాడు. నేనే నీ కొడుకుని, నేనే నీ కొడుకుని అంటూ కౌశిక్, బాలాదిత్యలు వాదించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత సింగర్స్ బ్రదర్స్ ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు. అనంతరం ఫైమా, పంచ్ ప్రసాద్, బుల్లెట్ భాస్కర్‌లు నవ్వించారు. యాపిల్ అంటే ఇద్దరం కలిసి తిన్నాం అదేనా అని ఫైమా అడగ్గా.. ఇద్దరం కలిసి తిన్నాం కానీ అది నేను కాదని పంచ్ ప్రసాద్ పంచ్ వేస్తాడు. ఆ వెంటనే ఫైమా, బాలాదిత్యలు దుప్పటిలో ఆవిరి పిలుస్తారు. దుప్పటిలోకి రాగానే పిల్చేస్తున్నాడని బాలాదిత్యపై పంచ్‌లు విసురుతుంది ఫైమా.

బ్రదర్స్ అంతా సేమ్ డ్రెస్‌లో ఎంట్రీ ఇవ్వగానే మీరు ఒకరికి తెలియకుండా మరొకరు ప్రేమించిన అమ్మాయి పేరు ఏంటీ? అని ఆది టెస్ట్ పెడతాడు. రమ్య అని ఇద్దరూ రాయడంతో అంతా నవ్వేస్తారు. పంచ్ ప్రసాద్ ఫ్యామిలీ వచ్చి ఒకరికొకరు గిఫ్ట్‌లు ఇచ్చుకుని ఎమోషనల్ అవుతుంది. తర్వాత బుల్లెట్ భాస్కర్‌ని ఓ టాస్క్‌లో పెద్ద గుండ్లు లాంటి బంతులతో కొట్టడంతో అతను పడిపోతాడు. ఇక కౌశిక్, బాలాదిత్యలు చేసిన స్కిట్ అందరినీ కంటతడి పెట్టించింది. మా ఆయన జేబులో నుంచి డబ్బులు దొంగతనం చేస్తున్నావా అని కౌశిక్ భార్య.. బాలాదిత్యను నిలదీస్తుంది.

దొంగతనం కాదు వదిన.. ఏదో కొంచెం అవసరమని తీసుకున్నానని అంటాడు బాలాదిత్య. అదంతా ఒకప్పుడు.. ఆ డబ్బులు అక్కడ పెట్టు అని వదిన గద్దిస్తుంది. దాంతో నా వల్ల మీకు, వదినకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే నేను మీ మధ్య ఉండకూడదు, అందుకే వెళ్లిపోతున్నానని లెటర్ రాస్తాడు బాలాదిత్య. దాంతో తమ్ముడిని తలచుకుని బాధపడుతూ మంచం ఎక్కుతాడు కార్తీక్. అన్నయ్యని లేవమంటూ బాలాదిత్య వెక్కి వెక్కి ఏడుస్తాడు. ఈ స్కిట్ అందరినీ ఏడిపించింది. ఆ వెంటనే ఆది మాట్లాడుతూ.. పెళ్లి చేసుకుంటే అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తాయనే పాయింట్ నిజమైతే మాత్రం.. అలాంటి పెళ్లి కూడా చేసుకోవడానికి ఇష్టపడను. నాకు మా అన్నయ్యలంటే అంత ఇష్టమని ఆది చెప్పడంతో అంతా చప్పట్లు కొడతారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా... హైపర్ ఆది తన పెళ్లిపై ఓపెన్ అయ్యాడని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X