For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పెళ్లిపై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్: అనసూయ మధ్యలోకి లాగుతూ.. అలా నోరు జారిన కమెడియన్

  |

  తెలుగు రాష్ట్రాల్లో టాలెంట్ ఉండి.. తమ ప్రతిభను బయట పెట్టుకునేందుకు ఫ్లాట్‌ఫాం దొరకక ఇబ్బందులు పడుతోన్న ఎంతో మందికి ఓ మార్గాన్ని చూపిస్తోన్న షోలలో జబర్ధస్త్ ఒకటి. దీని ద్వారా కొన్ని వందల మంది బుల్లితెరపైకి అడుగు పెట్టారు. అందులో కొందరు మాత్రం బిగ్ సెలెబ్రిటీలుగా ఎదిగిపోయారు. వారిలో టాప్ కమెడియన్ హైపర్ ఆది ఒకడు. ఏమాత్రం అంచనాలు లేకుండానే ఈ రంగంలోకి వచ్చిన అతడు.. తక్కువ సమయంలోనే ఫేమస్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా అనసూయను మధ్యలోకి లాగుతూ పెళ్లి గురించి హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

  ఫ్లాట్‌ఫాం ఇస్తే.. పిల్లర్‌గా ఎదిగిపోయాడు

  ఫ్లాట్‌ఫాం ఇస్తే.. పిల్లర్‌గా ఎదిగిపోయాడు

  తెలుగులో నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. దాదాపు ఎనిమిదేళ్లుగా ఇది టెలివిజన్ రంగంలో ట్రెండ్ సెట్ చేయడంతో పాటు ఎంతో మందిని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అలా తీసుకొచ్చిన వారిలో హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతడికి ఈ షో ఫ్లాట్‌ఫాంలా మారితే.. చాలా తక్కువ సమయంలోనే టాలెంట్‌ను నిరూపించుకుని పిల్లర్‌లా ఎదిగాడు.

  హైపర్ ఆదినే ట్రెండింగ్... రికార్డులు బ్రేక్

  హైపర్ ఆదినే ట్రెండింగ్... రికార్డులు బ్రేక్

  ప్రతి గురువారం ప్రసారం అయ్యే జబర్ధస్త్‌లో హైపర్ ఆది స్కిట్లే టాప్‌లో ఉంటాయి. ఎప్పుడూ సరికొత్త అంశాలతో స్కిట్లు చేసే అతడు.. పంచుల వర్షం కురిపిస్తూ ప్రేక్షకులను నవ్వుల్లో మునిగేలా చేస్తుంటాడు. అందుకే అతడి టీమ్‌కు సంబంధించిన స్కిట్లకు యూట్యూబ్‌లో భారీ స్పందన వస్తోంది. ఇలా ఎక్కువ వ్యూస్ సాధిస్తూ ఎన్నో రికార్డులను క్రియేట్ చేసుకున్నాడీ కమెడియన్.

  వాళ్లపై దండయాత్ర చేస్తోన్న కమెడియన్

  వాళ్లపై దండయాత్ర చేస్తోన్న కమెడియన్

  తన స్కిట్‌లో ఎవరు చేసినా.. వాళ్లను కనపడకుండా చేయడం హైపర్ ఆది ప్రత్యేకత. అంతలా అతడు ఎదుటి వారిపై గుక్క తిప్పుకోకుండా పంచులు వేస్తూ దండయాత్ర చేస్తుంటాడు. ఇందులో భాగంగానే తన స్కిట్లలో ఎక్కువ శాతం ట్రెండింగ్ అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే జడ్జ్‌లు, యాంకర్లను కూడా వదలిపెట్టకుండా వాళ్లపైనా పంచులు విసురుతుంటాడు.

  ఎవరో ఒక అమ్మాయి ఉండాల్సిందే కదా

  ఎవరో ఒక అమ్మాయి ఉండాల్సిందే కదా


  హైపర్ ఆది స్కిట్ అంటే పక్కన ఒక అమ్మాయి ఉండాల్సిందే అన్న టాక్ ఉంది. ఆ విధంగా అతడు తన ప్రతి స్కిట్‌లో ఎవరో ఒక యువతిని తీసుకొచ్చి పెర్ఫార్మ్ చేయిస్తుంటాడు. అలా ఇప్పటికే ఎంతో మందిని గెస్టులుగా తీసుకొచ్చాడు. ఆ అమ్మాయిలు కూడా చాలా ఫేమస్ అయ్యారు. అందులో జబర్ధస్త్ వర్ష కూడా ఒకరు. ఆది వల్ల వచ్చిన ఆమె.. ఇప్పుడు షోలో పర్మినెంట్ అయింది.

  అనసూయను అలా తీసుకొచ్చిన హైపర్

  అనసూయను అలా తీసుకొచ్చిన హైపర్

  గెస్టుగా వచ్చే అమ్మాయిలు లేకున్నా హైపర్ ఆది అదిరిపోయే ప్లాన్లు వేస్తుంటాడు. ఇందులో భాగంగానే జబర్ధస్త్ యాంకర్ అనసూయను తరచూ తన స్కిట్లలో వాడుతుంటాడు. ఇందులో భాగంగానే వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్ కోసం ఆమెను తీసుకొచ్చాడు. అంతేకాదు, ఈ హాట్ యాంకర్‌కు మరదలి పాత్రను కూడా ఇచ్చాడు. దీంతో ఆమె యాక్టింగ్ అదరగొట్టేసింది.

  తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు

  తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు

  ఈ స్కిట్‌లో భాగంగా హైపర్ ఆది.. శాంతి (శాంతి స్వరూప్)ని వివాహం చేసుకున్నాడు. ఆమెకు చెల్లెలిగా అనసూయ నటించింది. ఈ సందర్భంగా ఆమె ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు' అనే పాటతో ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు ఆది ‘ఏంటి మీ చెల్లి తల ఎత్తదా' అని అడగగా.. అనసూయ ‘మా నాన్నగారు ఎత్తొద్దన్నారు' అని బదులిస్తుంది. అప్పుడు ఆది మాత్రం ఆమెను చూస్తుంటాడు.

  Chiranjeevi Releases Shasi Movie Teaser
  పెళ్లిపై కామెంట్.. అనసూయ లాగి మరీ

  పెళ్లిపై కామెంట్.. అనసూయ లాగి మరీ


  ఇది కొనసాగుతోన్న సమయంలో శాంతి మాట్లాడుతూ.. ‘మా చెల్లి చపాతీలా ఉంటుంది' అంటుంది. అప్పుడు ఆది ‘ఆవిడ చపాతీలా ఉంటే.. నువ్వు చపాతీ కర్రతో కొట్టినట్లు ఉంటావు' అంటూ పంచ్ వేశాడు. అప్పుడు అనసూయ ‘మా అక్క పరువు తీయొద్దు. తను నాకు ఎన్నో ఇచ్చింది' అనే డైలాగ్ చెప్పింది. దీంతో ఆది వెంటనే ‘పెళ్లి కూడా నీకిచ్చి చేసినా బాగుండు' అంటూ నోరు జారాడు.

  English summary
  Hyper Aadi is a Telugu actor and comedian who was born in Chimakurthy, Andhra Pradesh. After completing his B.tech in 2012, he had worked as a software engineer at the Tata Consultancy Services in Hyderabad. He is an outstanding comedian performer and that is the only reason behind his name i.e ‘Hyper’.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X