హైపర్ ఆది పర్సనల్ లైఫ్‌ గురించి ఊహించని న్యూస్.. ఆమెనే పెళ్లి చేసుకుంటున్నాడా.?

By Manoj

చాలా తక్కువ సమయంలోనే ఎవరూ ఊహించనంత ఎత్తుకు ఎదిగిపోయాడు ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది. ఓ చానెల్‌లో ప్రసారం అవుతోన్న 'జబర్ధస్త్' అనే కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చిన అతడు.. అసాధారణమైన టాలెంట్‌తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. గుక్క తిప్పుకోకుండా పంచ్‌లు వేయగల అతడి నైపుణ్యానికి చాలా మందే అభిమానులు ఉన్నారు. ఇప్పుడిప్పుడే అంచలంచెలుగా ఎదుగుతున్న హైపర్ ఆది పర్సనల్ లైఫ్ గురించి ఊహించని న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే ఓ అమ్మాయి గురించి ప్రచారం మొదలైంది. ఇంతకీ ఏం జరిగింది.? పూర్తి వివరాల్లోకి వెళితే...

ఏడేళ్ల జబర్ధస్త్ చరిత్రలో ఆ రికార్డు ఆదిదే

ఏడేళ్ల జబర్ధస్త్ చరిత్రలో ఆ రికార్డు ఆదిదే


జబర్ధస్త్ కామెడీ షో ఏడేళ్లుగా ప్రసారం అవుతోన్న విషయం తెలిసిందే. సుదీర్ఘమైన ఈ కాలంలో ఆ షోకు ఎంతో మంది టీమ్ లీడర్లుగా పని చేశారు. అయితే, కామెడీ షో చరిత్రలోనే హైపర్ ఆదిలా ఒంటి చేత్తో స్కిట్లను నడిపించిన వారు చాలా తక్కువ. అంతేకాదు, తక్కువ సమయంలోనే ఎక్కువ ఎపిసోడ్స్ గెలుపొందిన టీమ్ లీడర్‌‌గా అతడికి అద్భుతమైన రికార్డు కూడా ఉంది.

పది నిమిషాల్లో లెక్కపెట్టలేనని పంచులు

పది నిమిషాల్లో లెక్కపెట్టలేనని పంచులు

జబర్ధస్త్ షోలో హైపర్ ఆది స్కిట్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూట్యూబ్‌లో అతడికి వచ్చే వ్యూస్‌ను బట్టే దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, అతడి స్కిట్ల కోసం టీవీల ముందు కూర్చునే వాళ్లూ ఉన్నారు. పది నిమిషాల పాటు ఉండే అతడి స్కిట్లో లెక్కపెట్టలేనన్ని పంచులు ఉండడం వల్లే అతడికి ఫ్యాన్స్ ఎక్కువవుతున్నారు.

అక్కడా ఎంట్రీ ఇచ్చాడు.. గుర్తింపు పొందాడు

అక్కడా ఎంట్రీ ఇచ్చాడు.. గుర్తింపు పొందాడు

బుల్లితెరపై తిరుగులేని కమెడియన్‌గా వెలుగొందుతోన్న హైపర్ ఆది.. సినిమాల్లోకి కూడా ఎంటర్ అయ్యాడు. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో హీరో ఫ్రెండ్ పాత్రలు కూడా చేశాడు. అలాగే, ‘ఆటగదరా శివ' అనే మూవీలో కీలక పాత్ర పోషించాడు. ఇక, అల్లరి నరేష్ నటించిన ‘మేడ మీద అబ్బాయి' అనే సినిమాకు సంభాషనలు అందించి డైలాగ్ రైటర్‌గానూ గుర్తింపు పొందాడు.

బుల్లితెర యాంకర్‌తో రొమాన్స్‌తో హాట్ టాపిక్

బుల్లితెర యాంకర్‌తో రొమాన్స్‌తో హాట్ టాపిక్

జబర్ధస్త్‌ షోలో యాంకర్ అనసూయపై అప్పుడప్పుడు బిస్కెట్లు వేసే హైపర్ ఆది.. ఆమెను ఇష్ట పడుతున్నట్లు చెప్పుకుంటాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందని ప్రచారం జరిగింది. అలాగే, ‘ఢీ' షోలోకి ఎంటర్ అయిన తర్వాత ఆదిలో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే అతడి కో టీమ్ లీడర్ అయిన యాంకర్ వర్షిణితో అతడు రొమాన్స్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.

హాట్ యాంకర్‌తో హైపర్ ఆది వివాహం

హాట్ యాంకర్‌తో హైపర్ ఆది వివాహం

‘ఢీ'లో హైపర్ ఆది.. వర్షిణితో పండిస్తున్న రొమాన్స్ చూసి వాళ్లిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆది కూడా ‘మా మధ్య బలమైన ట్రాక్ నడుస్తోంది' అని చెప్పడం దీనికి బలం చేకూర్చింది. దీంతో అప్పటి నుంచి సోషల్ మీడియాలో వీళ్లిద్దరి పెళ్లి జరగబోతుందని వార్తలు ప్రచారం అవుతున్నాయి.

ఆది పర్సనల్ లైఫ్‌ గురించి ఊహించని న్యూస్

ఆది పర్సనల్ లైఫ్‌ గురించి ఊహించని న్యూస్


వరుస షోలు, సినిమాలతో బిజీ బిజీగా సాగుతున్న హైపర్ ఆది ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే మరిన్ని ఆఫర్లు అందుకుంటున్నాడు. దీంతో అతడు ఇంకా బాగా ఎదుగుతాడని చాలా మంది ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హైపర్ ఆది పెళ్లికి సిద్ధమయ్యాడని ఓ న్యూస్ బయటకు రావడం చర్చనీయాంశం అవుతోంది.

Recommended Video

Dhanraj & Venu Tillu Hilarious Skit On Corona
ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాడా.?

ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాడా.?

తాజాగా ప్రచారం అవుతోన్న సమాచారం ప్రకారం.. హైపర్ ఆది పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. ఇప్పటికే అతడికి అమ్మాయిని కూడా వెతికేశారట అతడి తల్లిదండ్రులు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆ అమ్మాయిని మనోడు వచ్చే ఏడాది సమ్మర్‌లో వివాహం చేసుకోబోతున్నాడని అంటున్నారు. దీంతో ఆది ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X