ఆ అమ్మాయిల వల్ల హైపర్ ఆదికి ఇబ్బందులు: వైఫ్, లవర్ దెబ్బకు ప్లాన్ మార్చాడు.!

By Manoj

బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే మరెవరికీ సాధ్యం కాని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు యంగ్ టాలెంటెడ్ కమెడియన్ హైపర్ ఆది. టీమ్ సభ్యుడిగా జబర్ధస్త్‌‌లోకి ఎంటర్ అయిన అతడు... అద్భుతమైన టాలెంట్‌తో టీమ్ లీడర్ అయిపోయాడు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు అమ్మాయిల వల్ల హైపర్ ఆది ఇబ్బందులు పడుతున్నాడట. ఇంతకీ ఎవరా అమ్మాయిలు.? పూర్తి వివరాలు మీకోసం.!

డైలాగులతో వాళ్లందరిపై ఆది దండయాత్ర

డైలాగులతో వాళ్లందరిపై ఆది దండయాత్ర

జబర్ధస్త్‌లో చాలా మంది టీమ్ లీడర్లు ఉన్నా... హైపర్ ఆది మాత్రమే పంచు డైలాగులతో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. గుక్క తిప్పుకోకుండా వేసే పంచుల కోసమే చాలా మంది జబర్ధస్త్ షోను చూస్తున్నారని చెప్పొచ్చు. టీమ్‌లోని సభ్యులపై డైలాగులతో దండయాత్ర చేసే ఆది... యాంకర్లు, జడ్జ్‌లు, మిగిలిన టీమ్ లీడర్లను కూడా వదిలిపెట్టకుండా కౌంటర్లు ఇస్తుంటాడు.

రికార్డుల రారాజు.. ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్

రికార్డుల రారాజు.. ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్

హైపర్ ఆది ఎంటర్ అయిన తర్వాత జబర్ధస్త్ రేటింగ్ కూడా పెరిగిందన్న టాక్ ఉంది. అంతేకాదు, యూట్యూబ్‌లో సైతం అతడి స్కిట్లకు మంచి స్పందన వస్తోంది. అందుకే ప్రతివారం అతడి స్కిట్లే ట్రెండింగ్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది. ఇవి మాత్రమే కాదు... స్పెషల్ ఈవెంట్లు చేసినప్పుడు కూడా ఆది పెర్ఫార్మెన్స్‌కు దిమ్మతిరిగిపోయే రీతిలో వ్యూస్ వస్తున్నాయి.

వాళ్లపై కౌంటర్లు... అస్సలు తగ్గడం లేదు

వాళ్లపై కౌంటర్లు... అస్సలు తగ్గడం లేదు

హైపర్ ఆది తన స్కిట్లలో ఎంతో మంది సెలెబ్రిటీలను సైతం టార్గెట్ చేస్తుంటాడు. ఇందులో భాగంగానే ట్రెండింగ్‌లో ఉన్న సోషల్ ఇష్యూలపై తనదైన శైలిలో పంచులు విసురుతుంటాడు. దీంతో అప్పుడప్పుడూ కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొంటున్నాడు. అయినప్పటికీ ఆది తీరు మాత్రం మారడం లేదు. పైగా మరింత ఉత్సాహంతో స్కిట్లు రాస్తూ దూసుకుపోతున్నాడు.

యాంకర్‌తో లవ్ ట్రాక్.. త్వరలోనే ఆది పెళ్లి

యాంకర్‌తో లవ్ ట్రాక్.. త్వరలోనే ఆది పెళ్లి

యాంకర్ వర్షిణితో అతడు లవ్ ట్రాక్ నడుపుతున్నాడని కూడా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలాఉండగా... ఈ జబర్ధస్త్ కమెడియన్ నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నాడని ఆ మధ్య పుకార్లు షికార్లు చేశాయి. అంతేకాదు, అమ్మాయి వివరాలు ఇవేనంటూ కొన్ని అంశాలు తెరపైకి వచ్చాయి.

ఊహించని విధంగా.. పవన్ పాటతో ఎంట్రీ

తన ఎంట్రీని ఎప్పుడూ స్పెషల్‌గా క్రియేట్ చేసుకుంటుంటాడు టాప్ కమెడియన్ హైపర్ ఆది. అతడి ప్రతి స్కిట్లో ఇదే పరిస్థితి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇంట్రడక్షన్ పాటకు అతడు వేసే స్టెప్పులు నవ్వు తెప్పిస్తుంటాయి. అయితే, వచ్చే వారం ఎపిసోడ్‌లో మాత్రం ఊహించని విధంగా ఆది... పవన్ కల్యాణ్ నటించిన ‘అన్నవరం' సినిమాలోని ‘అన్నయ్య అన్నావంటే' పాటతో ఎంట్రీ ఇచ్చాడు.

ఆ అమ్మాయిల వల్ల.. ఆదిపై విమర్శలు

ఆ అమ్మాయిల వల్ల.. ఆదిపై విమర్శలు

మిగిలిన టీమ్ లీడర్లతో పోల్చుకుంటే హైపర్ ఆది స్కిట్లు చాలా రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంటాయి. దీనికి కారణం అతడి స్కిట్లలో ఎవరో ఒక స్పెషల్ గెస్ట్ ఎంట్రీ ఇస్తుండడమే. మరీ ముఖ్యంగా తన ప్రతి స్కిట్‌లోనూ ఒక అమ్మాయికి అవకాశం కల్పిస్తుంటాడు హైపర్ ఆది. ఇప్పటి వరకు ఎంతో మందిని జబర్ధస్త్‌కు పరిచయం చేశాడు. ఇప్పుడదే ఆదిపై విమర్శలకు కారణం అవుతుందట.

Recommended Video

ఇండస్ట్రీ లో ఆయనే నా 'గాడ్ ఫాదర్'!!
ఆ దెబ్బకు ప్లాన్ మార్చేసిన హైపర్ ఆది

ఆ దెబ్బకు ప్లాన్ మార్చేసిన హైపర్ ఆది


వచ్చే వారం ఎపిసోడ్‌‌కు సంబంధించిన ప్రోమోలో తనతో పాటు ఎంట్రీ ఇచ్చిన అమ్మాయిని చెల్లెమ్మ.. చెల్లెమ్మ అంటూ పలుమార్లు పిలిచాడు. దీనికి ఆమె ‘ఎందుకు అన్ని సార్లు చెల్లెమ్మ అంటున్నావ్' అని ప్రశ్నించింది. దీనికి ‘స్కిట్‌కు ఒక అమ్మాయిని తీసుకొచ్చి వైఫ్, లవర్ అంటున్నాడు. అందుకే ఇప్పుడు చెల్లి క్యారెక్టర్ ఇచ్చి క్లారిటీ ఇచ్చా' అని చెప్పుకొచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X