ఈ నా కొడుకులు మారరు.. హైపర్ ఆది వివాదాస్పద వ్యాఖ్యలు

By Lekhaka

జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన హైపర్ ఆది ఎలాంటి పంచ్ వేసినా, కామెంట్ చేసినా అది క్షణంలో వైరల్ అవుతుంది. కొన్నిసార్లు ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం అయితే చాలాసార్లు అతను వేసే పంచులు నవ్విస్తాయి. తాజాగా ఈ కమెడియన్ ఓ షోలో కొరియోగ్రాఫర్లపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ నా కొడుకులు మారరు అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఇంతకీ ఆది ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారు ? అసలు వివాదం ఏంటి ? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.

హైపర్ ఆది ప్రత్యేకంగా ఎవరినీ ఉద్దేశించి ఈ కామెంట్స్ చేయలేదు. ఓ బుల్లితెర షోలో భాగంగా కొరియోగ్రాఫర్ల టాలెంట్ పై తనదైన శైలిలో స్పందిస్తూ పంచ్ వేశారు. ఒకరకంగా అది పొగడ్త అనే చెప్పవచ్చు. కానీ కాస్త స్ట్రాంగ్ గా, నాటుగా ఉంది ఆ మెచ్చుకోలు. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న డాన్స్ రియాల్టీ షో ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 పేరుతో టెలికాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే.

Hyper Aadi objectional Comments on Choreographers in Dhee Show

చాలా కాలంగా టీవీలో ప్రసారమవుతున్న ఈ షో ఎంతోమంది కొరియోగ్రాఫర్లకు లైఫ్ ఇచ్చింది. ముఖ్యంగా శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, గణేష్ మాస్టర్ వంటి కొరియోగ్రాఫర్లు పాన్ ఇండియా స్థాయికి వెళ్లారంటే కారణం ఈ షోనే. ముందుగా ఈ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని, తమ టాలెంట్ ఏంటో ఈ స్టేజ్ పై ప్రూవ్ చేసుకున్నాకే వీళ్లకు స్టార్ హీరోల నుంచి అవకాశాలు వచ్చాయి.

అయితే ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న కొరియోగ్రాఫర్లపై హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ప్రసారమవుతున్న ఢీ కొత్త సీజన్ సెలబ్రిటీ స్పెషల్ 2లో శేఖర్ మాస్టర్ , హీరోయిన్ హన్సిక మోత్వాని జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇక హైపర్ ఆది, నందు యాంకర్లుగా చేస్తున్నారు. ఈ షోలో భాగంగా హైపర్ ఆది పంచులు ఎప్పటికప్పుడు హైలెట్ అవుతూనే ఉంటాయి.

Hyper Aadi objectional Comments on Choreographers in Dhee Show

తాజాగా దీనికి సంబంధించిన కొత్త ప్రోమో రిలీజ్ కాగా అందులో జాను వంటి పలువురు కంటెస్టెంట్స్ పర్ఫార్మ్ చేసినట్టుగా చూపించారు. వీళ్ళ అదిరిపోయే పర్ఫామెన్స్ కి శేఖర్ మాస్టర్, హన్సిక ఫిదా అయ్యారు. ఇది డాన్స్ షో అయినప్పటికీ మధ్యమధ్యలో హైపర్ ఆది పంచులు కూడా ప్రేక్షకులను అలరిస్తాయి. అలా ఎప్పటిలాగే ఈ ప్రోమో లో కూడా హైపర్ ఆది వేసిన పంచులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.

ఒక కంటెస్టెంట్ డాన్స్ చేసిన తర్వాత వాళ్ళ పర్ఫామెన్స్ తో పాటు ఆమె కొరియోగ్రాఫర్ ని కూడా మెచ్చుకున్నారు జడ్జెస్. ఆ తర్వాత ఆది ఇక నువ్వే చూసుకోవాలి అంటూ శేఖర్ మాస్టర్ కామెంట్ చేశారు. వెంటనే అందుకున్న హైపర్ ఆది అదలా ఉంచండి.. ఒకడేమో సెట్ల మీద సెట్లు వేస్తాడు,వంద మందిని తీసుకొచ్చి డ్యాన్స్ వేయిస్తాడు.. ఇంకొకడు ఇంకేదో చేస్తాడు... ఈ నా కొడుకులు ఇక మారరు అంటూ ఫన్నీగా పంచ్ వేశారు హైపర్ ఆది. ప్రస్తుతం ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 నుంచి రిలీజ్ అయిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X