హైపర్ ఆది లవ్ ఫెయిల్యూర్.. కామెడీ కింగ్ మనసులో ఇంత బాధా?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు హైపర్ ఆది (Hyper Aadi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పదునైన పంచులు, ప్రాసలతో కడుపుబ్బా నవ్వించే ఈ కమెడియన్, జబర్దస్త్ వేదికపై తనదైన శైలితో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. బుల్లితెర నుంచి వెండితెర వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆది వరుస టీవీ షోలు, సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. అయితే, తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన నవ్వుల వెనుక దాగి ఉన్న బాధలను బయటపెట్టారు. ముఖ్యంగా తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలు, లవ్ ఫెయిల్యూర్ గురించి భావోద్వేగంగా మాట్లాడారు. ఇంతకీ ఏమన్నారంటే?

హైపర్ ఆది కామెడీ కెరీర్‌కు జబర్దస్త్ షోనే మైలురాయి. అదిరే అభి టీమ్‌లో సభ్యుడిగా షోలోకి అడుగుపెట్టిన ఆది, తక్కువ సమయంలోనే తన టాలెంట్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. వేదికపై అతని ఎనర్జీ, డైలాగ్ డెలివరీ అతడిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈ క్రమంలోనే అతడు టీమ్ లీడర్‌గా ఎదిగాడు. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో జబర్దస్త్ షో నుంచి బయటకు రావాల్సి రావడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆది వెల్లడించారు. ఆ సమయంలో తనపై విమర్శలు, అవమానాలు ఎదురయ్యాయని, అయినా అవే తనను మరింత బలంగా మార్చాయని తెలిపారు.

Hyper Aadi Opens Up on Love Failure Career Struggles and Hidden Pain Behind His Comedy

సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, కేవలం టాలెంట్, కష్టంతో ఇండస్ట్రీలో స్థిరపడిన వ్యక్తి హైపర్ ఆది. జబర్దస్త్ ద్వారా వచ్చిన గుర్తింపుతో పాటు, సినిమాల్లోనూ కమెడియన్‌గా అవకాశాలు అందుకుంటూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లారు. టీవీ షోలో హైపర్ ఆది ఉన్నాడంటే చాలు, ప్రేక్షకులు నవ్వులు ఆపుకోలేరనే స్థాయికి చేరుకున్నారు. అయితే ఈ విజయాల వెనుక ఎన్నో బాధాకరమైన అనుభవాలు దాగి ఉన్నాయని ఆయన స్వయంగా ఒప్పుకున్నారు.

ఇటీవల యాంకర్ వర్ష హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'కిసిక్ టాక్' షోలో హైపర్ ఆది చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. షో ప్రారంభంలోనే యాంకర్ వర్ష 'మిమ్మల్ని ఆది అని పిలవాలా, కోట ఆదయ్య అని పిలవాలా?'అని ప్రశ్నించగా, ఆది నవ్వుతూ స్పందించారు. 'కోట ఆదయ్య నా అసలు పేరు. అది మా తాతయ్య పేరు. ఆ పూర్తి పేరుతో నన్ను పిలిచేది ఒక ఇంగ్లీష్ లెక్చరర్ మాత్రమే. బీటెక్ రోజుల్లో అందరి ముందే ఆదయ్య అని పిలిచేవారు' అంటూ సరదాగా గుర్తుచేసుకున్నారు.

లవ్ స్టోరీపై ప్రశ్న ఎదురవ్వగా, ఆది భావోద్వేగంగా.. 'ఇప్పటి జనరేషన్ ఎలా ఉందో తెలియదు కానీ, మా స్కూల్ డేస్‌లో అమ్మాయిని దూరంగా ఉండి చూడటం, ఆమె మనల్ని చూసిందా లేదా అని తెలుసుకోవడం కూడా ఓ ఫీలింగ్. ఆ రోజులు మళ్లీ తిరిగి రావు' అంటూ తన గతాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ మాటల్లోనే ఆయన లోపల దాగి ఉన్న బాధ బయటపడిందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

ఇక పెళ్లి విషయంపై ప్రశ్నించగా, ఆది కొంచెం భయంతోనే మాట్లాడారు. 'పెళ్లి అంటే బాధ్యతతో చేయాల్సిన విషయం. ఈ రోజుల్లో జరుగుతున్న విషయాలు చూస్తే మగవాళ్లు పెళ్లి చేసుకోవడానికే భయపడుతున్నారు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి కానీ వారి వ్యక్తిగత విషయాల్లోకి బయటవాళ్లు రావద్దని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. 'మీకు కూడా లవ్ ఫెయిల్యూర్ అయ్యిందని విన్నాం.. నిజమేనా?' అనే ప్రశ్నకు ఆది సూటిగా మాట్లాడుతూ.. 'అవును,నాది కూడా లవ్ ఫెయిల్యూర్. కానీ, లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాతనే నేను సక్సెస్ అయ్యాను. ఫెయిల్యూర్‌ను సక్సెస్‌గా మార్చుకున్నోడే అసలైన లవర్' అంటూ కొత్త నిర్వచనమే ఇచ్చారు.

పాలిటికల్ అంశాలపై కూడా ఆది తన అభిప్రాయాలను పంచుకున్నారు. కాలేజీ రోజుల్లోనే పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా మాట్లాడినందుకు బెదిరింపులు ఎదుర్కొన్నానని చెప్పారు. 'ఒకసారి పదిమంది సీనియర్లు నన్ను కాలేజీ బిల్డింగ్ పైకి తీసుకెళ్లి, ఇంకోసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే కిందకి తోసేస్తామని బెదిరించారు' అంటూ షాకింగ్ అనుభవాన్ని బయటపెట్టారు. రాజకీయాలంటే ట్రోలింగ్, కాంట్రవర్సీలు సహజమేనని, కానీ తాను అప్పుడే ఇవన్నీ ఎదుర్కొన్నానని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. 'నేను నమ్మిన నాయకుడు జనాల్లో ఒక్కడు కాదు.. లెక్కలేనంత మందికి అతడొక్కడు' అంటూ సెన్సెషనల్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇండస్ట్రీలోకి రాకముందే కాలేజీ రోజుల్లో ప్రేమలో పడ్డానని, ఆ సమయంలోనే బ్రేకప్ అయ్యిందని హైపర్ ఆది గతంలోనే వెల్లడించారు. ఆ లవ్ ఫెయిల్యూర్ తన జీవితాన్ని, కెరీర్‌ను పూర్తిగా మార్చేసిందని ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్నప్పటికీ, అవకాశం దొరికినప్పుడల్లా తన కుటుంబం, రాజకీయాలు, వ్యక్తిగత అనుభవాల గురించి ఓపెన్‌గా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. మొత్తానికి.. హైపర్ ఆది జీవితంలో నవ్వుల వెనుక ఎన్నో కన్నీళ్లు, పోరాటాలు దాగి ఉన్నాయనే విషయం ఈ ఇంటర్వ్యూతో మరోసారి స్పష్టమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X