రికార్డు తిరగరాసిన హైపర్ ఆది.. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని ఘనత సొంతం

By Manoj

రెండు తెలుగు రాష్ట్రాల్లో జబర్ధస్త్ కామెడీ షో ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. అలాంటి వారిలో కొందరు మాత్రమే భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అందులో హైపర్ ఆది ఒకడు. జబర్ధస్త్ షోలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే తన టాలెంట్‌ను నిరూపించుకున్న ఈ యంగ్ కమెడియన్.. వెంటనే టీమ్ లీడర్ అయ్యాడు. అప్పటి నుంచి హవా చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా అతడు ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని ఓ రికార్డును సొంతం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే...

హైపర్ ఆది టాలెంట్ తెలిసింది వాళ్ల వల్లే

హైపర్ ఆది టాలెంట్ తెలిసింది వాళ్ల వల్లే

యూట్యూబ్‌లో కామెడీ స్కిట్లు, సినిమా స్ఫూప్స్‌ చేస్తూ కాలం వెల్లదీస్తున్న ఆదిని.. ప్రముఖ కమెడియన్ అదిరే అభి జబర్ధస్త్ షోలోకి తీసుకొచ్చాడు. తన టీమ్‌లో చోటు కల్పించి ప్రాధాన్యమిచ్చాడు. ఆ తర్వాత అతడిలో రైటింగ్ టాలెంట్ ఉన్నట్లు గుర్తించిన దర్శకులు నితిన్, భరత్.. ఆదితో స్కిట్లు రాయించారు. ఆ తర్వాత అతడిని టీమ్ లీడర్ చేశారు. ఈ విషయాన్ని ఆదినే చెప్పాడు.

వన్‌ మ్యాన్ షో.. ఎవ్వరినీ, ఏదీ వదలడు

వన్‌ మ్యాన్ షో.. ఎవ్వరినీ, ఏదీ వదలడు

హైపర్ ఆది స్కిట్ అంటే పది నిమిషాలు కడుపుబ్బా నవ్వే విధంగా ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం ఉండదు. టీమ్‌లో చాలా మందే ఉన్నా.. అతడే గుక్క తిప్పుకోకుండా పంచ్‌లు వేస్తూ వన్ మ్యాన్ షో చూపిస్తాడు. అంతేకాదు, టీమ్ మెంబర్లు, జడ్జ్‌లు, యాంకర్లనూ వదిలి పెట్టకుండా పంచ్‌లు వేసేస్తాడు. అలాగే, ట్రెండింగ్‌లో ఉన్న అంశాలనూ వాడుకుంటాడు.

 అక్కడ కూడా కాలు పెట్టిన కమెడియన్

అక్కడ కూడా కాలు పెట్టిన కమెడియన్

టీవీ షోలతో బిజీ బిజీగా గడుపుతోన్న హైపర్ ఆది.. సినిమాల్లోకి సైతం ఎంటర్ అయ్యాడు. నాగ చైతన్య నటించిన ‘రారండోయ్ వేడుకు చూద్దాం'తో టాలీవుడ్‌లోకి ప్రవేశించిన ఆది.. ‘తొలిప్రేమ', ‘మిస్టర్ మజ్నూ', ‘వెంకీమామ', ‘ఆటగదరా శివ', ‘చిత్రలహరి', ‘సవ్యసాచి' సహా ఎన్నో సినిమాల్లో నటించాడు. అదే సమయంలో అల్లరి నరేష్ ‘మేడ మీద అబ్బాయి'కి మాటలు కూడా అందించాడు.

ఆ షో సక్సెస్ వెనుక కూడా హైపర్ ఆదినే

ఆ షో సక్సెస్ వెనుక కూడా హైపర్ ఆదినే

జబర్ధస్త్‌ షోలో సక్సెస్‌ఫుల్ టీమ్ లీడర్‌గా ఓ వెలుగు వెలుగుతోన్న హైపర్ ఆది... అదే చానెల్‌లో ప్రసారం అవుతోన్న బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ'కి కూడా పని చేస్తున్నాడు. ఈ షోలో యాంకర్ ప్రదీప్, సుధీర్, రష్మీ, వర్షిణి మధ్య వచ్చే కామెడీ డైలాగులు రాస్తున్నది అతడే. అలాగే, ఈ మధ్య అదే షోకు ఓ టీమ్ లీడర్‌గా ఎంటర్ అయ్యాడు హైపర్ ఆది.

యాంకర్‌తో రొమాన్స్.. ఆమెతో వివాహం

‘ఢీ' షోలోకి ఎంటర్ అయినప్పటి నుంచి హైపర్ ఆది... యాంకర్ వర్షిణితో ట్రాక్ నడుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఆమెతో రొమాన్స్ చేస్తుండడమే. షోలో భాగంగా వీళ్లిద్దరూ రెచ్చిపోయి రొమాన్స్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆది.. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడని ఓ న్యూస్ హల్‌చల్ చేస్తోంది.

Recommended Video

Dhanraj & Venu Tillu Hilarious Skit On Corona
 ఎవరికీ సాధ్యం కాని రికార్డు ఆది సొంతం

ఎవరికీ సాధ్యం కాని రికార్డు ఆది సొంతం


మూడు షోలు.. ఆరు సినిమాలులా సాగిపోతున్నాడు హైపర్ ఆది. ఈ క్రమంలోనే అతడి ఖాతాలో ఓ రికార్డు వచ్చి చేరింది. 2017 సంక్రాంతి సందర్భంగా ‘పందెం కోళ్లు' అనే ఈవెంట్‌లో ప్రసారం అయిన ఆది స్కిట్ ఇప్పటి వరకు 60 మిలియన్ వ్యూస్ సంపాదించింది. బుల్లితెర చరిత్రలో ఇప్పటి వరకు ఏ స్కిట్‌ కూడా ఈ స్థాయిలో వ్యూస్ రాబట్టలేదు. దీంతో ఆది రేంజ్ ట్రెండ్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X