twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోజా పాలిటిక్స్‌పై హైపర్ ఆది సెటైర్లు: ఊహించని పరిణామంతో షాకైన జబర్ధస్త్ జడ్జ్.!

    By Manoj
    |

    బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది సమయంలోనే ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు హైపర్ ఆది. జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా తెలుగు వాళ్లకు పరిచయమైన అతడు... అద్భుతమైన టాలెంట్‌తో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో అవకాశాలను అందుకుంటూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. పంచుల స్పెషలిస్టుగా పేరొందిన ఆది... తరచూ సమాజంలో జరుగుతున్న ఇష్యూలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎమ్మెల్యే రోజా పాలిటిక్స్‌పై అతడు సెటైర్లు వేశాడు. ఆ వివరాలు మీకోసం.!

    అదే ఆది ప్రత్యేకత.. అందుకే సూపర్ హిట్

    అదే ఆది ప్రత్యేకత.. అందుకే సూపర్ హిట్

    అదిరే అభి టీమ్‌లో సభ్యుడిగా జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు హైపర్ ఆది. ఆ తర్వాత అతడిలోని ప్రత్యేకమైన టాలెంట్‌ను గుర్తించిన షో నిర్వహకులు... అతడిని టీమ్ లీడర్‌గా చేశారు. అప్పటి నుంచి ఈ యంగ్ కమెడియన్ వెనుదిరిగి చూడలేదు. గుక్క తిప్పుకోకుండా పంచులు వేస్తూ దాదాపు ప్రతి స్కిట్టునూ ఒంటి చేత్తో నడుపుతుంటాడు. అదే ఆది సక్సెస్‌కు ప్రధాన కారణం.

     ఆది కోసం ఎదురు చూపులు.. రికార్డులు

    ఆది కోసం ఎదురు చూపులు.. రికార్డులు

    బుల్లితెరపై జబర్ధస్త్ షోకు భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. దానికి మించి హైపర్ ఆది స్కిట్లకు స్పందన వస్తోంది. గురువారం అయిందంటే చాలు అతడి పెర్ఫార్మెన్స్ కోసం చాలా మంది వేచి చూస్తుంటారు. అలాగే, నెటిజన్లు కూడా ఆది స్కిట్లను ఉత్సాహంతో తిలకిస్తుంటారు. అందుకే హైపర్ ఆది స్కిట్లు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.

    ఇక్కడ సూపర్ హిట్.. అందుకే అక్కడకు

    ఇక్కడ సూపర్ హిట్.. అందుకే అక్కడకు

    హైపర్ ఆది బుల్లితెరపై వరుస షోలు, ఈవెంట్లతో దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఈ క్రమంలోనే మరిన్ని అవకాశాలు అందుకుంటున్నాడు. అదే సమయంలో సినిమాల్లోనూ ఎంట్రీ ఇవ్వడంతో పాటు అక్కడా రాణిస్తున్నాడీ టాలెంటెడ్‌ యంగ్‌స్టర్. ఇప్పటికే యాక్టర్‌గా ఎన్నో సినిమాల్లో మంచి పాత్రలు పోషించాడు. అలాగే, అల్లరి నరేష్ చిత్రం ‘మేడ మీద అబ్బాయికి' రైటర్‌గానూ వర్క్ చేశాడు.

     యాంకర్‌తో లవ్ ట్రాక్..... ఆది పెళ్లి ఫిక్స్

    యాంకర్‌తో లవ్ ట్రాక్..... ఆది పెళ్లి ఫిక్స్

    వరుస షోలు.. సినిమాలు.. ఈవెంట్లతో బిజీ బిజీగా గడుపుతోన్న హైపర్ ఆది.. పర్సనల్‌గానూ తరచూ హైలైట్ అవుతున్నాడు. దీనికి కారణం ‘ఢీ' అనే డ్యాన్స్ షోలో యాంకర్ వర్షిణితో అతడు లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు చూపించడమే. అలాగే, తరచూ రొమాంటిక్ డ్యాన్స్‌లు చేయడం కారణంగానూ ఈ ప్రచారం ఆగడం లేదు. దీంతో వీళ్లిద్దరికీ పెళ్లి జరుగుతుందన్న టాక్ కూడా వినిపిస్తోంది.

    జడ్జ్ రోజా పాలిటిక్స్‌పై హైపర్ ఆది సెటైర్లు

    జడ్జ్ రోజా పాలిటిక్స్‌పై హైపర్ ఆది సెటైర్లు

    సాధారణంగా హైపర్ ఆది స్కిట్ అంటే కంటెంట్ కంటే కామెడీనే ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా అతడు సమాజంలో జరిగే ప్రధానమైన ఇష్యూలపై ఎక్కువ ఫోకస్ చేస్తుంటాడు. అంతేకాదు, టీమ్ లీడర్లు, యాంకర్లు, జడ్జ్‌లపైనా తన పంచుల వర్షం కురిపిస్తుంటాడు. ఈ క్రమంలోనే జబర్ధస్త్ జడ్జ్ రోజా పాలిటిక్స్‌పై హైపర్ ఆది సెటైర్లు వేసి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు.

    ఊహించని పరిణామంతో షాకైన రోజా..!

    ఊహించని పరిణామంతో షాకైన రోజా..!

    ఈ వారం స్కిట్‌లో భాగంగా హైపర్ ఆది ‘ప్రేమించుకుందా రా' కథతో స్కిట్ చేశాడు. ఇందులో భాగంగానే ఎంట్రీలో అతడు సైకిల్ మీద వచ్చాడు. ఆ సమయంలో ‘రోజా గారికి ఏసీలు పెంచి కొంచెం కూల్ చేయండమ్మా... ఎందుకంటే ఆమె సైకిల్ చూడగానే ఫైర్ అవుద్ది' అంటూ సెటైర్ వేశాడు. ఈ పరిణామంతో షాకైపోయిన రోజా ఏం చేయాలో అర్థం కాక నవ్వలేక నవ్వేసింది.

     రోజాపై పంచ్‌ వేయడానికి కారణం ఇదే

    రోజాపై పంచ్‌ వేయడానికి కారణం ఇదే

    ప్రస్తుతం రోజా ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ తరపున ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గతంలో ఆమె సైకిల్ గుర్తు ఉన్న పార్టీలో పని చేశారు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో ఆ పార్టీని వీడారు. అప్పటి నుంచి ఆ పార్టీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే హైపర్ ఆది ఆమెపై సెటైర్ వేశాడన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

    English summary
    Jabardasth with tagline Katharnak Comedy Show is Telugu-language television channel comedy television series, broadcasts on the ETV Network channel which is shot at Annapoorna Studios, Telangana, India. The show is produced by Mallemala Entertainments and Directed by Nitin and Bharath.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X