రోజా పాలిటిక్స్‌పై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్: ఎన్నికల్లో గెలిచినా నో యూజ్ అనడంతో..

తెలుగు బుల్లితెర చరిత్రలోనే అసలైన కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. దాదాపు ఎనిమిదేళ్లుగా తన హవాను చూపిస్తున్న ఈ షో.. ఎంతో మంది ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఇలా ఈ షో ద్వారా వెలుగులోకి వచ్చిన వారిలో హైపర్ ఆది ఒకడు. స్క్రిప్ట్ రైటర్‌గా జబర్ధస్త్‌లోకి వచ్చిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే తనలోని టాలెంట్‌ను నిరూపించుకుని టీమ్ లీడర్ అయిపోయాడు. ఈ క్రమంలోనే పంచులతో విరుచుకుపడుతూ టాప్ కమెడియన్‌గా పేరొందాడు. ఈ నేపథ్యంలో తాజాగా రోజా పాలిటిక్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు ఆది. ఆ వివరాలు మీకోసం!

ఆది స్కిట్ల కోసమే వేచి చూసే పరిస్థితి

ఆది స్కిట్ల కోసమే వేచి చూసే పరిస్థితి

చాలా కాలంగా జబర్ధస్త్ షోకు తెలుగు ప్రేక్షకుల నుంచి ఎంతో ఆదరణ లభిస్తోంది. గతంలో ఉన్న దాని కంటే హైపర్ ఆది టీమ్ లీడర్ అయిన తర్వాత దీనికి రెస్పాన్స్ మరింత ఎక్కువైందని చెప్పొచ్చు. కేవలం అతడి స్కిట్ల కోసమే షోను చూసే వారు వేల మందే ఉన్నారు. దీనికి కారణం గుక్క తిప్పుకోకుండా పంచులు వేయగలగడమే. అందుకే అతడికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

రికార్డుల మీద రికార్డులు.. ట్రెండింగ్‌లో

రికార్డుల మీద రికార్డులు.. ట్రెండింగ్‌లో

జబర్ధస్త్ స్కిట్లకు యూట్యూబ్‌లో మంచి స్పందన వస్తోంది. హైపర్ ఆది టీమ్ లీడర్ అయిన తర్వాత అతడి స్కిట్లే ప్రతి వారం నెంబర్ వన్ స్థానంలో ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా అతడి స్కిట్లకు మిలియన్‌కు పైగా వ్యూస్ వస్తుంటాయి. ఈ క్రమంలోనే ప్రతి వారం అతడు ట్రెండింగ్‌లో ఉంటున్నాడు. ఇలా ఎన్నో స్కిట్ల ద్వారా పలు రికార్డులను క్రియేట్ చేశాడీ జబర్ధస్త్ కమెడియన్.

ఎవరినీ వదలి పెట్టని జబర్ధస్త్ సెన్సేషన్

ఎవరినీ వదలి పెట్టని జబర్ధస్త్ సెన్సేషన్

హైపర్ ఆది తన స్కిట్లలో ఎక్కువ శాతం ట్రెండింగ్ అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాడు. అలాగే, అద్భుతమైన టైమింగ్‌తో తన టీమ్ మెంబర్లపై పంచుల వర్షం కురిపిస్తుంటాడు. ఈ క్రమంలోనే జడ్జ్‌లు, యాంకర్లను కూడా వదలిపెట్టడు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో జబర్ధస్త్ జడ్జ్ రోజా పాలిటిక్స్‌ను ప్రస్తావిస్తూ అదిరిపోయే పంచ్ పేల్చాడు.

హైపర్ ఆదికి నమస్కారం పెట్టిన రోజా

హైపర్ ఆదికి నమస్కారం పెట్టిన రోజా

తాజాగా విడుదల చేసిన వచ్చే వారం ఎపిసోడ్ ప్రోమోలో... చినుకు చినుకు అందెలతో అనే పాటతో అదిరే అభి, చలాకీ చంటి, వెంకీ, తాగుబోతు రమేష్‌లతో కలిసి ఎంట్రీ ఇచ్చాడు హైపర్ ఆది. పాట పూర్తయిన వెంటనే జడ్జ్‌లు రోజా, మను వాళ్లందరికీ నమస్కారం చేశారు. అప్పుడే అభి ఎందుకిలా చేశారనగా.. చిన్న పిల్లలం కదా దేవుళ్లతో సమానం అని దండం పెట్టారు అని ఆది బదులిచ్చాడు.

రోజా, అనసూయ ముసలోల్లు అంటూ

రోజా, మను నమస్కారం చేసిన వెంటనే హైపర్ ఆది కూడా ప్రతి నమస్కారం చేశాడు. దీంతో పక్కనే ఉన్న అభీ.. ‘నువ్వేంట్రా వాళ్లకు నమస్కారం పెడుతున్నావు' అని ప్రశ్నించాడు. దీనికి ‘పిల్లలే కాదు.. ముసలోల్లు కూడా దేవుళ్లతో సమానం కదరా అందుకే పెడుతున్నా' అని పంచ్ పేల్చాడు. దీంతో రోజా చంపేస్తా అంటూ జబర్ధస్త్ కమెడియన్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

Recommended Video

Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
 రోజా పాలిటిక్స్‌పై ఆది షాకింగ్ కామెంట్స్

రోజా పాలిటిక్స్‌పై ఆది షాకింగ్ కామెంట్స్

రోజాకు పంచ్ వేసిన వెంటనే హైపర్ ఆది స్పందిస్తూ... ‘అరేయ్.. అనసూయకు కూడా నమస్కారం చేయండి రా' అంటాడు. దీనికి కూడా అభి మాట్లాడుతూ ‘ఆవిడకెందుకురా' అని అడుగుతాడు. దీంతో ‘ఆమెను అని ఈమెను అనకపోతే ఆవిడ ఫీల్ అవుతారు కదా' అంటూ కవర్ చేశాడు. దీనికి రోజా నవ్వగానే.. ‘ఎన్నికల్లో గెలిచినప్పుడు కూడా ఇలా నవ్వుండరు' అంటూ పంచ్ పేల్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X