అవినాష్‌ను అంత మాటనేసిన హైపర్ ఆది: సమంత ముందు అలా చెప్పడంపై విమర్శలు!
తెలుగు బుల్లితెరపై తిరుగులేని కమెడియన్‌గా వెలుగొందుతోన్నాడు హైపర్ ఆది. జబర్ధస్త్ అనే షో ద్వారా తన టాలెంట్‌ను నిరూపించుకున్న ఈ కుర్రాడు.. చాలా తక్కువ సమయంలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. తద్వారా ఎక్కువ డిమాండ్ ఉన్న కమెడియన్‌గా ఎదిగిపోయాడు. దీంతో బిగ్ బాస్ షోలోనూ అతడు ఎంట్రీ ఇచ్చాడు. ఏకంగా సమంతతో కలిసి అరగంట పాటు గేమ్ ఆడాడు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ అవినాష్‌పై ఆది చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇంతకీ ఆది ఏమన్నాడు.? పూర్తి వివరాలు మీకోసం.!

నెంబర్ వన్ టీమ్ లీడర్‌గా ఆది
జబర్ధస్త్‌లో అదిరే అభి టీమ్ సభ్యుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు హైపర్ ఆది. ఆ తర్వాత తనలోని టాలెంట్‌ను నిరూపించుకుని ఏకంగా టీమ్ లీడర్ అయిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఆది.. ఆ షోలోనే నెంబర్ వన్ ఆర్టిస్టుగా వెలుగొందుతున్నాడు. మరీ ముఖ్యంగా గుక్క తిప్పుకోకుండా పంచులు వేస్తూ ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు.

హైపర్ ఆది... రికార్డుల రారాజు
కేవలం హైపర్ ఆది స్కిట్ల కోసమే జబర్ధస్త్‌ను చూసే వాళ్లు కూడా ఉన్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు. చాలా సునాయాసంగా ఎదుటి వారిపై పంచులు పేలుస్తూ సక్సెస్ అవుతుంటాడు. దాదాపు పది నిమిషాల స్కిట్లో అతడి డైలాగ్సే ఎక్కువగా ఉంటాయి. అందుకే హైపర్ ఆది స్కిట్లకు విపరీతమైన స్పందన వస్తోంది. ఫలితంగా అతడి పేరిట ఎన్నో రికార్డులు క్రియేట్ అయ్యాయి.

ఎవరినీ వదలని జబర్ధస్త్ హీరో
హైపర్ ఆది ఒక్కసారి స్టేజ్ ఎక్కాడంటే డైలాగులతో దండయాత్ర చేస్తుంటాడు. ఇందులో భాగంగానే సమాజంలో జరుగుతోన్న హాట్ టాపిక్స్‌ను ప్రధానంగా తీసుకుని స్కిట్లు రాసుకుంటుంటాడు. ఈ క్రమంలోనే బయటి సెలెబ్రిటీలతో పాటు జబర్ధస్త్ ఆర్టిస్టులు, జడ్జ్‌లు ఇలా ఎవరినీ వదలకుండా పంచులు వేస్తుంటాడు. దీని వల్ల కొన్నిసార్లు వివాదాల్లోనూ చిక్కుకున్నాడీ స్టార్ కమెడియన్.

అవినాష్ జబర్ధస్త్ ఎంట్రీపై పంచ్
స్కిట్‌లో భాగంగా వంట మాస్టర్ అయిన ఆదితో భార్య గెటప్ వేసిన శాంతి స్వరూప్ ‘ఎంత కాలమని ఇలా గరిటే పట్టుకుని వంటలు చేసుకుంటాం. కనీసం ఈఎంఐలో ఒక ఇల్లు తీసుకోవచ్చుగా' అని అంటాడు. దీనికి ‘వాటి గురించి మాట్లాడకు. ఇలా హౌస్‌లకు ఈఎంఐలు కట్టలేకే మనోడు ఒకడు వేరే హౌస్‌కు వెళుతున్నాడు తెలుసుగా' అంటూ పరోక్షంగా అవినాష్‌పై సెటైర్ వేశాడు ఆది.

బిగ్ బాస్‌లోకి హైపర్ ఆది ఎంట్రీ
గత ఆదివారం జరిగిన బిగ్ బాస్ దసరా స్పెషల్ ఎపిసోడ్‌కు హైపర్ ఆది ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. నాగార్జున గైర్హాజరులో స్టార్ హీరోయిన్ సమంత ఈ ఎపిసోడ్‌ను హోస్ట్ చేసింది. దీనికి డిటెక్టివ్ గెటప్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆది.. హౌస్‌లోని అందరు కంటెస్టెంట్ల మనసులోని మాటలను బయటకు చెప్పాడు. అలాగే, పాయల్ రాజ్‌పుత్‌తోనూ కాసేపు సరదా సంభాషణ చేశాడు.

అలా చెప్పడంపై విమర్శలు.!
గతంలో ముక్కు అవినాష్ బిగ్ బాస్ ఎంట్రీపై సెటైర్లు వేసిన హైపర్ ఆది... ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో మాత్రం సమంత ముందు దానికి భిన్నంగా మాట్లాడాడు. అవినాష్ జబర్ధస్త్ నుంచి బిగ్ బాస్‌లోకి వెళ్లడం తామందరికీ గర్వంగా ఉందని చెప్పాడు. అప్పుడేమో సెటైర్ వేసి, ఇప్పుడు సమంత ముందరేమో పొగడడంపై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తూ విమర్శిస్తున్నారు.


Click it and Unblock the Notifications











