twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హైపర్ ఆదిపై రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్స్ ఫైర్.. సెటైర్లు వేస్తూ జబర్దస్తీ చేయడంతో!

    |

    టెలివిజన్ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయానికి తెరలేపిన షో జబర్దస్త్. దీనికి కాంపిటేషన్‌గా ఎన్ని షోలు వచ్చినా ఈ మాట మాత్రం వాస్తవం అనేది జనం మాట. నవ్వులే ఈ షోలో స్పెషల్ అట్రాక్షన్. ఇలా అందరినీ నవ్వించడానికి వేసే స్కిట్స్, అందులో పార్టిసిపెంట్స్ వేసే పంచులు అన్నీ హైలైటే. అందుకే గత కొన్నేళ్లుగా బుల్లితెరపై నవ్వుల హరివిల్లులు కురిపిస్తూ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది జబర్దస్త్ షో. అయితే కొన్ని సందర్భాల్లో జబర్దస్త్ స్కిట్స్‌పై ట్రోల్స్ కూడా వస్తుంటాయి.

    హైపర్ ఆది పర్‌ఫార్‌మెన్స్.. నెటిజన్స్ ఫైర్

    హైపర్ ఆది పర్‌ఫార్‌మెన్స్.. నెటిజన్స్ ఫైర్

    జబర్దస్త్ షోలో హైపర్ ఆది పర్‌ఫార్‌మెన్స్ అంటే పడి చస్తుంటారు బుల్లితెర ప్రేక్షకులు. ఆయన వేసే పంచ్ డైలాగ్స్ బాగా పేలుతుంటాయి. అయితే ఇటీవల జరిగిన ఓ షోలో హైపర్ ఆది వేసిన ఓ స్కిట్ చూసి కొందరు నెటిజన్లు ఆయనపై ఫైర్ అవుతున్నారు.

    రామ్ గోపాల్ వర్మను ఎద్దేవా చేస్తూ..

    రామ్ గోపాల్ వర్మను ఎద్దేవా చేస్తూ..

    హైపర్ ఆది మాటల తూటాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే జబర్దస్త్ స్కిట్ల ద్వారా పలు సందర్భాల్లో వివాదాల్లో నిలిచాడు ఈ కమెడియన్. ఇదే బాటలో మరోసారి ఈయన వేసిన స్కిట్ సంచలనాలకు దారితీసింది. ఇటీవల జరిగిన ఓ జబర్దస్త్ ఎపిసోడ్‌లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఎద్దేవా చేస్తున్నట్లు స్కిట్ వేసి నెటిజన్ల ఆగ్రహానికి లోనయ్యాడు హైపర్ ఆది.

    ఆర్జీవీ క్యారెక్టర్‌పై సెటైర్లు

    ఆర్జీవీ క్యారెక్టర్‌పై సెటైర్లు

    అప్పట్లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన 'పెళ్లి సందడి' సినిమా ఆధారంగా ఓ స్కిట్ చేశాడు హైపర్ ఆది. ఈ స్కిట్‌లో రాఘవేంద్రరావు క్యారెక్టర్‌తో పాటు, రామ్ గోపాల్ వర్మ క్యారెక్టర్‌ను చేశారు. ఇందులో ఆర్జీవీ క్యారెక్టర్‌పై సెటైర్లు వేస్తూ నవ్వు తెప్పించాడు హైపర్ ఆది. ఈ మేరకు కొన్ని వివాదాస్పద కామెంట్లు కూడా చేశాడు. దీంతో ఈ స్కిట్ చూసి తీవ్రంగా నొచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ అభిమానులు హైపర్ ఆదిపై విరుచుకుపడుతున్నారు.

    హాట్ టాపిక్.. ఇరువురి అభిమానులు

    హాట్ టాపిక్.. ఇరువురి అభిమానులు

    ఓ చిన్న కమెడియన్ అయిన నీవు.. సీనియర్ డైరెక్టర్లపై సైటర్లు వేయడమేంటి? అంటూ వర్మ అభిమానులు హెచ్చరిస్తున్నారు. ఇంకొందరైతే ఆదికి గట్టి వార్నింగ్ కూడా ఇస్తున్నారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అంశం హాట్ టాపిక్ అవుతోంది. మరోవైపు హైపర్ ఆది అభిమానులు మాత్రం ఆయన స్కిట్‌ని సమర్థిస్తున్నారు.

    నాగబాబు వెళ్ళాక..

    ఇక ఇటీవలే జబర్దస్త్ షో నుంచి మెగా బ్రదర్ నాగబాబు తప్పుకున్న సంగతి తెలిసిందే. ఎప్పుడైతే ఆయన ఈ షో నుంచి తప్పుకున్నారో అప్పటినుంచి జబర్దస్త్ అంశాలు చర్చనీయాంశంగా మారుతుండటం గమనించవచ్చు.

    English summary
    Recently Jabardasth judge Nagababu left from this show. Now Hyper Aadi commented Ram Gopal Varma on his skit. This issue is hot topic in social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X