Just In
- 8 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 8 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 9 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 9 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- Lifestyle
గురువారం దినఫలాలు : డబ్బు విషయంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు...!
- News
మెజార్టీ ఉంటే ప్రజలను చంపాలని కాదు.. మోదీపై దీదీ గుస్సా..
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నాగబాబుపై హైపర్ ఆది పంచ్.. పగలబడి నవ్విన రోజా
జబర్దస్త్ వ్యవహారం సోషల్ మీడియాలో నానాటికి రచ్చగా మారుతోంది. నాగబాబు అందులోంచి బయటకు రావడం, మల్లెమాలపై ఆరోపణలు చేయడం అప్పట్లో ఎంత సంచలనం రేపాయో అందరికీ తెలిసిందే. బయటకు వచ్చిన నాగబాబు.. వేరే చానెల్‌లో కొత్త షోను ప్రారంభించాడు. నితిన్ భరత్‌లతో కలిసి అదిరింది, లోకల్ గ్యాంగ్స్ అంటూ ఓ రెండు షోలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రెండు వేర్వేరు కుంపట్లు అయినా.. జబర్దస్త్ స్కిట్స్‌లో మాత్రం నాగబాబును వదలడం లేదు.

రెండూ పోటాపోటీగా..
జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చిన నాగబాబు.. కొత్త షోలను ప్రారంభిస్తే వాటికి పోటీగా అయిపోయిన షోలను మళ్లీ వేయడం వంటివి చేసింది మల్లెమాల. దీంతో ఫైర్ అయిన నాగబాబు.. జబర్దస్త్‌కు పోటాగా షోను నడపాలను కోవడం లేదని కానీ వారు మాత్రం మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డాడు.

జబర్దస్త్‌పై పంచులు..
అదిరింది షోలోనూ జబర్దస్త్‌పై పంచ్‌లు వేస్తుంటారు. షో ఆరంభంలోనైతే వీటి తాకిడి మరీ ఎక్కువగా ఉండేది. వారి స్కిట్స్‌లో జబర్దస్త్ షోను ఎక్కువ టార్గెట్ చేసేవారు. అయితే రాను రాను వారి షోపైనా శ్రద్ద పెట్టినట్టు కనిపిస్తోంది. హైపర్ ఆది మాత్రం సమయం దొరికినప్పుడల్లా.. నాగబాబు, అదిరింది షోపై పంచ్‌లు వేస్తూనే ఉంటాడు.

గతంలోనూ టార్గెట్..
హైపర్ ఆది తన స్కిట్స్‌లో పంచులను ఎలా ప్రవహింపజేస్తాడో అందరికీ తెలిసిందే. జబర్దస్త్‌ను, అదిరింది షోలను చేయడంపై అనసూయను, ఎప్పుడు ఎవరుంటారో ఎవరు పోతారో తెలియడం లేదంటూ పరోక్ష పంచ్‌లు ఇలా వేస్తూనే వస్తున్నాడు. తాజాగా మరో పంచ్ వేశాడు.

కుదిరింది షో..
గురువారం ప్రసారమైన జబర్దస్త్‌లో హైపర్ ఆది వేసిన స్కిట్‌లో పంచ్‌ల వర్షం కురిసింది. ఆ స్కిట్‌లో భాగంగా ఓ దొంగ వచ్చి.. నగల్ని, చీరల్ని, వీళ్లని తీసుకెళ్తా అని డైలాగ్ చెబుతాడు. వెంటనే ఆది అందుకుని.. ‘ఆ తీసుకెళ్లురా. మమ్మల్ని, యాంకర్లను, జడ్జిలను తీసుకెళ్లి.. నువ్వు కూడా 'కుదిరింది'అని ఒక షో పెట్టుకో' అని అందరికీ అర్థమయ్యేట్టుగానే కౌంటర్ వేశాడు.హైపర్ ఆది వేసిన ఆ పంచ్‌తో రోజా పగలబడి నవ్వుతూ పక్కనే ఉన్న మనోతో ఏదో గుసగుసలు పెట్టింది.