ఆ మాట వింటేనే ప్యాంట్ తడుస్తున్నది.. రోజాను కూడా వదలకుండా.. హైపర్ ఆది సెటైర్లు

బుల్లితెరపై ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్న జబర్దస్త్ షో మళ్లీ తన అభిమానులను ఆకట్టుకొనేందుకు సిద్ధమైంది. లాక్‌డౌన్ తర్వాత సరికొత్తగా పదునైన పంచులతో ప్రేక్షకులకు వినోద అభిరుచులను పంచేందుకు హైపర్ ఆది, అదిరే అభి లాంటి కమెడియన్లు తమ కామెడికి పదును పెట్టారు. తాజాగా రిలీజ్ చేసిన ఎపిసోడ్‌లో ఆది పంచులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. తాజా ప్రోమో గురించిన వివరాల్లోకి వెళితే..

ఖతర్నాక్ కామెడీ షో మళ్లీ

ఖతర్నాక్ కామెడీ షో మళ్లీ


ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్‌కు హైపర్ అది బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. అన్ని టీమ్‌లో ఆది బ‌ృందానిదే స్టేజి మీద ఆదిపత్యం అనేది అందరికి తెలిసిందే. హైపర్ ఆది వేసే పంచులు బుల్లెట్లలా పేలడం కామెడీ షోకే హైలెట్ అనే అభిప్రాయం బుల్లితెర ప్రేక్షకుల్లో ఉంది.

భైరవద్వీపం పాటతో ఎంట్రీ

భైరవద్వీపం పాటతో ఎంట్రీ

ప్రతి ఎపిసోడ్‌లో అనుసరించే పేరడీ పాటను కొనసాగిస్తూ హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చారు. తాజాగా భైవరద్వీపంలోని పాటకు నందమూరి బాలకృష్ణ మాదిరి గెటప్‌తో ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకొన్నారు. రావడం రావడమే ఖతర్నాక్ పంచులతో మోత మోగించారు. నా డైలాగ్స్ అయ్యేంత వరకు నా టీమ్ పిల్లలే కాదు.. పులి పిల్లలు కూడా సైలెంట్‌గా ఉండాలి అంటూ పంచ్ పేల్చాడు.

స్వయంవరం ఎపిసోడ్‌లో

స్వయంవరం ఎపిసోడ్‌లో

స్కిట్‌లో భాగంగా స్వయంవరం ఎపిసోడ్‌లో పంచులకు పనిచెప్పాడు. నిన్ను యువరాణి అంటే నేను అలాంటి పని చేసుకోవాల్సిందే. ఇదే డ్యాన్సు అని తోటి కంటెస్టెంట్ ప్రశ్నిస్తే.. లాక్‌డౌన్ తర్వాత మందు షాపుల ఓపెన్ చేసిన తర్వాత చేసింది ఇదే అంటూ చమత్కరించారు. ఇలా ఆది మార్కు పంచులతో సరదాగా స్కిట్ గడిచిపోయినట్టు కనిపించింది.

పాజిటివ్ అంటే ప్యాంటు తడవడటమే..

పాజిటివ్ అంటే ప్యాంటు తడవడటమే..


అదే స్కిట్‌లో వరుసగా పంచులు విసురుతున్న ఆదిని.. ఏంటి ఇలా నెగిటివ్ సెన్స్? నాకు అసలే నచ్చదు అంటూ కంటెస్టెంట్ చిరాకుపడగా.. నాకు ఈ సీజన్‌లో నెగిటివ్ అంటేనే ఇష్టం కలుగుతుంది. పాజిటివ్ అంటే ప్యాంట్ తడిచిపోతుందంటూ కరోనావైరస్‌ను గుర్తు చేసే ప్రయత్నం చేశాడు. భైరవద్వీపం ఎపిసోడ్‌లో ఆది చెలరేగిపోయాడనే చెప్పవచ్చు.

Recommended Video

Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
రోజాపై కూడా సెటైర్లు

రోజాపై కూడా సెటైర్లు

తాజా ఎపిసోడ్‌లో తన టీమ్ అందరిపై భారీగా పంచులు పేల్చాడు. అంతేకాకుండా జడ్జీలు రోజా, మనోను కూడా వదలకుండా సెటైర్లు వేశాడు. ఇక ప్రోమోలో అనసూయ, సుడిగాలి సుధీర్‌ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఇక ఫుల్ ఎపిసోడ్‌లో హైపర్ ఆది వీరంగం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే అనే మాట ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X