హైపర్ ఆది పెళ్లి.. అంతా సందడి సందడిగా.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో

బుల్లితెరపై బుల్లెట్ లాంటి పంచ్‌ల వర్షాన్ని కురిపించిన హైపర్ ఆది.. వెండితెరపైనా నవ్వులు పూయించాడు. బుల్లితెర నుంచి వెండితెరకు పయనమై అక్కడా పంచ్‌లు, ప్రాసలతో ప్రేక్షకులను నవ్వించాడు. అయితే వెండితెరపై ఎంతగా నవ్వించినా అది జబర్దస్త్ స్కిట్‌తో సరితూగదు. బుల్లితెర, జబర్దస్త్ వేదికపై హైపర్ ఆది వేసే పంచ్‌లకు ప్రతీ ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. అది జబర్దస్త్ అయినా, ఢీ అయినా సరే హైపర్ ఆది ఎంటరైతే వేరే లెవెల్‌లో ఉంటుంది.

అక్కడా, ఇక్కడా..

అక్కడా, ఇక్కడా..

హైపర్ ఆది ప్రస్తుతం జబర్దస్త్, ఢీ షోలో దుమ్ముదులుపుతున్నాడు. వచ్చీ రానీ మూమెంట్లను వేసి అందర్నీ నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తుంటాడు. జబర్దస్త్‌లో వేసినట్టుగానే ఢీలోనూ పంచ్‌లు వేస్తుంటాడు. అయితే ఢీలో మాత్రం రొమాంటిక్ యాంగిల్‌ను బాగానే వాడేస్తున్నాడు.

వర్షిణితో వ్యవహారం..

వర్షిణితో వ్యవహారం..

ఢీ షోలో హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చాక మొత్తం మారిపోయాడు. వర్షిణితో రాసుకుని పూసుకుని తెరపై బాగానే తిరుగుతూ అందర్నీ ఎంటర్టైన్ చేశాడు. ఇక వీరిద్దరి మధ్య ఏదో ఉందని కుప్పలు తెప్పలుగా వార్తలు వచ్చాయి. వీరి రొమాన్స్‌ ఓ రేంజ్‌లో క్లిక్ అయ్యింది. అందుకే వీరిద్దరి పెళ్లి అంటూ వార్తలు ఆ మధ్య తెగ హల్చల్ చేశాయి.

తాజాగా వావ్ షోలో..

తాజాగా వావ్ షోలో..

సాయి కుమార్ హోస్ట్‌గా నిర్వహించే వావ్ మూడో సీజన్ షో ప్రారంభమైంది. మొదటి ఎపిసోడ్‌లో మనో, అనసూయ, సుమ వంటి వారు సందడిచేశారు. ఇక రెండో ఎపిసోడ్ కోసం హైపర్ ఆది, రోహిణి, హిమజ, అభి వచ్చారు. ఇక వీరంతా చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈ షోకు పిలిచి ఇద్దరినిచ్చి పెళ్లి చేశారని హైపర్ ఆది కామెంట్ చేయడం వైరల్ అవుతోంది.

రోహిణి, హిమజతో సందడి..

రోహిణి, హిమజతో సందడి..

షోలో భాగంగా హైపర్ ఆది అందరిపై పంచ్‌లు వేశాడు. రోహిణి, హిమజలను ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. అమ్మాయిని కూడా ఇస్తే తలంబ్రాలు పోసుకుని పెళ్లి చేసుకుని వెళ్లిపోతా అని హైపర్ ఆది అనగానే.. హిమజ, రోహిణి ఇద్దరూ వచ్చారు. హైపర్ ఆదిని అటు ఇటు లాగుతూ నాకంటే నాకు అని చేతులను పట్టుకున్నారు.

Recommended Video

Bigg Boss Telugu Management Gives Clarity Over Host & Show Details
గిఫ్ట్‌గా అగర్ బత్తి..

గిఫ్ట్‌గా అగర్ బత్తి..

ఇక హైపర్ ఆది సరసాలు చూసిన సాయి కుమార్.. ఏమయ్యా మీ ఇంట్లో వాళ్లు మంచిగా పెళ్లి చేద్దామని చూస్తుంటే నువ్వేంటయ్యా ఇలా చేస్తున్నావ్ అని అనడంతో.. ఏదో తొందరపాటు అని ఆది సెటైర్ వేశాడు. పెళ్లైన తరువాత అలా ఇష్టమొచ్చినట్టు తిరుగుతారా? నన్ను అడగాలి కదా అని వారిద్దరిని ప్రశ్నించడంతో.. నువ్ ఇద్దరినీ చేసుకున్నవ్.. మరీ మాకు ఇంకోకరు కావాలి అంటూ రోహిణి పంచ్ వేయడంతో అంతా షాక్ అయ్యారు. సాయి కుమార్ గారికి థ్యాంక్స్ పెళ్లి చేయడంతో పాటు అగర్ బత్తి కూడా ఇచ్చాడని చివర్లో ఇచ్చే గిఫ్ట్ హ్యాంపర్‌లనుద్దేశించి హైపర్ ఆది పంచ్ వేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X