For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనసూయను ఎంత ప్రయత్నించినా వర్కౌట్ కాలేదట.. మళ్లీ వాడేసిన హైపర్ ఆది

    |

    జబర్దస్త్ షోలో హైపర్ ఆది అనసూయతో ఆడే సరసాలు, వేసే పంచులు ఏ రేంజ్‌లో ఉంటాయో అందరికీ తెలిసిందే. హైపర్ ఆది కావాలనే తన స్క్రిప్ట్‌లో పంచులు రాస్తాడో.. స్కిట్స్‌లో అనసూయను ఇన్వాల్వ్ చేస్తాడో తెలియదు. అయితే రష్మీని తన స్కిట్స్‌లో సుధీర్ ఎలా వాడుతాడో హైపర్ ఆది తన స్కిట్స్‌లో అనసూయను అలా వాడుతాడు. గత కొన్ని రోజులుగా హైపర్ ఆది అనసూయపై సెటైర్లు వేయలేదు. కానీ ఈ సారి మాత్రం ఓ రేంజ్‌లో అనసూయను వాడేశాడు.

     ఆ పాటతో..

    ఆ పాటతో..

    ప్రేమ భిక్ష నువ్వే పెట్టి...అంటూ పాట పాడుతూ భగ్న ప్రేమికుడిలా మారిపోయి దేవదాసు అయినట్టుగా అనసూయను తలుచుకుంటూ హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చాడు. విషాద గీతంలో ఆది ఎంట్రీని చూసి అనసూయ షాక్ అయింది. పిచ్చా అన్నట్టు కూడా ఉంది. అది మాత్రమే కాకుండా వరుసగా పరోక్షంగా పంచ్‌లు వేస్తూ దుమ్ముదులిపాడు.

     క్యారవాన్‌లో కాజు బిర్యానీ..

    క్యారవాన్‌లో కాజు బిర్యానీ..

    పాట అయిపోయాక అనసూయతో.. ఎక్కడికి వెళ్తున్నావ్? అని హైపర్ ఆది డైలాగ్ విసురుతాడు..నీ కంటికి కనిపించకుండా దూరంగా వెళ్లిపోదామనుకుంటున్నా అని అనసూయ కౌంటర్ వేసింది. దీంతో వెంటనే..ఎక్కడికి వెళ్తావ్ క్యారవాన్‌లో వెళ్లి కాజు బిర్యానీ తింటాను అని చెప్పొచ్చు కదా అంటూ సెటైర్ వేశాడు.

    నీ ఎక్స్‌ప్రెషన్స్ కూడా..

    నీ ఎక్స్‌ప్రెషన్స్ కూడా..

    నాకు అకలి వేస్తోందని నీకెలా తెలుసు అంటూ అనసూయ ప్రశ్నించింది. నీకు ఆకలి వేయకపోతే అందరి ఎక్స్‌ప్రెషన్స్ నువ్వే ఇస్తావ్.. ఆకలి వేస్తే నీ ఎక్స్‌ప్రెషన్ కూడా నువ్ ఇచ్చి చావవ్ అంటూ అనసూయపై అదిరిపోయే పంచ్ వేశాడు.

     మరిచిపోయి కలిసుందాం..

    మరిచిపోయి కలిసుందాం..

    అన్నీ మరిచిపోయి మనం కలిసి ఉందాం.. వచ్చేయ్ అంటూ నేరుగా అనేస్తాడు ఆది. నువ్ మరిచిపోయినా నేను మరిచిపోను అంటూ అలిగింది అనసూయ. నువ్ ఇలా నరసింహా సినిమాలో నీలాంబరి బిహేవ్ చేస్తే.. నేను రజినీకాంత్‌లా బిహేవ్ చేయాల్సి వస్తది.. నీ పని మనిషి నా పెళ్లాం అవుతది.. నువ్ గదిలో గజ్జలు కట్టుకుని ఏడ్చుకుంటు ఉంటావ్ అని మరో పంచ్ వేశాడు.

    Bigg Boss Telugu Management Gives Clarity Over Host & Show Details
     నేను కర్చీప్ వేస్తాను..

    నేను కర్చీప్ వేస్తాను..

    అక్కడ ఒక అందమైన అమ్మాయి ఉంది ఆమె మీద నేను కర్చీప్ వేస్తాను అని ఓ టీం సభ్యుడు డైలాగ్ వదిలాడు. ఇక్కడ టెంట్‌లు వేశాం అయినా అవ్వడం లేదంటూ అనసూయను తన స్కిట్‌లో వాడేశాడు హైపర్ ఆది. మొత్తానికి వీరిద్దరి వల్ల ప్రోమో మాత్రం ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.

    English summary
    Hyper Aadi Punches On Anasuya Bharadwaj In Jabardasth Skits, Hyper Aadi Punches On DOrababu In Jabardasth Skits, Hyper Aadi And Roja Satires On Dorababu And Paradesi. jabardasth lates promo goes viral. Hyper Aadi And Roja made comments On Dorababu And Paradesi About Prostitution Case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X