దొరబాబును వెంటాడుతున్న గతం.. ఆ విషయాన్ని వదలిపెట్టని హైపర్ ఆది

జబర్దస్త్ షోలో హైపర్ ఆది వేసే పంచ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైపర్ ఆది ప్రాసలకు అందరూ ఫిదా అవుతూ ఉంటారు. హైపర్ ఆది స్కిట్స్ చూస్తూ ఉంటే పగలబడి నవ్వాల్సిందే. హైపర్ ఆదికి, ఆయన స్కిట్స్‌కు ఉండే క్రేజ్ తెలియాలంటే యూట్యూబ్‌లో చూడాల్సిందే. కొన్ని వందల మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టాడు. హైపర్ ఆది స్కిట్ అంటే కచ్చితంగా అందులో దొరబాబు, పరదేశీ ఉంటారు. గత కొన్ని రోజులుగా స్కిట్స్‌లో వీరిపై వేసే పంచ్‌లతో వారి గతం ప్రేక్షకులకు గుర్తుకు వస్తూ ఉంటుంది.

కేసులో పట్టుబడటం..

కేసులో పట్టుబడటం..

దొరబాబు అంతకు ముందు బీ గ్రేడ్ సినిమాల్లో నటించడంపై నిత్యం ఏదో ఒక సెటైర్ వేస్తూనే ఉంటాడు ఆది. దానికి తోడూ దొరబాబు, పరదేశీలు వ్యభిచార గృహంలో పట్టుబడటం, మీడియాలో అది సెన్సేషన్ కావడంతో మరింత ఫేమస్ అయ్యారు. ఆ ఘటన జరిగి దాదాపు మూడు నెలలు అవుతున్నా.. హైపర్ ఆది మాత్రం ఇంకా మరిచిపోలేకపోతున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా దొరబాబు, పరదేశీలపై పంచ్‌లు వేస్తున్నాడు.

గతంలో అలా..

గతంలో అలా..

దొరికితే వదలరు అంటూ.. 2020లో విపత్తులు మొదలైందే వీరిద్దరితో, వీళ్లు దొరికితే వదిలించడానికి నానా.. అంటూ గ్యాప్ ఇచ్చాడు. పొరబాటున ఐమాక్స్ అనుకుని వెళితే అక్కడ వర్మ క్లైమాక్స్ ఉందని కౌంటర్ వేశాడు. మరో స్కిట్‌లో ఇది స్వయం వరమేనా? దొరబాబు వచ్చాడు కదా వేరే కార్యక్రమం అనుకున్నానని పంచ్ వేశాడు. 103 డిగ్రీల టెంపరేచర్ పెరుగుతోందని దొరబాబు అంటే.. పోలీసులు థర్డ్ డిగ్రీ ఇచ్చిన తరువాత కూడానా అని ఆది సెటైర్స్ వేశాడు.

తాజా ప్రోమోలో..

తాజా ప్రోమోలో..

వచ్చే వారం రాబోయే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదలు చేశారు. అందులో దొరబాబుపై వేసిన సెటైర్స్ బాగా పేలాయి. స్కిట్‌లో భాగంగా దొరబాబు సాంబార్ వండాడు. దాని టేస్ట్ చూడమని ఆదికి ఇస్తే.. అక్కడ ఇది కూడా నేర్పించారా? అంటూ సెటైర్ వేసేశాడు. ఇలా ప్రతీ సారి ఏదో ఒక పంచ్ వేయడంతో ఆ గతం మళ్లీ మళ్లీ గుర్తుకు వస్తూనే ఉంది.

Recommended Video

Bigg Boss Telugu Management Gives Clarity Over Host & Show Details
దొరబాబు భార్య ముందు..

దొరబాబు భార్య ముందు..

గత వారంలో దొరబాబు భార్యను కూడా ఎంట్రీ చేయించారు. భార్య ముందే దొరబాబు పరువుదీసేశాడు ఆది. పంచ్‌ల వర్షం కురిపించడానికి ఇలా వారి జీవితంలో జరిగిన సంఘటనలను వాడుకుంటున్నాడు ఆది. అయితే ఆ పంచ్‌లు బాగా క్లిక్ అవుతుండటంతో బాగానే కంటిన్యూ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X