For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జబర్ధస్త్ జోడీ గుట్టు విప్పిన హైపర్ ఆది: ఆ పని చేసి అడ్డంగా బుక్.. వామ్మో నిజంగా ఇంత జరిగిందా!

  |

  ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు ఎనిమిదేళ్లుగా తెలుగు బుల్లితెర చరిత్రలోనే ఎంతో సక్సెస్‌ఫుల్ షోగా వెలుగొందుతోంది ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్. ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రారంభమైన దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తూనే ఉంది. ఇక, ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు బిగ్ సెలెబ్రిటీలుగా వెలుగొందుతున్నారు. అలాంటి వారిలో జంటగా ఫేమస్ అయిన వర్ష.. ఇమాన్యూయేల్ కూడా ఉన్నారు. తాజాగా ఈ జోడీ గుట్టును విప్పేశాడు టాప్ కమెడియన్ హైపర్ ఆది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  Nagababu Re-Entry Rumors Into Jabardasth || Filmibeat Telugu
  వర్ష అలా.. ఇమాన్యూయేల్ ఇలా

  వర్ష అలా.. ఇమాన్యూయేల్ ఇలా

  టాప్ కమెడియన్ హైపర్ ఆది ద్వారా జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ఊహించని రీతిలో క్రేజ్‌ను అందుకుంది వర్ష. అంతకు ముందే పలు సీరియళ్లలో నటించినా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, ఈ షో వల్ల ఫుల్ పాపులర్ అయింది. అలాగే, ‘పటాస్' అనే షో ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు ఇమాన్యూయేల్. ఈ క్రమంలోనే జబర్ధస్త్‌లోకి వచ్చి టాప్ కమెడియన్‌గా వెలుగొందుతున్నాడు.

  జంటగా మారి.. ఫేమస్ అయ్యారు

  జంటగా మారి.. ఫేమస్ అయ్యారు

  ఎంతో మందిని బుల్లితెరపై సెలెబ్రిటీలను చేసేసింది జబర్ధస్త్. అందులో యాంకర్ రష్మీ గౌతమ్.. కమెడియన్ సుడిగాలి సుధీర్ మాత్రం జంటగా క్రేజ్‌ను అందుకున్నారు. ఈ షోలో వీళ్లిద్దరి మధ్య ట్రాక్ నడుస్తున్నట్లు చూపించడమే దీనికి కారణం. వీళ్ల తర్వాత కొత్తగా వర్ష - ఇమాన్యూయేల్ జంట కూడా క్రమక్రమంగా పాపులర్ అవుతోంది. చాలా రోజులుగా వీళ్లు తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

   ముద్దులు, హగ్గులతో రచ్చ చేస్తూ

  ముద్దులు, హగ్గులతో రచ్చ చేస్తూ

  జబర్ధస్త్ షోలో భాగంగా ఇమాన్యూయేల్.. వర్షను జంటగా చూపిస్తున్నారు. అదే సమయంలో వీళ్లిద్దరినీ హైలైట్ చేస్తున్నారు. ఇందుకోసం లవ్ ట్రాకును కూడా క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్త పరచుకోవడంతో పాటు అప్పుడప్పుడూ హగ్గులిచ్చుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం వంటివి చేస్తున్నారు. ఫలితంగా ఈ జంటకు ఓ రేంజ్‌లో క్రేజ్ వచ్చేస్తుంది.

  పెళ్లి కూడా చేసుకుని హాట్ టాపిక్

  పెళ్లి కూడా చేసుకుని హాట్ టాపిక్

  జబర్ధస్త్ వర్ష కొద్ది రోజుల క్రితం తనకు ఎంగేజ్‌మెంట్ రింగ్ ధరించిన ఓ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అంతేకాదు, జూలై 4న బిగ్ అనౌన్స్‌మెంట్ అంటూ పేర్కొంది. దీంతో ఇదంతా నిజమే అని అనుకున్నారు. అయితే, వర్ష చేసింది కేవలం శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రమోషన్ కోసమని తర్వాత తెలిసింది. ఇందులో వర్ష.. ఇమాన్యూయేల్‌కు పెళ్లి చేశారు. ఈ ఎపిసోడ్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది.

  ఇమాన్యూయేల్ కోసం ఏడ్చేసింది

  ఇమాన్యూయేల్ కోసం ఏడ్చేసింది

  ఆ మధ్య ఓ స్కిట్‌లో వర్ష.. ఇమాన్యూయేల్ వేరే పెళ్లి చేసుకున్నట్లు చూపించారు. దీంతో స్కిట్ తర్వాత రోజా ‘వర్ష స్కిట్‌లోనే ఇంత బాధ పడుతుంది. నిజంగా ఇమ్మూకు వేరే వాళ్లతో పెళ్లైతే నీ పరిస్థితితేంటి' అని అడగ్గా.. ‘ప్రతి అమ్మాయి ఇష్టపడిన అబ్బాయితో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటుంది. కానీ, మన ప్లేస్‌లో వేరే వాళ్లు ఉంటే తట్టుకోవడం కష్టం మేడం' అంటూ అక్కడే ఏడ్చేసింది.

  జబర్ధస్త్ జోడీ గుట్టు విప్పేసిన ఆది

  వచ్చే వారం ప్రసారం కాబోతున్న జబర్ధస్త్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో హైపర్ ఆది అదే షోకు పని చేసే డైరెక్టర్‌గా నటించాడు. ఇందులో భాగంగానే షోను పైకి లేపేందుకు అతడు ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడన్నది ఫన్నీగా చూపించాడు. ఇక, ఇందులోనే వర్ష.. ఇమాన్యూయేల్‌ మధ్య జరుగుతోన్న ట్రాక్‌ వెనుక ఉన్న అసలు గుట్టును విప్పేశాడు.

   వామ్మో నిజంగా ఇంత జరిగిందా!

  వామ్మో నిజంగా ఇంత జరిగిందా!

  గతంలో వర్ష.. ఇమాన్యూయేల్ కోసం ఏడ్చిన దాన్ని గుర్తు చేసేలా.. అజీజ్.. రీతూ చౌదరితో నటింపజేశాడు. అప్పుడు రోజా అడగ్గానే వాళ్లిద్దరూ ఎలా చేశారో.. ఇప్పుడు వీళ్లిద్దరూ అలాగే కనిపించారు. దీంతో అప్పుడు జరిగిందంతా డైరెక్షన్‌లో భాగమేనని అర్థం అయింది. దీంతో ఈ జోడీ మధ్య నిజంగా జరిగింది ఇదే అని హైపర్ ఆది బయట పెట్టడంతో మేటర్ లీకైపోయింది.

  English summary
  Jabardasth Varsha Immanuel Very Famous After They Did Romantic Skits. Now Jabardasth Talented Comedian Hyper Aadi did Punches on This Couple Relation
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X