రష్మీ రెచ్చగొడుతుంది.. సుధీర్ అలా చేస్తాడు: జబర్ధస్త్ జోడీ బండారం బయట పెట్టిన హైపర్ ఆది

జబర్ధస్త్‌ షో తెలుగులో ఎంతటి సక్సెస్‌ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీ షోగా వచ్చిన దీనికి ప్రేక్షకులు భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందించారు. ఫలితంగా ఈ షో టీఆర్పీ పరంగా దూసుకెళ్తోంది. ఇక, ఈ షో ద్వారా ఎంతో మంది వెలుగులోకి రావడంతో పాటు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో హైపర్ ఆది ఒకడు. పంచులతో ఉక్కిరిబిక్కిరి చేసే ఈ కమెడియన్.. అనతి కాలంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. ఈ క్రమంలోనే తాజాగా సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ గౌతమ్ బండారాన్ని బయట పెట్టేశాడు. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళితే...

అతడి ద్వారా వచ్చాడు... అదరగొట్టాడు

అతడి ద్వారా వచ్చాడు... అదరగొట్టాడు

కెరీర్ ఆరంభంలో డబ్‌స్మాష్ వీడియోలు, సినిమా స్ఫూఫ్‌లు చేస్తూ కాలం వెళ్లదీసేవాడు ఆది. అవి అప్పట్లో తెగ వైరల్ అయ్యేవి. ఆ సమయంలోనే అదిరే అభి ద్వారా ఆర్టిస్టుగా జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చాడతను. అలా అతడి టీమ్‌లో చేస్తున్న సమయంలోనే స్క్రిప్టు రైటర్‌గా పని చేశాడు. అప్పుడు అతడి పనితనం గుర్తించిన షో నిర్వహకులు ఏకంగా టీమ్ లీడర్‌గా ప్రమోషన్ అందించారు.

జబర్ధస్త్‌లో హైపర్ ఆది స్కిట్లు హైలైట్‌గా

జబర్ధస్త్‌లో హైపర్ ఆది స్కిట్లు హైలైట్‌గా

చాలా కాలంగా జబర్ధస్త్ షోకు తెలుగు ప్రేక్షకుల నుంచి ఎంతో ఆదరణ లభిస్తోంది. గతంలో ఉన్న దాని కంటే హైపర్ ఆది టీమ్ లీడర్ అయిన తర్వాత దీనికి రెస్పాన్స్ మరింత ఎక్కువైందని చెప్పొచ్చు. కేవలం అతడి స్కిట్ల కోసమే షోను చూసే వారు వేల మందే ఉన్నారు. దీనికి కారణం గుక్క తిప్పుకోకుండా పంచులు వేయగలగడమే. అందుకే అతడికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

 ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే.. రికార్డ్స్ కూడా

ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే.. రికార్డ్స్ కూడా

జబర్ధస్త్ స్కిట్లకు యూట్యూబ్‌లో మంచి స్పందన వస్తోంది. హైపర్ ఆది టీమ్ లీడర్ అయిన తర్వాత అతడి స్కిట్లే ప్రతి వారం నెంబర్ వన్ స్థానంలో ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా అతడి స్కిట్లకు మిలియన్‌కు పైగా వ్యూస్ వస్తుంటాయి. ఈ క్రమంలోనే ప్రతి వారం అతడు ట్రెండింగ్‌లో ఉంటున్నాడు. ఇలా ఎన్నో స్కిట్ల ద్వారా పలు రికార్డులను క్రియేట్ చేశాడీ జబర్ధస్త్ కమెడియన్.

వాళ్లందరిపై దండయాత్ర చేస్తున్న ఆది

వాళ్లందరిపై దండయాత్ర చేస్తున్న ఆది

హైపర్ ఆది తన స్కిట్లలో ఎక్కువ శాతం సమాజంలో జరిగే ట్రెండింగ్ అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాడు. అలాగే, అద్భుతమైన టైమింగ్‌తో తన టీమ్ మెంబర్లపై పంచుల వర్షం కురిపిస్తుంటాడు. ఈ క్రమంలోనే జడ్జ్‌లు, యాంకర్లను కూడా వదలిపెట్టడు. ఇలా ఒకటే స్కిట్లో ఎంతో మందిని టార్గెట్ చేస్తూ సెటైర్లు పేలుస్తుంటాడు. ఈ కారణంగానే అవన్నీ హిట్ అవుతుంటాయి.

అందులోకి కూడా ఎంట్రీ ఇచ్చిన హైపర్

అందులోకి కూడా ఎంట్రీ ఇచ్చిన హైపర్

ప్రతి గురువారం ప్రసారం అయ్యే జబర్ధస్త్‌లో హైపర్ ఆది టీమ్ లీడర్‌గా పని చేస్తున్న విషయం తెలిసిందే. ఆరోజు మొత్తానికి అతడి స్కిట్లే హైలైట్‌గా ఉండేలా శ్రమిస్తుంటాడు. అదే సమయంలో ఎవరైన గెస్ట్ రోల్ ఇస్తే శుక్రవారం వచ్చే ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్‌లో సైతం మెరుస్తుంటాడు. ఇప్పటికే ఇలా ఎంతో మందికి సాయం చేశాడు. ఇప్పుడు రాకింగ్ రాకేష్ టీమ్ కోసం మరోసారి అందులోకి వచ్చాడు.

జడ్జ్‌లు ఇద్దరికీ షాకిచ్చిన కమెడియన్

వచ్చే వారం ప్రసారం కానున్న ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్‌కు గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు హైపర్ ఆది. ఇందులో ఎప్పటిలాగే తనదైన శైలి కామెడీతో నవ్వించాడు. మరీ ముఖ్యంగా జడ్జ్ మనోతో కలిసి ఓ స్కిట్ కూడా చేశాడు. ఆ సమయంలో ఆయనపై పంచుల వర్షం కురిపించాడు. అంతేకాదు, 'మరగబెట్టే మనో.. ఇరగదీసే ఇంద్రజ అని మీరు కూడా ఓ టీమ్ పెట్టాల్సింది' అంటూ జడ్జ్‌లకే షాకిచ్చాడు.

Recommended Video

Chiranjeevi Releases Shasi Movie Teaser
రష్మీ సుధీర్ రిలేషన్‌పై పంచ్ పేల్చాడు

రష్మీ సుధీర్ రిలేషన్‌పై పంచ్ పేల్చాడు

ఇక, ఇదే స్కిట్‌లో సుడిగాలి సుధీర్.. రష్మీ గౌతమ్ రిలేషన్ మీద కూడా పంచ్ పేల్చాడు హైపర్ ఆది. జడ్జ్‌ల గురించి టీమ్ పేరు చెప్పగానే యాంకర్ 'హలో హలో మరి నాకేం టీమ్ లేదా' అని ప్రశ్నించింది. దీనికి వెంటనే స్పందించిన హైపర్ ఆది 'నీకెందుకు లేదు.. సుత్తికొట్టే సుధీర్.. రెచ్చగొట్టే రష్మీ' అంటూ పంచ్ వేశాడు. తద్వారా వాళ్ల మధ్య జరుగుతున్న దాన్ని బయట పెట్టాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X