తోక ముడిచిన కత్తి మహేష్.. హైపర్ ఆది ఏడు ప్రశ్నలు.. నీ తల్లి, తండ్రి, అక్క అంటూ ..
Recommended Video

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, కత్తి మహేష్ మధ్య వివాదం రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతున్నది. ఆదివారం ఓ ప్రముఖ టెలివిజన్ ఛానెల్ నుంచి దర్శకుడు వివేక్ లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక మధ్యలో చర్చ నుంచి నిష్క్రమించిన కత్తి మహేష్‌కు సోషల్ మీడియాలో చుక్కెదురైంది. తన కుటుంబం గురించి లేవనెత్తిన ఏడు ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నీపై దాడి చేస్తే ఏంచేస్తావు..
ఆదివారం ఓ టెలివిజన్ ఛానెల్‌లో కత్తి మహేష్, లెజెండ్ మాటల రచయిత, దర్శకుడు వివేక్ మధ్య చర్చ కార్యక్రమం ప్రారంభమైంది. ఆ చర్చలో మొదట కత్తి మహేష్ మాట్లాడారు. ఆ తర్వాత దర్శకుడు వివేక్ గురించి మాట్లాడుతూ.. లైవ్ కార్యక్రమంలో నీ మీద దాడి చేస్తే ఏం చేస్తావు అని అడిగాడు.

పోలీసులకు ఫిర్యాదు చేస్తా
అందుకు కత్తి సమాధానం చెబుతూ.. పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తాను అని అన్నాడు. పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయాలి.. ప్రజల వద్దకు వెళ్లి చెప్పుకోవాలి అని వివేక్ ప్రతి సమాధానం ఇచ్చాడు.

నీ అమ్మ గురించి చెప్పు
ఆ తర్వాత రేణు దేశాయ్, పూనమ్ కౌర్ లాంటి వారి మీద కామెంట్లు చేస్తున్నావు కదా.. మీకు జన్మనిచ్చిన తల్లి గురించి వివారాలు చెప్పు అని వివేక్ మరో ప్రశ్న సంధించాడు. అయితే అందుకు కత్తి నిరాకరించాడు. పదే పదే నీ తల్లి గురించి చెప్పమని అడుగగా బుల్‌షిట్ అంటూ చర్చ మధ్యలో నుంచి లేచిపోయాడు.
సోషల్ మీడియాలో ఏడు ప్రశ్నలు
ఈ పరిస్థితుల నేపథ్యంలో కత్తి మహేష్‌కు జబర్దస్థ్ ఆది ఏడు ప్రశ్నలు సంధించాడు. ఆ ప్రశ్నలు ఇవే..

ఇరుకున పడ్డ కత్తి మహేష్
కత్తి మహేష్ తండ్రి నిజంగానే అవినీతికి పాల్పడ్డాడా.. వాయల్పాడు గ్రామానికి నీ కుటుంబం ఎందుకు రాదు.. చిట్టీల పేరుతో ఈ అమ్మ రైతులను మోసం చేసిందా అనే ప్రశ్నలకు సమాధానం చెబుతాడా? వేచి చూడాలి.

అంబటి రాంబాబు సహకారామా?
ఇక బిగ్‌బాస్ కార్యక్రమంలో పాపులారిటీ సంపాదించుకొన్న సంగతి తెలిసిందే. అయితే బిగ్‌బాస్ షోకు వెళ్లడానికి వైసీపీ నేత అంబటి రాంబాబు సహకారం అందించాడు అనేది ఈ ఏడు ప్రశ్నల్లో ఒకటి..

ఏడు ప్రశ్నలకు జవాబు
కత్తి మహేష్‌ను ఇరుకున పెట్టేందుకు హైపర్ ఆది పోస్ట్ చేసిన ఏడు ప్రశ్నలకు టెలివిజన్ లైవ్ ద్వారానైనా లేదా సోషల్ మీడియాలోనైనా స్పందిస్తారా లేదా వేచి చూడాల్సిందే..


Click it and Unblock the Notifications











