ఎంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్.. ఇవ్వలే వచ్చింది.. జబర్దస్త్ బ్రేక్‌‌పై హైపర్ ఆది పంచ్

'జబర్ధస్త్' షో ద్వారా భారీ పాపులారిటీ సంపాదించాడు హైపర్ ఆది. తనదైన స్టైల్ పంచులు, ప్రాసలతో ఆయన వేసే స్కిట్స్ బుల్లితెర ఆడియన్స్‌కి గిలిగింతలు పెడుతుంటాయి. అందుకే హైపర్ ఆది స్కిట్ వస్తుందంటే చాలు అందరూ పొట్టలు పట్టుకుని రెడీగా ఉంటారు. అలాంటి హైపర్ ఆది ఉన్నట్టుండి జబర్ధస్త్ టీమ్‌కు దూరమయ్యాడు. నిన్నటి వరకు ఇలాంటి వార్తలు విన్నాం కానీ వాటిని పటాపంచలు చేస్తూ పంచ్ డైలాగ్‌తో జబర్దస్త్ వేదికపై వాలాడు హైపర్ ఆది.

జబర్ధస్త్‌కు ఆది టీమ్ దూరం

జబర్ధస్త్‌కు ఆది టీమ్ దూరం

గురువారం వచ్చిందంటే చాలు పిల్లలు, పెద్దలు అందరూ కలిసి టీవీల ముందుకు వచ్చేస్తుంటారు. దీనికి కారణం ఆరోజు జబర్దస్త్ ప్రోగ్రాం వస్తుంది కాబట్టి. ఈ వారం అలా చూస్తున్న వారికి షాక్ తగిలింది. ఎందుకంటే ఈ వారం హైపర్ ఆది స్కిట్ రాలేదు. మిగిలిన ఐదు టీమ్‌లు మాత్రమే ప్రదర్శన చేశాయి. ఈ ప్రోగ్రాం ముగిసిన తర్వాత అందరి మదిలో ఆది టీమ్ ఎందుకు రాలేదనే అనుమానాలు కలిగాయి.

హైపర్ ఆదిపై అనుమానాలు.. ఫిక్సయ్యారు

హైపర్ ఆదిపై అనుమానాలు.. ఫిక్సయ్యారు

ఉన్నట్టుండి హైపర్ ఆది కనిపించక పోవడంతో ఇక హైపర్ ఆది జబర్దస్త్ వదిలేశాడేమో అనే అనుమానాలు పెట్టుకున్నారు బుల్లితెర ప్రేక్షకులు. ఈ లోగా హైపర్ ఆది మిస్సింగ్ పై పలు వార్తలు షికారు చేయడంతో జబర్దస్త్ షోలో హైపర్ ఆది కనిపించాడని ఫిక్స్ అయ్యారంతా.

ఇంతలో సైకిల్‌పై ప్రేయసితో అలా అలా

కాగా జబర్దస్త్ షోకి సంబంధించి తాజాగా విడుదలైన ప్రోమోతో అనుమానాలను పటాపంచలు చేస్తూ రీ ఎంట్రీ ఇచ్చారు హైపర్ ఆది. ఇందులో ‘నీ దారి పూల దారి... పోవోయి బాటసారి' అంటూ శాంతి స్వరూప్‌‌ని సైకిల్ ఎక్కించుకుని అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ఏంట్రోయ్.. గ్యాప్ ఇచ్చావ్ అని ప్రేయసి అడగ్గానే.. ‘గ్యాప్ ఇవ్వలేదు వచ్చింది' అంటూ పంచ్ డైలాగ్ విసిరాడు ఆది.

హైపర్ ఆది జబర్ధస్త్‌.. వేదికపై తనదైన మార్క్

హైపర్ ఆది జబర్ధస్త్‌.. వేదికపై తనదైన మార్క్

హైపర్ ఆది జబర్దస్త్‌లోకి రావడానికి కారణం అదిరే అభినే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని ఆది కూడా చాలా సార్లు చెప్పాడు. మొదట అభి టీమ్‌లో మెంబర్‌గా చేసిన ఆది.. తన రైటింగ్ స్కిల్స్‌తో మెయిన్ కమెడియన్‌గా ఎదిగాడు. తర్వాత కొన్ని ప్రత్యేక షోలకు స్క్రిప్ట్ రాశాడు. అవి భారీ స్పందనను దక్కించుకున్నాయి. ఆ తర్వాత అతడి టాలెంట్‌ను గుర్తించిన జబర్ధస్త్ నిర్వహకులు అతడిని ఓ టీమ్‌కు కెప్టెన్ చేయడంతో జబర్దస్త్ వేదికపై తన మార్క్ చూపించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X